newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

కేసీఆర్ బాటలో జగన్.. త్వరలో జిల్లాల విభజన

31-05-201931-05-2019 08:13:33 IST
Updated On 25-06-2019 14:26:26 ISTUpdated On 25-06-20192019-05-31T02:43:33.876Z31-05-2019 2019-05-31T02:43:28.324Z - 2019-06-25T08:56:26.630Z - 25-06-2019

కేసీఆర్ బాటలో జగన్.. త్వరలో జిల్లాల విభజన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ స్వరూపం త్వరలో మారనుందా? 13 జిల్లాలకు తోడు కొత్తగా 12 జిల్లాలు రాబోతున్నాయా? జగన్ ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్నారా? అంటే అవునంటున్నారు వైసీపీ నేతలు. తెలంగాణ తొలి ప్రభుత్వ ఏర్పాటుకు ముందు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీల్లో కొత్త జిల్లాలు ఒకటి. అలా తొలి విడత, మలివిడతలో అనేక కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో 9 జిల్లాలు కాస్తా 33 జిల్లాలు అయ్యాయి. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా తాను పాదయాత్ర సమయంలో కాని, ఎన్నికల ప్రచారంలో కాని చెప్పినట్లు కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టుబోతున్నట్టు తెలుస్తోంది. పాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన తప్పనిసరి అంటున్నారు వైసీపీ నేతలు.

ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా  ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తానని ప్రకటించిన జగన్.. జిల్లాల పునర్విభజన ఫైలు పైనే  త్వరలో  ఆయన సంతకం చేయనున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు ఉన్న 13కి తోడు మరో 12 కొత్త జిల్లాలు కలిపి మొత్తం 25 జిల్లాలు కానున్నాయి. వీటిలో ఒక గిరిజన జిల్లాను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అరకు జిల్లానా లేదా పార్వతీపురం కేంద్రంగానా అనేది తేలలేదు. అలాగే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంతో ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం కూడా ఉంది.

ఇవేనా కొత్త జిల్లాలు..?

అరకు(విశాఖ జిల్లా), 

అనకాపల్లి(విశాఖ జిల్లా), 

అమలాపురం (తూర్పు గోదావరి), 

రాజమండ్రి(తూర్పు గోదావరి), 

నరసాపురం(పశ్చిమగోదావరి), 

విజయవాడ(కృష్ణా జిల్లా), 

నర్సరావుపేట(గుంటూరు జిల్లా), 

బాపట్ల(గుంటూరు జిల్లా), 

నంద్యాల(కర్నూలు జిల్లా), 

హిందూపురం(అనంతపురం జిల్లా), 

తిరుపతి(చిత్తూరు జిల్లా), 

రాజంపేట(కడప జిల్లా)

మొత్తం మీద జగన్ పాలనలొ తనదైన మార్కు చూపెట్టబోతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఎలా జరుగుతుందో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle