newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

కేశినేని నాని నిజంగానే పెద్దమనిషయ్యారా?

01-11-201901-11-2019 14:33:25 IST
Updated On 01-11-2019 17:00:21 ISTUpdated On 01-11-20192019-11-01T09:03:25.970Z01-11-2019 2019-11-01T09:03:11.593Z - 2019-11-01T11:30:21.801Z - 01-11-2019

కేశినేని నాని నిజంగానే పెద్దమనిషయ్యారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు తానుబట్టిన కుందేలుకు మూడేకాళ్లు అని మొండిపట్టు పట్టి కూర్చున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ప్రైవేటీకరణకు పథకాలు సిద్ధం చేస్తుండగా ఆంద్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప నిర్ణయమంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అసంతృప్తి నేత ప్రశంసించడం ఆసక్తి కలిగిస్తోంది

విజయవాడలో  గురువారం రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైకాపా మంత్రులతో కలిసి పాల్గొన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినాని నాని ఆర్టీసీ విలీనంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగసిస్తూ ప్రశంసలు కురిపించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షమైన వైకాపాకు, ప్రతిపక్షమైన టీడీపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిపించేలా తయారైన వాతావరణంలో విలీనంపై  ప్రభుత్వ చర్యను ప్రతిపక్ష టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ బహిరంగంగా ప్రశంసించడం అధికార పక్షాన్నేమో కాని టీడీపీని మాత్రం నివ్వెరపర్చింది. 

కొంతమంది టీడీపీ వీరాభిమానులు కేశినేని నాని జగన్ ప్రభుత్వంపై కురిపించిన ప్రశంసలను తట్టుకోలేక తక్షణం ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని చంద్రబాబును అభ్యర్తించారు. కానీ కేశినేని నాని మాత్రం ప్రజారవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ఏరకంగా చూసినా ప్రజాపయోగ చర్యగానే ఉంటుందని వ్యాఖ్యానించారు.

స్వయంగా ప్రైవేట్ బస్సుల యజమానిగా ఉంటూవచ్చిన కేశినేని నాని నష్టాలు వచ్చే మార్గాల్లో ప్రైవేట్ ఆపరేటర్లు బస్సులు నడపరని తనకు తెలుసని ప్రజలు ఇబ్బందులు పడతారు కాబట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ముఖ్యమంత్రి జగన్‌ సక్సెస్‌ అయ్యారని నాని ఈ సందర్భంగా అభినందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ఆర్టీసీని కాపాడటాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందన్నారు. లాభాలు వచ్చే మార్గాల్లో ప్రయివేట్‌ బస్సులు నడుపుతారని, నష్టాలు వచ్చే మార్గంలో ప్రయివేట్‌ ఆపరేటర్లు బస్సులు నడపరని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని కేశినేని నాని అన్నారు.  పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్న కాన్సెప్ట్‌ చాలా గొప్పదన్నారు. మంచిపని చేశారని తనకు అనిపించింది కాబట్టే చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle