newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

కొత్త కటౌట్ చూసి కొన్ని నమ్మొచ్చా?

16-01-201916-01-2019 19:08:18 IST
2019-01-16T13:38:18.750Z16-01-2019 2019-01-16T13:38:08.160Z - - 17-07-2019

కొత్త కటౌట్ చూసి కొన్ని నమ్మొచ్చా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులేమో కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం సరికొత్త  కాంబినేషన్లూ, క్యారెక్టర్లతో కొత్తకొత్త కటౌట్లు కనిపిస్తున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడే అన్నది పాత లెక్కే ఇక్కడ మళ్ళీ రిపీటవుతోందా? సరిగ్గా .. ఇప్పుడా లెక్కనే  చంద్రబాబుకు అప్పచెప్తున్నట్లున్నారు కెసిఆర్ అండ్ జగన్ ! ఫెడరల్ ఫ్రంట్ బోర్డు పెట్టి బ్యాక్ ఎండ్‌లో జరిగిపోయిన ఒక సరాసరి రాజకీయమే ఇవ్వాళ హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఆవిష్కృతమైందా‌? ఇక్కడ కెసిఆర్, జగన్‌లు చేస్తున్న పని తప్పా లేక  ఒప్పా?  తమ ఉమ్మడి శత్రువు చంద్రబాబు పట్ల  కెసిఆర్- జగన్ ఇద్దరూ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఎలా అర్ధం చేసుకుంటారు?  కెసిఆర్ చంద్రబాబుకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అన్న ప్రశ్నల నుంచి మోడీ కనుసైగల మేరకే ఈ తతంగమంతా జరిగిపోతోందన్న అనుమానాలకు కాళ్ళొచ్చిన పరిస్థితి.

జగన్-కేటీయార్లిద్దరూ లోపల ఏం చర్చించారన్నది ఇప్పుడు అప్రస్తుతమౌతుంది. అసలా కలయికే రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేలా వుందన్నది ముమ్మాటికీ నిజం. కొంతకాలంగా జాతీయ స్థాయిలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునే క్రమంలో కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చేస్తున్న పనులు దేశమంతా తెలియకపోయినా ఇద్దరికైతే కచ్చితంగా తెలిసుండాలి. ఒకరు చంద్రబాబు, రెండవది నరేంద్ర మోడీ..! చంద్రబాబు ఈ ఫెడరల్ ఫ్రంట్‌ను ఎగరని గాలిపటమంటూ మళ్ళీ మళ్ళీ కొట్టేశారు. పైగా ఇదంతా మోడీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెసు వైపు పోకుండా పోగెయ్యడానికి కెసిఆర్ ఆడుతున్న నాటకమంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఇక మోడీ మాత్రం ఫెడరల్ ఫ్రంటా.. నాకేం తెలీదే అంటూ అమాయకపు ఫోజు పెట్టి ఏకంగా సైడిచ్చుకున్నారు. మోడీ గడుసుతనాన్ని అర్ధం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. చంద్రబాబు గురించి కూడా ఇక్కడే ఇంకో ఒక ముచ్చట కూడా చెప్పుకోవాలి. మొన్న తెలంగాణ ఎన్నికల ముందు తాను వెళ్లి స్నేహహస్తం చాపితే కాదన్న తెరాస ఇప్పుడు ఎదురెళ్లి జగన్ని కావలించుకుంటుంటే ఏం చెయ్యాలో పాలుపోనితనం.. అంతేకాదు తన ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టుకున్న మహాకూటమి అనబడే కాంగ్రెస్ ఫ్రంటుకు పార్లల్‌గా కెసిఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ పనిని ఆమోదించలేని పరిస్థితి.

ఇంతకీ కెసిఆర్ జగనుడితో కలిసి చేసే రాజకీయం ఏమై ఉంటుంది? అయినా కెసిఆర్‌కు ఆంధ్రాలో కాళ్ళూవేళ్ళూ పెట్టే  పరిస్థితి ఉంటుందా లేక ఇదేమైనా ‘నీ జర్క్’ రియాక్షన్‌‌గా సరిపెట్టేసుకోవాలా? కొంతసేపటి క్రితమే కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్సెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాయబోతున్నారంటూ వార్త. గతంలో ఆంధ్రాకు ప్రత్యేక హోదాను అడ్డంగా వ్యతిరేకించిన కెసిఆర్ ఎందుకిప్పుడీ నిర్ణయం తీసుకున్నారని అడిగితే అక్కడి నుంచి వినిపించే జవాబులే డిఫరెంట్. అప్పట్లో మా పార్లమెంట్ నాయకుడు కేశవ్ రావు ఏపీకి అనుకూలంగా మాట్లాడలేదా అంటూ కౌంటర్లిస్తారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే పెట్టుబడులన్నీ అటే పోతాయంటూ దీర్ఘాలు  తీసిన తెరాస ఇప్పుడు ఈ యూటర్న్ తీసుకోవడం పక్క పొలిటికల్ గేమ్... అనుమానమే లేదు. జగన్ ప్రత్యేక హోదా గురించి పదేపదే ప్రస్తావిస్తూ అటువంటి హోదా ఇవ్వని మోడీని వదిలేసి చంద్రబాబును టార్గెట్ చెయ్యడం గమనించాల్సిన విషయం. హోదా విషయంలో చంద్రబాబు కొట్టిన పల్టీలు కూడా గుర్తుంచుకోదగినవే.

అయితే ఇవ్వాళ ఏపీలో జగన్ తనకు మద్దతుగా కెసిఆర్ సాయం ఏదైనా తీసుకుంటే.. ప్రత్యేక హోదా వద్దన్నవాళ్ళతో మీకు సంబంధాలేంటన్న ప్రశ్నలు తలెత్తుతాయి.  బహుశా ఇదే విషయం వాళ్ళిద్దరిమధ్య ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చు. ప్రత్యేక హోదాకు మద్దతుగా కెసిఆర్ తన స్టాండును మార్చుకుని  ఉండవచ్చు కూడా ! ఏదైతేనేం.. కెసిఆర్-జగన్ కాంబినేషన్లో విడుదలవుతున్న కొత్త చిత్రం కటౌట్ !

ఇక చివరిగా ఒక్క విషయం. ఈ కటౌట్ చూస్తున్న జనసేనాధి నేత పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి ? ఆయన కూడా ఆ గట్టు కెళ్ళాలా..లేక ఈ గట్టునే ఉండాలా అంటూ లెక్కలేసుకుంటున్నారా? ఆయన్ని సమర్దిస్తున్న వామపక్షాల పాత్రేమిటి ? వాళ్లేమంటారు ? మొన్నటికి మొన్న తెలంగాణా ఎన్నికల్లో ప్రతిపక్షమంతా కెసిఆర్‌కు వ్యతిరేకంగా  ఏకమైనట్లే ఏపీలో అపోజిషనంతా అక్కడ పోగవుతోందా ...  ఆపైనున్న మోడీ నుంచి కిందున్న వాళ్లదాకా అందరూ కట్టకట్టుకుని చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారంటూ బోలెడు జాలి పుట్టి చంద్రబాబుకు అనుకూలంగా జనం ఓట్లేస్తారేమో అంటూ ఒకవైపు  అనుమానాలు వ్యక్తమౌతుంటే... అయిదేళ్ల క్రితం మోడీ-పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళ సాయంతో  బొటాబొటి ఓట్లతో గెలిచి అధికారం సంపాదించుకున్న బాబు...  ఈ నాలుగున్నర ఏళ్లలో కావాల్సినంత వ్యతిరేకతను పోగేసుకుని...ఇప్పుడు ఇంతమంది రాజకీయులంతా తలోవైపునుంచీ తొక్కేస్తుంటే అసలు లేచి నిలదొక్కుకోగలడా అంటూ మరోవైపు నుంచి డౌట్స్ !


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle