newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

కేజ్రీవాల్‌ని దాటేసిన జగన్.. అందులో ఏపీకి మూడో స్థానం!

01-08-202001-08-2020 09:57:18 IST
2020-08-01T04:27:18.185Z01-08-2020 2020-08-01T04:27:14.731Z - - 03-08-2020

కేజ్రీవాల్‌ని దాటేసిన జగన్.. అందులో ఏపీకి మూడో స్థానం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,699 శాంపిల్స్‌ పరీక్షించగా.. 10,376 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. 68 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,38,038కి చేరగా.. మృతుల సంఖ్య 1,349కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో వైరస్‌ నుంచి కోలుకుని 3,822 మంది డిశ్చార్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 60,969 కి చేరింది. ప్రస్తుతం 75,720 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు 19,51,776 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 

వరుసగా మూడో రోజు కూడా ఏపీలో పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం 10,093, గురువారం 10,167 కేసులు నమోదవగా శుక్రవారం కొత్తగా 10,376 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శుక్రవారం నమోదైన కొత్త కేసులతో కలిపి ఏపీ.. జాతీయ స్థాయిలో ఢిల్లీని దాటి మూడో స్థానానికి చేరింది. మహారాష్ట్ర, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో ఉండటం తెలిసిందే. ఢిల్లీల్లో 1,34,403 మంది కరోనా బారిన పడగా, ఏపీలో ఆ సంఖ్య 1.40 లక్షలు దాటింది.

రాష్ట్రంలో 7 జిల్లాల్లో పదివేలకుపైనే కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 20,395 పాజిటి వ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ పదిరోజులగా వెయ్యి పై నే కేసులు నమోదవుతున్నాయి. కర్నూలులో మొదటి నుంచీ కేసుల తీవ్రత అధికంగా ఉంది. ప్రస్తుతం ఆ జిల్లాల్లో 16,847 పాజిటివ్‌లు నమోదయ్యాయి. అనంతపురంలో 14,699, గుం టూరులో 14,668, పశ్చిమగోదావరిలో 12,310 పాజిటివ్‌ కేసులున్నాయి. శుక్రవారం మరో 2 జిల్లాలు ఈ లిస్ట్‌లో చేరాయి. చిత్తూరులో కొత్తగా 789 పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో ఆ జిల్లాల్లో మొత్తం కేసుల సంఖ్య 10,378కి చేరాయి.

విశాఖ జిల్లాలో అసలు కరోనా కేసులే లేవని అధికారులు చెప్పినా జూలై నెలలో విశాఖపట్నంలో వైరస్ కేసులు తిరిగబడ్డాయి కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఆ జిల్లాలో వేల కేసులు బయటపడ్డాయి. కృష్ణా, కడప కంటే విశాఖ జిల్లానే తొలుత 10 వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం విశాఖలో 10,765 పాజిటివ్‌ కేలున్నాయి. 

అనంతపురం జిల్లాలో కరోనా ఉధృతి పెరిగిపోయింది. తాజాగా ఎన్నడూ లేని విధంగా 1387 కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది మృతి చెందడంతో కరోనా మరణాల సంఖ్య 114కు చేరింది. శ్రీకాకుళం జిల్లాలో 402 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 6,678కు చేరింది. కడపలో 646 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 8061కు చేరుకుంది. కర్నూలులో కొత్తగా 1124 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. 8 మంది మృతి చెందారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతుండటంతో  ప్లాస్మా ఇచ్చేవారికి నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్లాస్మా థెరపీపై కూడా ప్రజల్లో బాగా అవగాహన కల్పించాలనీ, దీనివల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సాహించాలనీ సూచించారు. కరోనా రోగులకు ప్లాస్మా ఇచ్చేవారికి 5వేల రూపాయలు ఇవ్వాలని. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందనీ సీఎం చెప్పారు. 

కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘బెడ్లు దొరకలేదనే పరిస్థితి ఉండకూడదు.  హెల్ప్‌డెస్క్‌ల్లో ఆరోగ్య మిత్రలను ఉంచాలి. కోవిడ్‌ కోసం నిర్దేశించిన138 ఆస్పత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టండి. సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. హెల్ప్‌డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్‌ బాగుండాలి. హెల్ప్‌డెస్క్‌ ప్రభావవంతంగా పనిచేస్తే.. చాలావరకు సమస్యలు తగ్గుతాయి. బెడ్లు, వైద్యం, ఫుడ్, శానిటేషన్‌ బాగుందా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి’ అన్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle