newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

కేసీఆర్‌ కంటిమీద కునుకులేకుండా చేస్తున్న జ‌గ‌న్‌..!

06-10-201906-10-2019 11:17:54 IST
2019-10-06T05:47:54.503Z06-10-2019 2019-10-06T05:47:25.823Z - - 04-08-2020

కేసీఆర్‌ కంటిమీద కునుకులేకుండా చేస్తున్న జ‌గ‌న్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ధ్య ఇప్పుడు ఎంత‌టి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

గ‌త ఎన్నిక‌ల ముందే వీరిద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త నెల‌కొంది. ఇద్ద‌రూ ఆశించిన‌ట్లుగానే ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా కేసీఆర్‌తో జ‌గ‌న్ మంచి సంబంధాల‌నే నెర‌పుతున్నారు. ప‌రిష్కారానికి నోచుకోని విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను ఇరువురూ కూర్చొని ప‌రిష్క‌రించుకుంటున్నారు.

ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులూ వెళుతున్నారు. గోదావ‌రి నీటిని కృష్ణా న‌దిలోకి మ‌ళ్లించి రెండు రాష్ట్రాల‌కూ ప్ర‌యోజ‌నం క‌ల్పించాల‌నే దిశ‌గా ఆలోచిస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ జ‌గ‌న్ తీసుకుంటున్నా నిర్ణ‌యాలు మాత్రం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కొంత ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగుల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో విలీనం చేసే ప్ర‌క్రియ ప్రారంభించారు. తెలంగాణ‌లో అందుకు కేసీఆర్ స‌సేమిరా అంటున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు స‌మ్మెకు వెళ్లారు.

ఉద్యోగ క‌ల్ప‌న‌లో జ‌గ‌న్ వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ‌లో ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో ఇవ్వ‌డం లేద‌ని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ ప్రభుత్వం నిర్ణ‌యాల‌తో తెలంగాణ ప్ర‌భుత్వంపై మ‌రింత ఒత్తిడి పెరుగుతోంది. ఏపీలో కౌలురైతుల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ గుర్తిస్తోంది. రైతుభ‌రోసా ప‌థ‌కం వారికి కూడా అందేలా రూపొందించారు. తెలంగాణ‌లో మాత్రం కౌలురైతుల‌ను గుర్తించ‌మ‌ని, ఇది త‌మ ప్ర‌భుత్వ‌ విధానం కాద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టంగా చెబుతున్నారు.

ఇక‌, తాజాగా జ‌గ‌న్ మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ‌పై వివ‌క్ష చూపుతోంద‌ని, ప్రాధాన్య‌త లేని శాఖ‌ల‌ను కేటాయిస్తుంద‌నే అసంతృప్తితో వీఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ‌కు స‌ల‌హాదారుగా నియ‌మించారు. ఆయ‌న బాధ్య‌త‌లు కూడా స్వీక‌రించారు. నిరుపేద కుటుంబం నుంచి ఐఏఎస్‌గా ఎదిగిన ముర‌ళికి విద్యాశాఖ ప‌ట్ల మంచి అవ‌గాహ‌న ఉంది.

గ‌తంలో ఆయ‌న ప‌లు అంత‌ర్జాతీయ ఎన్జీఓ సంస్థ‌లు, సెర్ప్‌లో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. తెలంగాణ‌లో నూత‌న జిల్లాల ఏర్పాటు త‌ర్వాత ఆయ‌న ఏరికోరి మ‌రీ గిరిజ‌నులు ఎక్కువ‌గా ఉండే భూపాల‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్‌గా వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ప‌నితీరు కొన్నిసార్లు వివాదాస్ప‌దం అయినా చాలా వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు మేలు చేసే ప్ర‌య‌త్నం చేశారు.

గ్రామాల్లో పేద‌లు, గిరిజ‌నులు ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు ఆసుప‌త్రుల‌కే ఎక్కువ‌గా డ‌బ్బులు ఖ‌ర్చు పెడుతూ న‌ష్ట‌పోతున్నార‌ని గుర్తించిన ఆయ‌న ప్ర‌భుత్వ స్కూళ్లు, ఆసుప‌త్రులపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లిగించారు.

త‌న స్వంత కూతురి ప్ర‌స‌వం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చేయించారు. భూపాల‌ప‌ల్లి జిల్లాలో చాలావ‌ర‌కు పాఠ‌శాల‌ల్లో మౌళిక వ‌స‌తుల‌ను మెరుగు ప‌రిచారు.

అయితే, త‌ర్వాత ఆయ‌న‌ను అనూహ్యంగా అప్రాధాన్య‌త పోస్టు అయిన ఆర్త్క‌వ్స్ శాఖ‌కు డైరెక్ట‌ర్‌గా బ‌దిలీ చేశారు. కొంత‌కాలం ఈ పోస్టులో ప‌నిచేసిన ఆయ‌న త‌ర్వాత అసంతృప్తితో ఇంకా ఏడాది ప‌ద‌వీకాలం ఉంద‌న‌గానే స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

ద‌ళిత ఐఏఎస్‌ల‌పై శాఖల కేటాయింపులో వివ‌క్ష చూపుతున్నార‌ని ఆయ‌న ప‌లుమార్లు ఆరోపించారు. స‌మాజంపై, ప్ర‌జ‌ల స్థితిగ‌తుల‌పై మంచి అవ‌గాహ‌న ఉన్న ముర‌ళి రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌నే ఊహాగానాలు వ‌చ్చాయి.

కానీ, అనూహ్యంగా ఆయ‌న‌ను ఏపీ ప్ర‌భుత్వం స‌ల‌హాదారుగా నియ‌మించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తాను మిత్రుడిగా భావిస్తున్న కేసీఆర్ స‌ర్కార్ ప‌క్క‌న‌పెట్టిన ముర‌ళిని తీసుకొని వెళ్లి త‌న ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

కాగా, ఇప్ప‌టికే జ‌గ‌న్ తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు రామ‌చంద్ర‌మూర్తి, దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌ల‌ను స‌ల‌హాదారులుగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle