newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

కొంచెం ఇష్టం..కొంచెం కష్టం- జగన్ 100 రోజుల పాలనపై స్పందన

07-09-201907-09-2019 11:45:55 IST
Updated On 07-09-2019 12:44:15 ISTUpdated On 07-09-20192019-09-07T06:15:55.760Z07-09-2019 2019-09-07T06:15:49.533Z - 2019-09-07T07:14:15.575Z - 07-09-2019

కొంచెం ఇష్టం..కొంచెం కష్టం- జగన్ 100 రోజుల పాలనపై స్పందన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత సంక్షోభంలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రం తన ఎన్నికల హామీలైన నవరత్నాల అమలు విషయంలో దూకుడుగా వెళుతున్నారు. ఈ విషయంలో ఆయనకు జనం నుంచి మద్దతు లభిస్తున్నది. వాగ్దానాల అమలుకు కట్టుబడిన నేతగా ప్రస్తుతిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అదే సమయంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయంటూ అభివృద్ధి పనులను అర్ధంతరంగా నిలిపివేయడం పట్ల అంతే స్థాయిలో నిరసనలు వ్యక్తమౌతున్నాయి. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ప్రత్యేక పరిస్థితి కారణంగా ఆ రాష్ట్రంలో రాజకీయ విమర్శ అన్నది విపక్షం నుంచే తప్ప ప్రజల నుంచి వినిపించని పరిస్థితి నెలకొంది.

ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో రెండు పార్టీలూ మాత్రమే ఉనికిలో ఉన్నాయి. అవి విపక్ష తెలుగుదేశం, అధికార వైకాపా. విమర్శల విషయంలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్నట్లు కనిపించినప్పటికీ...ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న పరిమితుల దృష్ట్యా వాటి పట్ల ప్రజలే కాదు...ప్రభుత్వం కూడా పెద్దగా పట్టింపు అవసరం లేని ధోరణి అవలంబిస్తున్నది. 

అయితే రాష్ట్ర అభివృద్ధి, పురోభివృద్ధిలను పరిగణనలోనికి తీసుకోకుండా జగన్ అభివృద్ధి పనుల విషయంలో పనుల నిలుపుదలకే మొగ్గు చూపడాన్ని మేధావులు సైతం తప్పుపడుతున్నారు. విపక్షంలో ఉన్నంత వరకూ ఆయనకు మద్దతుగా నిలిచిన వర్గాలు కూడా ఇప్పుడు అమరావతి నిర్మాణం, పోలవరం విషయాలలో జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతున్నారు.సంక్షేమం ఉన్న, అభివృద్ధి ఊసేలేని విధంగా జగన్ వంద రోజుల పాలన సాగిందన్న అభిప్రాయం అత్యధికులలో వ్యక్తమౌతున్నది.

గత పాలన రాష్ట్ర అభివృద్ధి పేరిట చేపట్టిన పనులలో అవినీతి, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు విపక్షంలో ఉండగా వైకాపా, ఆ పార్టీ అధినేత జగన్ చేశారు. అయితే ఇప్పుడు అధికారంలోనికి వచ్చిన తరువాత ఆ అవినీతి, అవకతవకల నిగ్గు తేల్చడంలో, నిగ్గు తేల్చడానికి విచారణ జరిపించడంలో తప్పుపట్టాల్సింది ఏమీ ఉండదు కానీ, ఆ పేరు చెప్పి జరుగుతున్న పనులు ఆపివేయడం, కొత్త ఇసుక విధానమంటూ...వంద రోజుల పాటు ఇసుక లభ్యతను ప్రశ్నార్ధకం చేయడం పట్ల కూడా జనబాహుల్యంలోనే కాకుండా, రాజకీయ పార్టీలు, మేధావుల నుంచి విమర్శలు ఎదురౌతున్నాయి.

గత ప్రభుత్వంపై కక్ష సాధింపు ధోరణి ఉన్న ప్రణాళికా బద్ధంగా రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ జగన్ పాలన సాగడం లేదని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహా పలువురు తెలుగుదేశం నాయకులే కాకుండా, బీజేపీ, వామపక్షాలు, జనసేన కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇక అమరావతి కరకట్ట భవనాల విషయంలో తొలుత కనిపించిన దూకుడు ఇప్పుడు సర్కార్ లో లేకపోవడానికి కూడా ప్రజావేదిక కూల్చివేతతో ప్రభుత్వం టాస్క్ పూర్తయ్యిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమౌతున్నది. మొత్తంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతున్నదన్న అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ లో బలంగా కనిపిస్తున్న పరిస్థితి జగన్ ఈ వంద రోజుల పాలనలో ఏర్పడింది. 

ఇక జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఇప్పటికిప్పుడు పడే ఆర్థిక భారం వల్ల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమౌతున్నది. అలాగే పారిశ్రామిక పురోగతి ఏపీలో కుంటుబడుతుందన్న అభిప్రాయం వ్యాపార, వాణిజ్య వర్గాలలో ఏర్పడుతున్నది.

వాలంటీర్ల ఉద్యోగాలంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా...అది రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదిగా ఎంత మాత్రం లేదన్న అబిప్రాయం ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద జగన వంద రోజుల పాలనపై మిత్రమ స్పందన వ్యక్తమౌతున్నది.

అలాగే రానున్న రోజులలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందన్న ఆందోళన కూడా వ్యక్తమౌతున్నది. వంద రోజుల్లో జగన్ ఎన్నికల నినాదమైన ఏపీకి ప్రత్యేక హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. 

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   2 hours ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   4 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   4 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   9 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   11 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   12 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   12 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   12 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   12 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle