newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారా? బెజవాడలో ఫ్లెక్సీల సందడి

30-05-201930-05-2019 16:03:02 IST
Updated On 25-06-2019 14:49:48 ISTUpdated On 25-06-20192019-05-30T10:33:02.129Z30-05-2019 2019-05-30T10:32:59.486Z - 2019-06-25T09:19:48.582Z - 25-06-2019

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారా? బెజవాడలో ఫ్లెక్సీల సందడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం వేళ మళ్ళీ తెరమీదకు వచ్చింది రిటర్న్ గిఫ్ట్ అంశం.  గురువారం ఉదయం విజయవాడలో జరిగిన జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. తనదైన శైలితో మాట్లాడారు కేసీఆర్. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని, అందుకు తన సహకారం ఉంటుందన్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో విజయవాడలో పలు ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ వైసీపీ నేతల ఫోటోలతో భారీ ఫ్లెక్సీలు సందడి చేశాయి. వీటిపై చర్చ కూడా జరుగుతోంది. 

థ్యాంక్స్  కేసీఆర్ గారు ఫర్ రిటర్న్ గిఫ్ట్ అంటూ ఈ ఫ్లెక్సీలపై ప్రచురించారు. కేసీఆర్ జగన్‌కు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛం ఇస్తున్న ఫోటోతో ఈ ఫ్లెక్సీ ఉంది. విజయవాడ నుంచి వైసీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలైన పారిశ్రామిక వేత్త పీవీపీ ప్రసాద్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫోటోలు ఇందులో కనిపించాయి. పైగా ఈ ఫ్లెక్సీలో కొడాలి నాని ఫ్రెండ్స్ సర్కిల్ ఒక అడుగు ముందుకేసి స్వర్గీయ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు కూడా ప్రచురించారు.

ఈ ఫ్లెక్సీ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 2018 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసింది మహాకూటమి. ఎన్పికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి రిటర్న్ గిఫ్ట్ తప్పక ఇస్తానన్నారు. 

2019 ఏపీ ఎన్నికల్లో పదే పదే ఈ మాట ప్రస్తావనకు కూడా వచ్చింది. రిటర్న్ గిఫ్ట్ పై చంద్రబాబుకూడా స్పందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ అపూర్వ విజయంతో రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ బర్నింగ్ టాపిక్ అయింది. జగన్ ప్రమాణ స్వీకారం వేళ.. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలపై టీడీపీ నేతలు మౌనం వహిస్తున్నారు. అసలే ఓటమితో సతమతం అవుతున్న తెలుగు తమ్ముళ్ళకు ఈ ఫ్లెక్సీలు పుండు మీద కారం చల్లిన చందంగా ఉన్నాయంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle