newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

కొత్త టీమ్ ను రెడీ చేస్తున్న జ‌గ‌న్..!

27-05-201927-05-2019 12:45:32 IST
Updated On 26-06-2019 15:30:47 ISTUpdated On 26-06-20192019-05-27T07:15:32.993Z26-05-2019 2019-05-26T14:03:22.976Z - 2019-06-26T10:00:47.880Z - 26-06-2019

 కొత్త టీమ్ ను రెడీ చేస్తున్న జ‌గ‌న్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజ‌యం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ప్రమాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఇప్పటికే వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశ‌మ‌వుతూ ఆయా శాఖ‌ల ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న పెంచుకుంటున్నారు. అయితే, ఆయ‌న ప‌దవీ బాధ్యత‌లు చేప‌ట్టగానే పెద్ద ఎత్తున అధికారుల బ‌దిలీలు ఉంటాయ‌ని ప్రచారం జ‌రుగుతోంది. గ‌త ప్రభుత్వంలో కీల‌కంగా వ్యవ‌హ‌రించి, చంద్రబాబుకు స‌న్నిహితంగా ఉన్న చాలా మంది అధికారుల‌ను జ‌గ‌న్ మారుస్తార‌ని తెలుస్తోంది.

ఇప్పటికే ఇందుకు సంబంధించి ఆయ‌న క‌స‌ర‌త్తు చేస్తున్నారు. గ‌తంలో త‌న తండ్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ద్ద ప‌నిచేసిన అధికారుల్లో కొంద‌రికి జ‌గ‌న్ ప్రాధాన్యత ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇప్పటికే ఎవ‌రెవ‌రు ఏయే స్థానాల్లో ఉంటార‌నేది దానిపై అధికార వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది.

 

రాష్ట్ర సీఎస్ గా ఎన్నిక‌ల సంఘం నియ‌మించిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొన‌సాగించే అవ‌కాశం ఉంది. ఆయ‌న గ‌తంలో వైఎస్సార్ హ‌యాంలోనూ కీల‌కంగా ప‌నిచేశారు. ఆయ‌న‌కు రాష్ట్ర ప‌రిస్థితుల‌పై పూర్తి అవ‌గాహ‌న కూడా ఉంది. అందుకే జ‌గ‌న్ ఆయ‌న‌ను ప్రధాన‌మంత్రి వ‌ద్దకు కూడా తీసుకెళ్లారు. సీఎస్ గా ఆయ‌న‌ను కొన‌సాగించ‌డం దాదాపు ఖాయ‌మే.

ఇక‌, ప్రస్తుత డీజీపీ ఠాకూర్ ను జ‌గ‌న్ త‌ప్పించి గౌత‌మ్ స‌వాంగ్ కు అవ‌కాశం ఇస్తార‌నే ప్రచారం ఉంది. ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ పై విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్టులో దాడి జ‌రిగిన స‌మ‌యంలో, వై.ఎస్‌.వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు వ్యవ‌హ‌రాంలో డీజీపీ ఠాకూర్ వైఖ‌రిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో ఎట్టి ప‌రిస్థితుల్లో ఆయ‌న‌ను కొన‌సాగించే అవ‌కాశం లేదంటున్నారు. ఫలితాలు వెల్లడైన రోజున ఠాకూర్ మ‌ర్యాద‌పూర్వకంగా జ‌గ‌న్ ను క‌లిశారు. అయితే, జ‌గ‌న్ మాత్రం సీనియ‌ర్ ఐపీఎస్ గౌత‌మ్ స‌వాంగ్ ను డీజీపీగా నియ‌మించాల‌ని ఓ క్లారిటీకి వ‌చ్చార‌ట‌. 1986 బ్యాచ్ కు చెందిన ఆయ‌న ప్రస్తుతం విజిలెన్స్ ఆండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్నారు.

ఇక‌, ముఖ్యమంత్రి కార్యద‌ర్శిగా ధ‌నుంజ‌య‌రెడ్డిని జ‌గ‌న్ తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. ఫ‌లితాలు వ‌చ్చిన రోజు నుంచి జ‌గ‌న్ వ‌ద్ద ధ‌నుంజ‌య‌రెడ్డి చురుగ్గా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న ద‌గ్గర ఉండి మ‌రీ అధికారుల‌ను జ‌గ‌న్ కు ప‌రిచ‌యం చేయించారు. శ్రీకాకుళం జిల్లా క‌లెక్టర్ గా కూడా ప‌నిచేసిన ఆయ‌న‌కు ఉత్తరాంధ్ర జిల్లాల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉంది. ఆయ‌న‌ను సీఎం కార్యద‌ర్శిగా తీసుకోవ‌డం కూడా ఖాయంగా తెలుస్తోంది.

ఇక‌, కేంద్ర స‌ర్వీసుల్లో ఉన్న ప‌లువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా రాష్ట్రానికి వ‌చ్చేందుకు మొగ్గు చూపుతున్నార‌ని స‌మాచారం. గ‌తంలో విజ‌య‌వాడ సీపీగా ప‌నిచేసి ప్రస్తుతం సెంట్రల్ స‌ర్వీస్ లో ఉన్న ఓ ఐపీఎస్ అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియ‌మించ‌వ‌చ్చనే ప్రచారం జ‌రుగుతోంది. మొత్తంగా కీల‌క‌మైన స్థానాల్లో జ‌గ‌న్ పాత వారిని ప‌క్కన‌పెట్టి కొత్త వారిని తీసుకోవాల‌నేది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. గ‌తంలో కూడా ప్రభుత్వాలు మారిన‌ప్పుడు కీల‌క స్థానాల్లో అధికారుల‌ను మార్చి కొత్త వారిని పెట్టుకోవ‌డం సంప్రదాయంగా మారింది. 


Anand Murthy


With over 20 years of journalistic experience with major media houses and government agencies, Ananda Murthy Motamarri specialises in items on Political Affairs, Current Affairs and Feature writing at News Sting. His expertise on both Telugu as well as English has seen him translating more than 50 books from English to Telugu and vice versa. He also specialises is crafting content for digital media and is known for his research work into content development.
 anand.m@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle