newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

కేబినెట్ భేటీ ఉన్నట్టా...లేనట్టా?

13-05-201913-05-2019 11:31:58 IST
Updated On 28-06-2019 13:00:23 ISTUpdated On 28-06-20192019-05-13T06:01:58.847Z13-05-2019 2019-05-13T06:01:56.625Z - 2019-06-28T07:30:23.508Z - 28-06-2019

కేబినెట్ భేటీ ఉన్నట్టా...లేనట్టా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కోడ్ కారణంగా ఏపీ కేబినెట్ భేటీపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. ఏపీ మంత్రివర్గ సమావేశంపై నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఈ సాయంత్రానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి వస్తేనే రేపు మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 10న సాయంత్రం కేబినెట్‌ అజెండా అంశాల నోటీసును కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది పంపారు. నోట్‌ అందిన రెండు పని దినాల్లో తమ అభిప్రాయం చెబుతామని ఈసీ పేర్కొంది. 

ఈసీ ఏం చెబుతుందా అని అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబుతో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు.  రేపటి మంత్రి వర్గ సమావేశంపై ఇవాళ సాయంత్రంలోగా ఈసీ నుంచి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నందున ఈ అంశంపైనే సీఎస్ ముఖ్యమంత్రితో చర్చించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఇద్దరి మధ్య నెలకొన్న కోల్డ్ వార్ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అసాధారణ పరిస్థితులు ఉంటేనే కేబినెట్ భేటీ జరపవచ్చు. ఒకవేళ కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం అనుమతి కావాలంటే కనీసం 48 గంటల ముందు పంపాలని నిబంధనల్లో ఉంది. ఆ నిబంధన ప్రకారం ఆదివారం సాయంత్రానికి సమయం అయిపోయింది. ఇవాళ సోమవారం కావడంతో సాయంత్రానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. లేనిపక్షంలో కేబినెట్ సమావేశం మరోరోజుకి వాయిదా పడవచ్చు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle