newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

కేసీఆరే కాదు...కుప్పం ప్రజలూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా..?

30-03-201930-03-2019 08:11:06 IST
2019-03-30T02:41:06.933Z30-03-2019 2019-03-30T02:41:00.477Z - - 22-07-2019

కేసీఆరే కాదు...కుప్పం ప్రజలూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జాబు రావాలంటే.. బాబు రావాలి. ఇదీ గత ఎన్నికల్లో చంద్రబాబు ఊదరగొట్టిన నినాదం. ఆ నినాదం ఎంత వరకు నిజమైందో తెలుసుకోవాలంటే రాష్ట్రమంతా తిరగాల్సిన అవసరం లేదు... ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి బెంగళూరుకు వెళ్లే రైళ్లలో కూలీల సంఖ్య చూస్తే చాలు. ఆయన సొంత నియోజకవర్గంలో కూడా వలసల్ని ఆపలేకపోయారని అర్థమైపోతుంది. ప్రతిరోజూ కుప్పం నుంచి బెంగళూరుకు వేలాదిమంది ఉపాధి కోసం వెళ్తున్నారు. 30 ఏళ్లుగా చంద్రబాబుకు విజయాన్ని అందిస్తున్న కుప్పం ప్రజలకు బాబు చేసిందేమీ లేదని అక్కడి పరిస్థితులు చెప్తాయి.

రైతుల కళ్లలో కన్నీరు తప్ప... పొలాలకు నీరుండదు. వచ్చే అరకొర నీటితో పంటలు పండిస్తే గిట్టుబాటు ధరల్లేవు. దీంతో వ్యవసాయం వద్దనుకొని కూలి పనులకోసం బెంగుళూరు పోతున్నట్లు ఏ వ్యక్తిని కదిలించినా చెప్తారు. ఈ ప్రాంతం నుంచి రోజూ సుమారు 15 వేల మంది బెంగళూరుకు పనుల కోసం వెళ్లివస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు స్థాపించి పెద్ద ఎత్తున ఉద్యోగాలిస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు నీటిమూటలే అయ్యాయి. ఈ ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఉద్యోగాలిచ్చే ఓ సంస్థ చిత్తూరు జిల్లాకు రాలేదు. 

ఎప్పుడో తాను ముఖ్యమంత్రి అయిన కొత్తలో చేసిన పలు అభివృద్ధి పనులు తప్పితే కుప్పం ప్రజలకు గత 15 ఏళ్ల కాలంలో చంద్రబాబు చేసింది దాదాపు శూన్యం. 2014 తర్వాత తమకు ఏదో మేలు చేస్తాడని ఆశపడ్డ కుప్పం ప్రజలకు జాబూ రాలేదు.. బాబు నుంచి ఏ జవాబూ రాలేదు. దీంతో బాబు వచ్చినా జాబు రాలేదని, కనీసం కూలీలకు కూడా స్థానికంగా పనిదొరికే పరిస్థితి లేదని కుప్పం ప్రజలు అక్కడికి వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడికీ చెప్పుకుంటున్నారట. మరి ఈ సారి కేసీఆర్­తో పాటు కుప్పం ప్రజలు కూడా బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో ఏమో చూడాలి. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle