newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

కేవీపీకి బాసటగా నిలిచిన ఉండవల్లి

07-05-201907-05-2019 15:04:36 IST
Updated On 01-07-2019 13:02:35 ISTUpdated On 01-07-20192019-05-07T09:34:36.309Z07-05-2019 2019-05-07T09:34:28.361Z - 2019-07-01T07:32:35.852Z - 01-07-2019

కేవీపీకి బాసటగా నిలిచిన ఉండవల్లి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోలవరం ప్రాజెక్ట్ పై సీనియర్ నాయకుడు , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన రీతిలో స్పందించారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పోలవరం విషయంలో కేవీపీ రామచంద్రరావు లేవనెత్తుతున్న అభ్యంతరాలను ఆయన సమర్ధించారు. కేవీపీ ప్రశ్నించిన దానిలో తప్పేమీ లేదని, పోలవరంపై ప్రజలకు అనుమానాలున్నాయని వాటిని చంద్రబాబే నివృత్తి చేయాలన్నారు. 

టీడీపీ , కాంగ్రెస్ కలిసి నడుస్తున్నప్పుడు కేవీపీ కాంగ్రెస్ నేతనే కదా అంటూ ఉండవల్లి అన్నారు. ఇంతకుముందే ప్రతి వారం సమీక్షలు నిర్వహించిన బాబు 2019 జూన్ నాటికి పోలవరం కల సాకారం అవుతుందని అన్నారని, ప్రభుత్వం ఇప్పుడు వచ్చే ఏడాది అని మాట మార్చిందని ఉండవల్లి తప్పు పట్టారు.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అధికార పార్టీ తీరును ఉండవల్లి తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.  పోలవరం నిర్మాణంలో ఏ చిన్న పొరబాటు చేసినా జరిగే నష్టం ఊహకు కూడా అందదని, దానిని తీవ్రంగా పరిగణించాలన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండా జరుగుతున్న జాప్యానికి గల కారణాలు ఏంటి, ఎవరు అడ్డుపడుతున్నారో బహిరంగంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కుడికాల్వకు సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయని.. కానీ ఎడమ కాలువకు సంబంధించిన పనులు చాలాకాలంగా ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని ఉండవల్లి ప్రశ్నించారు. 

కేవీపీ రామచంద్రరావు వ్యక్తం చేసిన అనుమానాలు చాలా మందికి ఉన్నాయన్న ఉండవల్లి తన అనుమానాలు నివృత్తి చేస్తే బహిరంగంగా క్షమాపణలు చెబుతానని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని ఉండవల్లి మండిపడ్డారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, రాష్ట్రం ఒప్పుకోవటం రాష్ట్ర ప్రజలపై భారం మోపటమే అని ఆయన అభిప్రాయపడ్డారు.

కేవీపీ కేసు వల్ల రాష్ట్రప్రభుత్వానికే మేలు జరుగుతుందని అరుణ్ కుమార్ తెలిపారు. మంత్రి దేవినేని ఉమా ఎంపీ కేవీపీపై దేవినేని చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి తప్పుబట్టారు. 2020కి కూడా పోలవరం పూర్తవుతుందన్న గ్యారెంటీ ఎవరైనా ఇస్తారా అని ఆయన అన్నారు. మరి అటు కేవీపీ, ఉండవల్లి వ్యాఖ్యలపై చంద్రబాబు ఏమంటారో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle