newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

కొని తెచ్చుకున్న వివాదాలతో జగన్ రాజకీయ పోరాటం!

30-05-202030-05-2020 07:03:35 IST
Updated On 30-05-2020 11:00:18 ISTUpdated On 30-05-20202020-05-30T01:33:35.360Z30-05-2020 2020-05-30T01:33:06.400Z - 2020-05-30T05:30:18.447Z - 30-05-2020

కొని తెచ్చుకున్న వివాదాలతో జగన్ రాజకీయ పోరాటం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులపై దేశవ్యాప్తంగా చర్చగా మారింది. కారణం.. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం నుండి న్యాయస్థానాల వరకు వ్యతిరేకించడం. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ లో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఒకటికి నాలుగు సార్లు చెప్పినా వినకపోవడంతో ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్లలో కేంద్రం కీలకమార్పులు చేసిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఒకటేమిటి.. రెండేమిటి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అరవైకి పైగా నిర్ణయాలను సంస్థలు, కేంద్రం, కోర్టులు వ్యతిరేకించాయంటే సహజంగా దేశం దృష్టి రాష్ట్రంపై పడుతుంది. ఇక తాజాగా పరిణామాలను చూస్తే.. ఏ రోజుకి ఆ రోజు రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వస్తూనే ఉన్నాయి. డీజీపీ నుండి సిఎస్ వరకు అందరూ ధర్మాసనం ముందు బోనులో నిలబడాల్సి వచ్చింది.

చివరికి శుక్రవారం హైకోర్టు ఇచ్చిన ఎన్నికల కమిషనర్ తీర్పులో ఆ గవర్నరును సైతం దోషిగా నిలబెట్టేసింది ఏపీ ప్రభుత్వం. రాజ్యాంగ సంస్థల నిబంధనలను ఉల్లఘించి ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం.. దానికి గవర్నర్ ఎలాంటి న్యాయసంప్రదింపులు చేయకుండా ఎలా సంతకం చేశారన్న దానిపై గవర్నర్ బీబీ హరిచందన్ సైతం ఇరుకున పడ్డారు.

అయితే, ఇప్పటికే ప్రభుత్వానికి తీవ్ర భంగపాటులే మిగిలినా జగన్ సర్కార్ మాత్రం ఇంకా అదే మొండిగా ఆలోచనలో ఉన్నట్లుగా కథనాలు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో తాజాగా హైకోర్టు తీర్పుపై సుప్రీమ్ కోర్టుకు వెళ్లాలని న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా రాజకీయవర్గాలలో అప్పుడే కథనాలు వస్తున్నాయి.

కాగా ఇప్పటికే అధికార పార్టీ నేతలు.. మేము ప్రతిపక్ష పార్టీలతోనే కాదు.. న్యాయస్థానాలతో కూడా పోరాటం చేస్తున్నామని చెప్పిన మాటలు వింటే రాజకీయ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఏ ప్రభుత్వమైనా న్యాయస్థానాలతో యుద్ధం చేయడం అంటే కొరివితో తల గోక్కున్నట్లేనని చెప్పుకోవాలి. తెలిసి తెలిసి రాజ్యాంగ వ్యవస్థలకు ఎదురెళ్ళడం సాహసం అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు.

నిజానికి జగన్ ప్రస్తుతం చేస్తున్నదంతా కొనితెచ్చుకున్న వివాదాలతో రాజకీయ యుద్ధమేనని చెప్పాలి. ముందుగా శాసనమండలి విషయానికి వస్తే.. మండలిలో బలం లేకుండా బిల్లు తీసుకెళ్లడం పొరపాటైతే.. దానికి మొండికిపోయి చివరికి మండలే రద్దు వరకు వెళ్లారు. కానీ ఇప్పటికీ ఆ విషయంలో ప్రభుత్వానికి ఒరిగింది ఏమి లేదు. పైగా మరో ఆరునెలలు పోతే అక్కడ కూడా ప్రభుత్వానికే మెజార్టీ. కనుక అది ప్రభుత్వానికే నష్టం.

ఇక ఎన్నికల కమిషనర్ విషయాన్నే తీసుకుంటే ఈరోజు, రేపు లేదా ఎల్లుండి.. ఏదోకరోజు ఎన్నికలు జరిపి తీరాలి. కానీ, తన నిర్ణయాన్ని విమర్శించడం ఒక ఎత్తైతే.. కులాన్ని తెచ్చి.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని సామాన్య కర్తలతో కూడా తిట్టించడం కొనితెచ్చుకున్న వివాదమే. ఇంకా మొండిగా దొడ్డిదారిన తనను తొలగించి.. మాజీ న్యాయమూర్తిని ఆ పదవిలో కూర్చోబెట్టారు.

ఇక్కడ కూడా ఎన్నో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని జగమెరిగిన సత్యమే. చట్టాలపై అవగాహన కలిగిన వ్యక్తయినా ప్రభుత్వం పట్టుదలతో చివరికి మాజీ న్యాయమూర్తిని సైతం విమర్శలపాలు చేశారు. డాక్టర్ సుధాకర్ విషయంలో చేసింది కూడా అతే. పై అధికారితో ఆరోపణలు ఖండిస్తే పోయే దాన్ని రాజకీయం చేయాలనీ చూసి చివరికి పంతానికి పోయి అదే న్యాయస్థానం ముందు బొక్కబోర్లా పడ్డారు.

ఎక్కడో రంగనాయకమ్మ రాష్ట్రంలో ఎవరికి తెలుసు. కానీ సీఐడీ రంగంలోకి తెచ్చి ఆవిడను రాష్ట్రమంతా తెలిసేలా చేశారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును పట్టుకొని ఆ విషయాన్ని రాష్ట్రమంతా తెలిసేలా చేసింది ప్రభుత్వమే. ఇక్కడ ఒకమాట చెప్పుకోవాలి.. రంగనాయకమ్మ అసభ్యంగా పోస్టు పెట్టారని.. విశాఖ డాక్టర్ అసభ్యంగా తిట్టారని కేసులు పెట్టాలన్నారు. ఏకంగా మంత్రులు మీడియాకెక్కి తిడుతుంటే.. దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు అందుకుంటున్నారు. మరి దాని గురించి ఎన్ని కేసులు పెట్టాలి.

ఇక ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయకూడదని ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్ వ్యక్తులకు కూడా తెలుసు. మరి ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకున్న ఐఏఎస్ అధికారులకు తెలియదా? పోనీ ఒకసారి హైకోర్టు రంగులను తీసేయాలని తీర్పునిచ్చినా.. మళ్ళీ ఇంకో రంగు కలిపి జీవో తేవడం దేనికి సంకేతం.. ఇది కొనితెచ్చుకున్న వివాదం కాదా? ఈ కేసులో చివరికి ప్రభుత్వం ప్రధానకార్యదర్శి మహిళా ఉన్నతాధికారి అయినా నీలం సహానీ కోర్టులో నిలబడాల్సి వచ్చింది.

అసలు డాక్టర్ సుధాకర్ తో పోరాటం.. రంగనాయకమ్మతో పోరాటం.. రంగులు వేయాలని పోరాటం.. ఎన్నికల కమిషనర్ తో పోరాటం.. ఏంటి అసలు ఇదంతా. పోనీ పోరాడినా ఇటు ప్రభుత్వానికి కానీ.. అటు తన పార్టీకి కానీ ఏమైనా కలిసి వచ్చిందా? అదీ లేదు. పార్టీల వారీగా విడిపోయిన ప్రజలకు ఈ వివాదాలలో తప్పొప్పులు లెక్కించకపోవచ్చు. కానీ తటస్థ ఓటరు మాత్రం ప్రతిదీ గమనిస్తూనే ఉంటాడు. ఆ ఓటరే రాజకీయ పార్టీల భవిష్యత్ ను మార్చేది.. నేతల తలరాతను రాసేది. జగన్ ప్రభుత్వం ఇకనైనా ఆ విషయాన్ని గమనించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

 

 

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

   10 hours ago


దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

   11 hours ago


ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

   11 hours ago


ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

   12 hours ago


ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

   12 hours ago


దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

   13 hours ago


శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

   13 hours ago


రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

   14 hours ago


అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

   15 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle