newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

కేఈ వార‌సుడికి క‌ష్ట‌మేనా..?

02-04-201902-04-2019 07:59:47 IST
2019-04-02T02:29:47.643Z02-04-2019 2019-04-02T02:29:25.263Z - - 22-09-2019

కేఈ వార‌సుడికి క‌ష్ట‌మేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీలో వారసుల జోరు బాగా క‌నిపిస్తోంది. ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కుల వార‌సులు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. క‌ర్నూలు జిల్లా సీనియ‌ర్ రాజకీయ నేత‌, ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణమూర్తి సైతం ఈ ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకొని త‌న కుమారుడు కేఈ శ్యాంబాబును ఎన్నిక‌ల బ‌రిలో దింపారు. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప‌త్తికొండ నుంచే కుమారుడిని పోటీ చేయిస్తున్నారు.

2009లో కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు కేఈ ప్ర‌భాక‌ర్ ఇక్క‌డి నుంచి విజ‌యం సాధించారు. 2014లో కేఈ కృష్ణ‌మూర్తి గెలిచి ఉప‌ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కోట్ల హ‌రిచ‌క్ర‌పాణిరెడ్డిపై 16 వేల ఓట్ల‌తో కేఈ విజ‌యం సాధించారు. ఇక‌, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చెరుకులపాడు నారాయ‌ణ‌రెడ్డి ఏకంగా 32 వేల ఓట్లు సాధించి త‌న బ‌లం చాటుకున్నారు. రాష్ట్రంలో హేమాహేమీల్లాంటి కాంగ్రెస్ నేత‌ల‌కు క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌క‌పోగా నారాయ‌ణ‌రెడ్డికి మాత్రం భారీగా ఓట్లు వ‌చ్చాయి.

ఎన్నిక‌ల త‌ర్వాత హ‌రిచ‌క్ర‌పాణిరెడ్డి వైసీపీకి దూరం కాగా, నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేరారు. దీంతో ఆయ‌న‌నే ఇంఛార్జిగా నియ‌మించారు. అదే స‌మ‌యంలో రెండేళ్ల క్రితం ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న‌ను దారుణంగా హ‌త్య చేశారు. కేఈ శ్యాంబాబే ఆయ‌న‌ను హ‌త్య చేయించార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే, పోలీసులు మాత్రం ఆయ‌న‌కు సంబంధం లేద‌ని తేల్చారు.

కానీ, ఇప్ప‌టికీ వైసీపీ కేఈ శ్యాంబాబుపైనే ఆరోప‌ణ‌లు చేస్తోంది. పాద‌యాత్ర స‌మ‌యంలోనే నారాయ‌ణ‌రెడ్డి భార్య కంగాటి శ్రీదేవిని ప‌త్తికొండ అభ్య‌ర్థిగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి ఆమె నియోజ‌క‌వ‌ర్గ పార్టీ బాధ్య‌త‌లు తీసుకొని ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. భ‌ర్త‌ను కోల్పోయిన సానుభూతి, నారాయ‌ణ‌రెడ్డికి ఉన్న స్వంత బ‌లానికి వైసీపీ బ‌లం కూడా తొడ‌వుతుంది కాబ‌ట్టి క‌చ్చితంగా ఆమె విజ‌యం సాధిస్తుంద‌ని వైసీపీ నేత‌లు ధీమాగా ఉన్నారు.

ఇక‌, ఎన్నిక‌లు ఎదుర్కోవ‌డం మొద‌టిసారే అయినా కేఈ శ్యాంబాబు ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క నేత‌గా ఉన్నారు. మంత్రిగా తండ్రి రాష్ట్ర రాజ‌కీయాల్లో బిజీగా ఉంటే శ్యాంబాబు నియోజ‌క‌వ‌ర్గంలో అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న అభ్య‌ర్థిత్వం కూడా ముందే ఖ‌రారైంది. దీంతో ఆయ‌న ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. కేఈ కుటుంబానికి ఇక్క‌డ బాగా ప‌ట్టుంది. టీడీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు, మంత్రిగా త‌న తండ్రి చేసిన అభివృద్ధి త‌న‌ను గెలిపిస్తాయ‌ని ఆయ‌న న‌మ్మ‌కంగా ఉన్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హ‌వా కొన‌సాగింది. 14 స్థానాల్లో 10 స్థానాల‌ను ఆ పార్టీ గెలుచుకుంది. ఈసారి కూడా జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాల‌ని వైసీపీ ప‌ట్టుద‌లగా ఉంది. ఇందులో భాగంగా గ‌త ఎన్నిక‌ల్లో కోల్పోయిన ప‌త్తికొండ సెగ్మెంట్ పై దృష్టి పెట్టింది. అయితే, కేఈ కుటుంబానికి ప‌ట్టున్న ప‌త్తికొండ‌లో వైసీపీ ఏమేర‌కు స‌త్తా చాటుతుందో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle