newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

కొత్త ప్రధాని ఎవరు బాబూ.. కాస్త చెప్పరాదే !

09-05-201909-05-2019 08:53:36 IST
Updated On 01-07-2019 11:40:48 ISTUpdated On 01-07-20192019-05-09T03:23:36.498Z09-05-2019 2019-05-09T03:23:23.012Z - 2019-07-01T06:10:48.150Z - 01-07-2019

కొత్త ప్రధాని ఎవరు బాబూ.. కాస్త చెప్పరాదే !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నోట దేశానికి కొత్త ప్రధాని మాట వినబడింది. గతంలో నేషనల్ ఫ్రంట్, తర్వాత ఎన్డీయే కన్వీనర్‌గా దేశప్రధానిని నిర్ణయించడంలో కింగ్ మేకర్‌గా వ్యవహరించారు చంద్రబాబు. 2019లో మళ్ళీ తన రాజకీయ చాణక్యం చూపించబోతున్నారా? కొత్త ప్రధాని ఎవరై ఉంటారనే ఊహాగానాలు ఢిల్లీ వీధుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ హల్ చల్ చేస్తున్నాయి.

ఈ నెల 23తరువాత దేశం కొత్త ప్రధానిని చూడబోతోందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ మాటలు అనడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  బీజేపీకి ఈసారి తీవ్ర పరాభవం తప్పదని, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక అందరూ కూర్చొని చర్చించి ప్రధాని అభ్యర్థి గురించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి బలాన్నిచ్చే యూపీలో ఎదురుగాలి వీస్తోందన్న వార్తలు వస్తున్నాయి. దక్షిణాదిన కూడా మోడీ ప్రభావం ఏమాత్రం లేదు. కేవలం కర్నాటక మాత్రం వారికి ఆశాజనకంగా ఉంది. 

‘‘భారత ప్రజాస్వామ్యం గొప్పతనం ఇదే. ప్రధాని ఎవరు అన్నది మీరు, నేను డిసైడ్ చేయలేం. మెజారిటీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును ఇచ్చేశారు. ఫలితాల తరువాత దేశానికి ఎవరు ప్రధాని అయితే మంచిదన్న విషయమై ఏకాభిప్రాయానికి వస్తాం. ఈ నెల 21న సమీక్షా సమావేశం జరుగుతుంది. మే 23 తర్వాత సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని చంద్రబాబు పేర్కొనడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. మరి బాబు మనసులో కొత్త ప్రధాని ఎవరో ఒకరు ఇప్పటికే నిర్ణయమై ఉంటుంది. ఈ అత్యున్నత పదవికి చంద్రబాబుకంటే సీనియర్ ఎవరుంటారని భావిస్తే మాత్రం ప్రధాని రేసులో ఆయన పేరే వినబడక మానదు. అప్పటివరకూ కొత్త ప్రధాని గురించి మల్టీపుల్ ఛాయిస్ ఆన్సర్స్ చక్కర్లు కొట్టడం ఖాయం. ఈ వ్యాఖ్యల వెనక రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడ కూడా ఉందనే ప్రచారం మొదలైంది.

మరోవైపు రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి కూడా చంద్రబాబు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడితే... ప్రాంతీయ పార్టీలకే ప్రధాని పదవి దక్కే అవకాశం ఉంటే... ప్రధాని పీఠం టీడీపీ అధినేత చంద్రబాబుకి దక్కే అవకాశం ఉందన్నారు. మోదీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చెయ్యడంలో, మోదీని వ్యతిరేకించడంలో మమతా బెనర్జీ, మాయావతి కంటే చంద్రబాబే ముందు ఉన్నారు. ఒకవేళ ప్రధాని అవకాశం వస్తే మాత్రం చంద్రబాబు వదులుకోరని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి చక్రం తిప్పే ఛాన్స్ దక్షిణాదికి వస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి? 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle