newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

కేసీఆర్‌నీ వదలని చంద్రబాబు

25-04-201925-04-2019 14:35:56 IST
Updated On 25-04-2019 18:19:56 ISTUpdated On 25-04-20192019-04-25T09:05:56.378Z25-04-2019 2019-04-25T09:05:54.526Z - 2019-04-25T12:49:56.827Z - 25-04-2019

కేసీఆర్‌నీ వదలని చంద్రబాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్నికలు, ఫలితాల సంగతి ఎలా వున్నా ఏపీ సీఎం చంద్రబాబు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఈసారి ఆయన ఫోకస్ తెలంగాణపై పడింది. తెలంగాణ సీఎం సమీక్షలు నిర్వహిస్తే ఎవరూ కూడా నోరు తెరవడం లేదని.. తాను సమీక్ష నిర్వహిస్తే మాత్రం నానా యాగీ చేస్తున్నారని  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అనేక అంశాలపై తెలంగాణను పోల్చారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడ సరిగా నిర్వహించలేదని, అనేక మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటర్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం  వ్యక్తమవుతోందని, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని చంద్రబాబు కోరారు. ఆత్మస్థైర్యంతో ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఇప్పటికే చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. 18మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న వార్తలు బాధ కలిగించాయన్నారు.  ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం తనను కలిచివేసిందన్నారు. కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదని, అవి ప్రతిభకు గుర్తింపు మాత్రమే అని, పరీక్షల కంటే జీవితాలు ముఖ్యం అని  చంద్రబాబు అన్నారు. ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవని చెప్పారు. ఓటమి విజయానికి తొలిమెట్టు అని, మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవాలని సూచించారు.

పనిలో పనిగా చంద్రబాబు ఈసీని తిట్టిపోశారు. ఎన్నికల సంఘం పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు మాత్రమే పని చేయాలన్నారు.  ఈసీ ఇష్టానుసారం వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్తం అవుతుందని, ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. ఈ ఐదేళ్లు అధికారులు తమకెంతో సహకరించారని.. అధికారుల సహకారంతోనే అనేక రంగాల్లో ముందుకెళ్ళామన్నారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉండాలని  చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. అంటే మే 23 తర్వాత తమ ప్రభుత్వమే మళ్ళీ వస్తుందని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. ఈసీపై తాము చేసే పోరాటం అందరిలో స్ఫూర్తి నిoపుతోందన్నారు. తన పోరాటాన్ని ఎవరు ఎలా ప్రచారం చేసినా మళ్లీ అధికారంలోకి టీడీపీ వస్తోందని ఆయన చెప్పారు.  ఈవీఎంలపై తమ పోరాటం ఈనాటిది కాదన్నారు.   అధికారం కోసం ప్రతిపక్షం ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేసిందని మండిపడ్డారు. అయినా అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle