newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

కేసీఆర్ అడుగుజాడల్లో జగన్..!

08-01-201908-01-2019 15:07:40 IST
2019-01-08T09:37:40.665Z08-01-2019 2019-01-08T09:16:04.412Z - - 21-08-2019

కేసీఆర్ అడుగుజాడల్లో జగన్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష వైసీపీ రెడీ అవుతోంది. ప్రజాసంకల్పయాత్రలో ఏడాదికి పైగా బిజీగా ఉన్న జగన్.. తొలి జాబితా కూర్పుపై తలమునకలై ఉన్నారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, సిట్టింగ్‌లు, సర్వేలో సానుకూల ఫలితాలు వచ్చినవారికే స్థానం కల్పించనున్నారు, పాదయాత్ర ముగింపు రోజైన 9వ తేదీన జాబితా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో వైసీపీ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు జాబితాలో తమ పేరుకోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ బాటలోనే జగన్ ప్రయాణం చేయబోతున్నారని తెలుస్తోంది, తెలంగాణలో ఎన్నికలకు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి ఘన విజయం సాధించింది. ఏపీలో కూడా వీలైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటిస్తే తమకు గెలుపు సొంతమవుతుందనే భావనలో జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. 

అందులో భాగంగా ఇప్పటివరకూ నిర్వహించిన సర్వేల్లో సమర్థులుగా తేలినవారు, సిట్టింగ్‌లతో కలిపి 70 నుంచి 90 మందితో తొలి జాబితా సిద్ధం చేశారు. మిగిలిన రాజకీయ పార్టీలతో పాటు వైసీపీకి ఈ ఎన్నికలు చావోరేవో తేల్చుకోవాల్సినవి.  ఎలాగైనా కనీసం 100 సీట్లలో విజయం సాధించడం ద్వారా పార్టీ ఉనికిని కాపాడుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. పాదయాత్ర అనంతరం ప్రజల్లో పార్టీకి సానుకూల పవనాలు ఉన్నాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి, వీటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించేలా ఏదైనా ప్రకటన చేయాలని జగన్‌ కొంతకాలంగా పార్టీ నేతల వద్ద అభిప్రాయపడుతున్నారు. ఈ తొలి లిస్ట్‌ను ఇచ్ఛాపురం వేదికగా ప్రకటించాలని జగన్‌ నిర్ణయించుకున్నారని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే సంకాంత్రి ముందు మంచి రోజులు కానందున, పండుగ వెళ్లిన తర్వాత ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. 

తొలిజాబితాలో టిక్కెట్ కోసం ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను వాయిదా వేయనున్నారు. తొలి జాబితాలో రాష్ట్రవ్యాప్తంగా 70-100 మందికి స్థానం కల్పించనున్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. తొలి జాబితాలో విశాఖ జిల్లా నుంచి ముగ్గురు లేదా నలుగురికి మాత్రమే చోటు దక్కనుంది. మాడుగుల టిక్కెట్‌ను అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు ఖరారు చేయగా, ఎలమంచిలి సీటుని మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుకు కేటాయిస్తున్నారని తెలుస్తోంది.  పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా జగన్ దక్కించుకోలేదు. దీంతో ఈ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అలాగే విశాఖ నగర పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంపై కూడా పేర్లు ఖరారు కాలేదు. వైసీపీ బలం ఎక్కువగా ఉన్న రాయలసీమ విషయంలో జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలను ఎలాగైనా ఓడించేందుకు ఆయన స్కెచ్చేశారు. వీరికి టీడీపీలో సీట్లు వస్తాయో రావోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయి. ఇటు వైసీపీ, జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎంతవరకూ తమ ఖాతాలో వేసుకోగలుగుతాయనేది అంతుచిక్కడం లేదు. పవన్-జగన్ కలిస్తే చంద్రబాబుకి గడ్డుకాలం రావచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే పవన్‌తో తానసలు మాట్లాడలేదన్నారు జగన్. మరోవైపు 175 స్థానాల్లో తాము వామపక్షాల మినహా ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని, జనమే తమ బలం అని పవన్ ఈమధ్య స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ-జనసేన మధ్య పొత్తు పొడుస్తుందా? 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle