newssting
BITING NEWS :
* జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం *మెట్రో రైలు సర్వీసులకు .. అంతర్జాతీయ విమానాలకు అనుమతి లేదు *సినిమా హాల్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ వేదికలకు అనుమతి లేదు* ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కరోనా కలకలం *ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు.. 2944 కి చేరిన కేసులు .. ఏపీలో యాక్టివ్ కేసులు 792 *పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు..మొదట మే 31వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలు

కొడాలి స్పీడ్‌కు దేవినేని బ్రేక్ వేయగలరా..?

12-03-201912-03-2019 12:08:53 IST
2019-03-12T06:38:53.933Z12-03-2019 2019-03-12T06:38:52.063Z - - 30-05-2020

కొడాలి స్పీడ్‌కు  దేవినేని బ్రేక్ వేయగలరా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కృష్ణా జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా మారిన గుడివాడ సీటుపై ఈసారి ఎలాగైనా త‌మ జెండా ఎగ‌రేయాల‌నుకుంటోంది తెలుగుదేశం పార్టీ. పార్టీ వ్యవ‌స్థాప‌కులు ఎన్టీఆర్ స్వంత నియోజ‌క‌వ‌ర్గమైన గుడివాడ టీడీపీకి కంచుకోట‌గా ఉండేది. టీడీపీ స్థాపించిన‌ త‌ర్వాత ఇక్కడ ఉప ఎన్నిక‌లు క‌లిపి ప‌ది ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా టీడీపీ ఏకంగా ఎనిమిది సార్లు విజ‌యం సాధించింది. ఎన్టీఆర్ రెండుసార్లు ఇక్కడ గెలుపొందారు. 2004, 2009లో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున విజ‌యం సాధించి కొడాలి వెంక‌టేశ్వర‌రావు(నాని) త‌ర్వాత టీడీపీతో విభేదించి వైసీపీలో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో 11 వేల ఓట్లతో విజ‌యం సాధించారు.

ఎన్టీఆర్ స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌గా ఎద‌గ‌డం, టీడీపీపై విమ‌ర్శలు గుప్పించ‌డంలో ముందుంటున్న కొడాలి నాని తెలుగుదేశం పార్టీకి కొర‌క‌రాని కొయ్యగా మారారు. పైగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ద‌గ్గర‌వారు కావ‌డం, క‌మ్మ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్టీఆర్ ఫోటోతోనే ఎన్నిక‌ల‌కు వెళుతుండ‌టంతో ఆయ‌న టీడీపీకి స‌మ‌స్యగా మారారు. ఈసారి ఎలాగైనా గుడివాడ‌లో నానిని ఓడించాల‌ని చంద్రబాబు ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు.

ఇంత‌కాలం టీడీపీలో నానికి గ‌ట్టి పోటీ ఇచ్చే బ‌ల‌మైన నాయ‌కులు లేరు. మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌టేశ్వర‌రావుకు పోటీ చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నా ఆయ‌న‌కు వ్యతిరేకంగా మ‌రో ఇద్దరు నేత‌లు కూడా టిక్కెట్ ఆశించారు. దీంతో టీడీపీలో ఉన్న వ‌ర్గ విభేదాలు కూడా కొడాలి నానికి క‌లిసివ‌చ్చేవి. ఈ విభేదాలకు చెక్ పెట్టి బ‌ల‌మైన అభ్యర్థిని బ‌రిలో దించేతే గుడివాడ‌లో గెలుపు సాధ్యమ‌ని గుర్తించిన చంద్రబాబు... ఈ స్థానానికి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, తెలుగు యువ‌త రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేరును ఖ‌రారు చేశారు.

ఆయ‌న‌కు ఇక్కడ టిక్కెట్ కేటాయించ‌డంతో పాటు టిక్కెట్ ఆశించిన రావి వెంక‌టేశ్వర‌రావుకు ఎమ్మెల్సీ ఇస్తామ‌ని, య‌ల‌వ‌ర్తి శ్రీనివాస‌రావుకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి గుడివాడ‌లో అవినాష్ ను గెలిపించాల‌ని వారిని బుజ్జగించారు. అయితే, అవినాష్ కొడాలి నానిని ఓడించ‌గ‌ల‌రా అనే అనుమానాలు వ‌స్తున్నాయి.

కొడాలి నాని ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజ‌క‌వ‌ర్గంపై పూర్తి ప‌ట్టు సాధించారు. నియోజ‌క‌వ‌ర్గంలో మాస్ లీడ‌ర్‌గా ఇమేజ్ ఉంది. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటార‌నే పేరుంది. సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు కూడా ఆయ‌న‌కు క‌లిసొస్తున్నాయి. అయితే, నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిలో మాత్రం వెనుక‌బ‌డ‌టం, వ‌రుస‌గా మూడుసార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేయ‌డం వ‌ల్ల స‌హ‌జంగానే ఏర్ప‌డే వ్య‌తిరేక‌త నానికి ఇబ్బందిగా మారింది.

దేవినేని అవినాష్‌కు జిల్లాలో, ప్రధానంగా ఓ సామాజ‌క‌వ‌ర్గం ఓట‌ర్లలో మంచి పేరే ఉంది. అయితే, గుడివాడ‌కు ఆయ‌న కొత్త‌. ఎన్నిక‌ల‌కు ఎక్కువ స‌మ‌యం కూడా లేదు. ఈ నెల రోజుల్లోనే ఆయ‌న గుడివాడ‌లో బ‌ల‌మైన నేత‌గా ఉన్న కొడాలి నానిని ఢీకొట్టడం సులువు కాదంటున్నారు. పైగా చంద్ర‌బాబు బుజ్జగించినా ఆయ‌న స్థానిక క్యాడ‌ర్ పూర్తిగా స‌హ‌క‌రిస్తార‌నేది అనుమాన‌మే. మొత్తానికి దేవినేని అవినాష్ పై చంద్రబాబు పెట్టుకున్న న‌మ్మకం నెర‌వేరుతుందో, గుడివాడ‌లో మ‌ళ్లీ తెలుగుదేశం జెండా ఎగురుతుందో లేదో చూడాలి.

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   an hour ago


బ్రేకింగ్: జూన్ 30 వరకూ లాక్ డౌన్ 5.O

బ్రేకింగ్: జూన్ 30 వరకూ లాక్ డౌన్ 5.O

   2 hours ago


మెడికల్ స్టూడెంట్స్‌కు జగన్ బంపర్ ఆఫర్

మెడికల్ స్టూడెంట్స్‌కు జగన్ బంపర్ ఆఫర్

   2 hours ago


వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

   5 hours ago


ఒక వైపు కరోనా ఉధృతి.. పిడుగురాళ్ళలో సున్నపురాయి దోపిడీ

ఒక వైపు కరోనా ఉధృతి.. పిడుగురాళ్ళలో సున్నపురాయి దోపిడీ

   9 hours ago


నిమ్మగడ్డ రమేష్ కేసు.. ఎవరెవరు ఏమన్నారంటే...?

నిమ్మగడ్డ రమేష్ కేసు.. ఎవరెవరు ఏమన్నారంటే...?

   9 hours ago


అనంతలో కలకలం రేపిన మిడతల దండు..శాస్త్రవేత్తల భరోసా

అనంతలో కలకలం రేపిన మిడతల దండు..శాస్త్రవేత్తల భరోసా

   9 hours ago


దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

   10 hours ago


వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్

వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్

   11 hours ago


వరవరరావుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

వరవరరావుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

   12 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle