newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

కేశినేని నాని, బుద్దా వెంకన్నలకు బాబు మందలింపులు?

15-07-201915-07-2019 12:40:36 IST
Updated On 15-07-2019 13:16:56 ISTUpdated On 15-07-20192019-07-15T07:10:36.969Z15-07-2019 2019-07-15T07:10:34.766Z - 2019-07-15T07:46:56.114Z - 15-07-2019

కేశినేని నాని, బుద్దా వెంకన్నలకు బాబు మందలింపులు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసలే ఓటమి నైరాశ్యంలో ఉన్న తెలుగుదేశం అధిష్టానానికి ఆ ఇద్దరు నేతల వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీ పరువును బెజవాడ వీధుల్లో పడేసిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నుంచి ఫోన్లు వచ్చాయి. వెంటనే తనను కలవాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఆదివారం ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న కేశినేని నాని, బుద్దా వెంకన్నలకు టీడీపీ నాయకత్వం క్లాస్ పీకే అవకాశం ఉంది.  ఈ ఇద్దరు నేతలు  చంద్రబాబుతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. 

టీడీపీ ఎంపీ కేశినేని నాని అదే పార్టీకి చెందిన బుద్దా వెంకన్నపై తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా  నాని చేసిన విమర్శలపై బుద్దా వెంకన్న కౌంటరిచ్చారు. ఆదివారం నాడు బుద్దా వెంకన్న, కేశినేని నాని మధ్య ట్వీట్ల యుద్దం సాగింది. ట్వీట్ల యుద్దం సోమవారం కూడా కొనసాగుతోంది. ఈ పరిణామం పార్టీకి తీవ్ర నష్టాన్ని కల్గించేదిగా ఉందని భావించిన చంద్రబాబు ఇద్దరు నేతల మధ్య రాజీకుదిర్చే ప్రయత్నాలను ప్రారంభించారని తెలుస్తోంది.

కేశినేని నాని సోమవారం తీవ్ర పదజాలం ఉపయోగించారు. బుద్ధావెంకన్నను చంద్రబాబునాయుడు పెంపుడు కుక్క అని సంభోదించాడు.  ‘నా లాంటి వాడు పార్టీకి అవసరం లేదనుకుంటే.. తెదేపా అధినేత చంద్రబాబు ఆ విషయాన్నైనా నాకు తెలియజేయాలి. అలా చెప్తే తన ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు నాని.

ఇలాంటి విమర్శలు వేరే ఏపార్టీలో చేసి ఉంటే ఈపాటికే కేశినేని సస్పెండ్ అయ్యేవాడంటున్నారు నెటిజన్లు. ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఎవరినీ వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు.

అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. నాని ఈ తెల్లవారుజామున పెట్టిన ట్వీట్ కు బదులుగా "బలహీన వర్గాలకు చెందన నాకు ఎంఎల్సీ పదవి ఇచ్చిన చంద్రబాబు గారికి విశ్వాస పాత్రుడిని. దానికి నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఇష్టమే. చంద్రబాబు గారి కోసం, పార్టీ కోసం ఈ ట్వీట్ల యుద్ధం ఆపేస్తున్నాను" అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. వార్ ఆపేస్తున్నానని బుద్దా వెంకన్న ప్రకటించినా, నాని ఊరుకుంటారా? 

ఫోన్ చేసిన టీడీపీ అధినేతకు ఇద్దరు నేతలు తమ వాదనలను విన్పించారని తెలుస్తోంది. సంయమనం పాటించాల్సిందిగా ఇద్దరికి పార్టీ అధినాయకత్వం సూచించింది. ఇద్దరు నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. 

 

ట్విట్టర్ వేదికగా బజారున పడ్డ బెజవాడ తమ్ముళ్ళు


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle