newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

27-01-202027-01-2020 08:24:20 IST
Updated On 27-01-2020 12:19:25 ISTUpdated On 27-01-20202020-01-27T02:54:20.195Z27-01-2020 2020-01-27T02:54:09.810Z - 2020-01-27T06:49:25.838Z - 27-01-2020

కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నడూ లేనివిధంగా ఇవాళ జరిగే ఏపీ కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం తొమ్మిది గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. ఈభేటీలో ప్రధానంగా శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నిర్ణయానికి మంత్రులంతా సానుకూలత వ్యక్తం చేస్తే ఆమోద ముద్ర వేస్తారని భావిస్తున్నారు. శాసనసభలో నిర్ణయాన్ని తెలిపి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

శాసనసభలో రద్దుపై తీర్మానం చేసి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిసింది. ఇవాళ్టి సమావేశాలకు హాజరు కాకూడదని టీడీపీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశంలో పాల్గొనకూడదని టిడిఎల్ఫీలో నిర్ణయం తీసుకున్నారు. మండలిపై అసెంబ్లీలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధమంటోంది టీడీపీ.  ప్రభుత్వం నిర్ణయం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహంతో వున్నారు. 

ఇటు, కేంద్రం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. శాసనసభ, మండలి నిరవధిక వాయిదా పడిన అనంతరం ఆర్డినెన్స్ తీసుకువచ్చే అంశంపైనా మంత్రివర్గంలో సమాలోచనలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు స్పీకర్, ఛైర్మన్లతో విడి విడిగా భేటీ అయ్యారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.  ఈ కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీపై ఆసక్తి నెలకొంది. వీరితో గవర్నర్ ఏం మాట్లాడారోనని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నెలకొంది. మండలిలో వున్న వికేంద్రీకరణ బిల్లుకి సంబంధించిన కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి ఛైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

సెలక్ట్ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు పడింది. కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని పార్టీలకు చైర్మన్ లేఖ రాశారు. రెండు బిల్లులపై రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో తొమ్మిది మందికి చోటు కల్పించారు. టీడీపీ నుంచి 5, వైసీపీ, బీజేపీ, పీడీఎఫ్ నుంచి ఒక్కొక్కరికి చోటిచ్చారు. ఈ  కమిటీలకు చైర్మన్లుగా బుగ్గన, బొత్స సత్యనారాయణను నియమించారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle