newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

కేసీఆర్‌ని కాపీ కొట్టిన జగన్

09-01-201909-01-2019 18:49:16 IST
Updated On 11-01-2019 18:34:04 ISTUpdated On 11-01-20192019-01-09T13:19:16.836Z09-01-2019 2019-01-09T13:10:07.743Z - 2019-01-11T13:04:04.505Z - 11-01-2019

కేసీఆర్‌ని కాపీ కొట్టిన జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముందునుంచీ తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని జగన్ గురించి టీడీపీ విమర్శలు చేస్తూనే ఉంది. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో కేసీఆర్‌ని అచ్చంగా అనుకరించారు వైసీపీ అధినేత జగన్. బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పాదయాత్ర ముగింపు సభలో జగన్ సంచలన హామీలు చేశారు. తాను అధికారంలోకి వచ్చాక వ్యవస్థ రూపురేఖలు మారుస్తానన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానని ప్రకటన చేశారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 31 జిల్లాలు చేశారు.ఇప్పుడు 25 జిల్లాలతో కొత్త ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తానని జగన్ మాటిచ్చి కేసీఆర్‌ని ఫాలో అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే రైతు బంధు, రైతు బీమా పేరు చెప్పకపోయినా జగన్..తెలంగాణ సీఎం బాటలో హామీలు కురిపించారు. రైతులకు ఏడాదికి రూ.12,500 పెట్టుబడి నేరుగా ఇస్తామని చెప్పారు. రైతుల సాగు ఖర్చులు తగ్గించి, పెట్టుబడి సాయంపై పలు హామీలు ఇచ్చారు. రైతులకు బోర్లను ఉచితంగా వేయిస్తామని చెప్పారు. 

రైతులకు బీమా ప్రీమియం ప్రభుత్వమే కడుతుందని జగన్ చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణలో రైతుబంధు కింద 10 వేలు ఇస్తామన్నారు కేసీఆర్.. దాన్ని కాస్త పెంచారు జగన్. అలాగే రైతు బీమాను మక్కికి మక్కి ఫాలో అయ్యారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేస్తామన్నారు. గతంలో కేసీఆర్ కూడా అదే చేశారు. మీ గ్రామంలోనే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు జగన్. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు గ్రామ వాలంటీర్‌గా ఉద్యోగం ఇస్తామని...అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలు చేస్తామన్నారు. రైతులకు అనుకోని విధంగా ఏమైనా జరిగితే వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం తాము అధికారంలోకి రాగానే చట్టం చేస్తామన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనేక మాటలు మార్చారని జగన్ అన్నారు. 

నాలుగున్నరేళ్లు బీజేపీతో కలిసి ఉన్నారని, టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా ఉన్నారని, అప్పుడు బీజేపీని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు మోడీని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.  అసెంబ్లీలో బీజేపీని ప్రశంసిస్తూ తీర్మానం చేశారని, హోదా కంటే ప్యాకేజీ బెస్ట్ అన్నారన్నారు. మళ్ళీ ఎన్నికలకు ముందు కొత్త  డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు జగన్. ఈ నాలుగేళ్లు టీడీపీ, బీజేపీల తీరు చూసి చిలుకా గోరింకలు కూడా సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా సహా అనేక అమలు కాని హామీలు ఎన్నికలకు ముందే గుర్తుకొస్తాయన్నారు. కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు అడ్డుపెట్టుకుని చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తానని చెప్పారు. పంచాయతీలను బలోపేతం చేస్తానని అన్నారు. కలెక్టర్ల వ్యవస్థను ప్రజలకు దగ్గరగా చేస్తానని చెప్పారు. ప్రతీ గ్రామంలో గ్రామ సచివాలయం తీసుకు వస్తానని చెప్పారు. తన పాదయాత్రకు సహకరించిన అందరికీ జగన్ ధన్యవాదాలు తెలిపారు.

Image may contain: 19 people, people smiling, people standing, crowd and outdoor


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle