newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

కేసీఆర్-జగన్.... బాబు కన్ఫ్యూజన్

17-01-201917-01-2019 15:02:43 IST
2019-01-17T09:32:43.584Z17-01-2019 2019-01-17T09:27:09.911Z - - 17-07-2019

కేసీఆర్-జగన్.... బాబు కన్ఫ్యూజన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్-జగన్ ఏకమయితే తనకు ఇబ్బందులు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఎలాగైనా కాలుపెడతామని, రిటర్న్ గిఫ్ట్ గ్యారంటీ అంటూ ఎప్పటినుంచో చంద్రబాబుని బేంబేలెత్తిస్తున్నారు కేసీఆర్ అండ్ టీం. తాజాగా కేటీఆర్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడంతో ఏపీలో రాజకీయవేడి రాజుకుంది. ఎలాగైనా 25 లోక్‌సభ స్థానాల్లో పాగా వేయాలని జగన్ స్కెచ్ వేస్తున్నారు. ఇటీవల విడుదలైన జాతీయ సర్వేలు సైతం జగన్‌కి ఊపునిచ్చేలా ఉన్నాయి. అయితే వాస్తవానికి తెలంగాణతో పోలిస్తే ఏపీలో జగన్ ఊహించినన్ని సీట్లు రాకపోవచ్చనే అభిప్రాయం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో సునామీ సృష్టించిన టీఆర్ఎస్ 16 సీట్లు గెలుచుకోవడం సాధ్యం అయ్యే అవకాశాలు ఎక్కువే. కానీ ఏపీలో టీడీపీని పూర్తిగా తుడిచేసి మొత్తం సీట్లు గంపగుత్తగా కొల్లగొట్టడం వైసీపీకి ఎంతవరకు సాధ్యం? ఈ విషయంలో జగన్‌ది కాన్ఫిడెన్సో..ఓవర్ కాన్ఫిడెన్సో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా తెలంగాణ, ఏపీ ఎంపీల సాయంతో కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పవచ్చన్న ధీమాతో ఉన్నారు. 

ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంక్‌ని టీడీపీ చేజార్చుకుంది. నాడు బీజేపీకి మద్దతు ఇవ్వడంవల్ల టీడీపీకి ముస్లిం మైనారిటీలు దూరంగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీకి వారు మూకుమ్మడిగా మద్దతు ప్రకటించారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. అయితే ఇప్పుడు బీజేపీకి దూరం కావడం వల్ల టీడీపీకి ముస్లిం ఓటు బ్యాంకు మళ్ళీ పుంజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముస్లిం నేత ఫరూక్‌ని మంత్రిని చేసిన బాబు ముస్లిం ఓట్లకు గాలం వేశారు.  ముస్లిం ఓట్లు టీడీపీకి మొత్తం రాకపోయినా సగానికి సగమైన వైసీపీ నుంచి చీలిస్తే ఎన్నికల గండం గట్టెక్కుతామని టీడీపీ భావిస్తోంది. కానీ టీడీపీ అంచనాలకు బ్రేక్ వేశారు మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ. తెలంగాణలో టీఆర్ఎస్ పక్షాన నిలిచిన ఎంఐఎం ఈసారి ఏపీలో జగన్ పంచన చేరింది. జగన్ తనకు దోస్తు అని, వచ్చే ఎన్నికల్లో అయనకు మద్దతుగా ఏపీలో ప్రచారం చేస్తానని ప్రకటించారు. దీంతో టీడీపీ తెగ కలవరపడుతోంది. ఏంజరుగుతుందోనన్న బెంగ టీడీపీ అధినాయకత్వంలో కనిపిస్తోంది. 

మజ్లిస్ పార్టీకి దేశవ్యాప్తంగా సీట్లు తక్కువగా ఉన్నా.. ముస్లిం వర్గానికి మాత్రం ఆ పార్టీ మాట శిరోధార్యం. తెలుగు రాష్ట్రాల్లో వివిధ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న చోట ఆ పార్టీ ప్రభావాన్ని తేలికగా తీసిపారేయలేం. ఏపీలో ఇప్పటికే ముస్లిం వర్గాలు జగన్ వైపు ఉన్నారు. ఈ సమయంలో ఒవైసీ కూడా జగన్‌కే మద్దతు అని ప్రకటించడం, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్, ఓవైసీలు ఏపీలో పర్యటిస్తే మాత్రం టీడీపీకి ఇబ్బందులు తప్పవంటున్నారు. అందుకే ఈమధ్య బాబు స్వరం పెంచి నేరుగా ఓవైసీ మీదనే బాణాలు వేస్తున్నారు. ఏకంగా ఒవైసీతో బీజేపీకి, మోడీకి కలిపి కొత్త లింకు పెడుతున్నారు. జగన్‌కి మజ్లిస్ మద్దతు ఇవ్వడం టీడీపీని నిద్రపోనివ్వడం లేదు. నిజంగానే కేసీఆర్ ఈ విషయంలో తనకు దిమ్మతిరిగే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారేమోనని మథనపడుతున్నారు బాబు. అందుకే వైసీపీలో ఏం జరుగుతుందో వేగుల ద్వారా సమాచారం సేకరించే పనిలో పడ్డారు. కేసీఆర్ విజయవాడ వచ్చి జగన్‌తో ఏం మాట్లాడతారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle