newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీయార్ బాటలో జగన్.. మార్చి 31 వరకూ AP లాక్ డౌన్

22-03-202022-03-2020 20:06:37 IST
Updated On 22-03-2020 20:07:36 ISTUpdated On 22-03-20202020-03-22T14:36:37.883Z22-03-2020 2020-03-22T14:35:35.737Z - 2020-03-22T14:37:36.498Z - 22-03-2020

కేసీయార్ బాటలో జగన్.. మార్చి 31 వరకూ AP లాక్ డౌన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారిపై పోరాటంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే బాటలో పయనిస్తున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సీఎం కేసీయార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31వ తేదీ వరకూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ చేస్తున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్. ఆయన బాటలోనే సీఎం జగన్ కూడా ఏపీలోనూ లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజా రవాణాను నిలిపివేస్తున్నామని, నిత్యావసర వస్తువులు మినహా అన్ని షాపులు మూసేయ్యాలన్నారు జగన్.

విదేశాల నుంచి వచ్చిన వారు తక్షణమే ప్రభుత్వానికి  సమాచారం ఇవ్వాలని, దేశం మొత్తం కరోనపై యుద్ధం చేస్తోందని, ఏపీ అంతరాష్ట్ర సరిహద్దులు క్లోజ్ చేస్తున్నామన్నారు. అంతా సహకరించాలన్నారు. గోడౌన్లు, ఫ్యాక్టరీలు కార్యాలయాలు పరిమిత సిబ్బందితో నడపాలి.. ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావాలని, విదేశాల నుంచి వచ్చి వారిని గుర్తించేందుకు పోలీసులు దృష్టి పెట్టాలన్నారు.

నిత్యవసర వస్తువుల ధరలను సిద్ధం చెయ్యాలని, అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కేసులు పెడతాం అన్నారు సీఎం జగన్. రోజువారీ కార్మికులు జాగ్రత్తలు పాటించాలని, అవసరాలను ఆసరాగా చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పని సరి పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సి వస్తుందన్నారు. ఏపీలో 4.5శాతం మాత్రమే ఐసీయూకి వెళ్లే అవకాశం ఉందని, కరోనా ఏపీలో ప్రస్తుతం అదుపులో ఉందన్నారు. 14రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ చేస్తున్నాం అన్నారు. రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వడంతో పాటు 1000రూపాయలు, కిలో కందిపప్పు ఇవ్వబోతున్నాం అన్నారు జగన్.

29వ తేదీకి రేషన్ సరుకులు నిత్యావసరాలు అందుబాటులోకి తెస్తాం. పేదలు ఇబ్బంది పడకూడదనే నిర్ణయం తీసుకున్నామని, ఏప్రిల్ 4వ తేదీకి ప్రతి ఇంటికి1000రూపాయలను ఇస్తామని, విదేశాల నుంచి వస్తున్న వారి వల్లే కరోనా వ్యాప్తి చెందిందని, దేశం మొత్తం లాక్ డౌన్ అయితే కరోనాను పూర్తిగా  నిలిపివేయ్యడానికి అవకాశం ఉందన్నారు జగన్. దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ చెయ్యాలని, రాత్రికి రాత్రి జరిగే మార్పు రాదన్నారు. ఎవరి మీద నింద మోపాలని తాను అనుకోవడం లేదని, ప్రయివేటు హాస్పిటల్స్ కూడా సేవలను పెంచాలని. ప్రతి జిల్లాలో 100పడకల ఆసుపత్రులను ఇప్పటికే సిద్ధం చేస్తున్నామన్నారు. 

వృద్ధులను,పిల్లలను బయటకు రాకుండా చూడాలన్నారు. ఇటు  కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  కరోనా కేసులు నమోదైన 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు, తెలంగాణ నుంచి 5 జిల్లాలు ఉన్నాయి. ఏపీలో ప్రకాశం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలను లాక్‌డౌన్‌ చేసింది.

అటు తెలంగాణలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాలను లాక్‌డౌన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కర్ణాటకలో 4 జిల్లాలు, తమిళనాడులో చెన్నై సహా రెండు జిల్లాలు, ఢిల్లీలో 7, ఉత్తరప్రదేశ్‌లో 15 జిల్లాలలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. మార్చి 31 వరకు ఇది అమల్లో ఉండనుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు గూడ్స్ మినహా అన్ని రైళ్లను రద్దుచేసింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle