newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

కేంద్ర విద్యుత్ చట్టం.. కేసీఆర్ తెగువ జగన్ వద్ద లేదే!

15-09-202015-09-2020 16:31:46 IST
2020-09-15T11:01:46.171Z15-09-2020 2020-09-15T11:01:44.379Z - - 01-10-2020

కేంద్ర విద్యుత్ చట్టం.. కేసీఆర్ తెగువ జగన్ వద్ద లేదే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో విద్యుత్‌ ఉన్నప్పటికీ ఇప్పటివరకు దేశంలో విద్యుత్‌ బాధ్యత, అధికారాలన్నీ రాష్ట్రాలకే ఉన్నాయి. అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా విద్యుత్ సవరణ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం అమలైతే రాష్ట్రాలు కేవలం బాధ్యతలకు మాత్రమే పరిమితం కాగా కీలక అధికారాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతాయి. విద్యుత్‌ రంగంలో ప్రైవేటు ఫ్రాంచైజీలు, సబ్‌ లైసెన్సీలు, విద్యుత్‌ సబ్సిడీలు, క్రాస్‌ సబ్సిడీల కట్టడి వంటి ఎన్నో కీలకమైన సంస్కరణలతో కేంద్ర విద్యుత్‌ చట్టం–2003కు పలు సవరణలను ప్రతిపాదిస్తూ ముసాయిదా బిల్లు 2020ను ఇటీవల కేంద్ర విద్యుత్‌ శాఖ ప్రకటించింది. ఇదే ఇప్పుడు చాలా రాష్ట్రాలలో కేంద్రంపై అసంతృప్తి నెలకొంది.

ఈ చట్టంపై మన తెలుగు రాష్ట్రాలలో భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ఈ విద్యుత్ చట్టానికి అనుగుణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ చట్టంలో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లకు ఇచ్చే ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ పథకాన్ని తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను బిగించాలని ఏపీ ప్రభుత్వం జీవో కూడా జారీచేసింది. దీనిపై విమర్శలు రావడంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచిత విద్యుత్ అమల్లోనే ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది.

అయితే, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ ఈ నూతన విద్యుత్ సవరణల చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం నూతన విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంటే ఎందుకు సహించాలంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు వెయ్యి కోట్లు కావాలన్న సీఎం అసలు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలకు ఇష్టమేనా అని ప్రశ్నలు కూడా సంధించారు.

తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో ఇప్పుడు కేంద్ర నూతన విద్యుత్ సవరణ చట్టం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోని రైతులకు భవిష్యత్ లో భారంగా మారే చట్టం.. రాష్ట్రాల హక్కులను కేంద్రం లాగేసుకొనే చట్టానికి సీఎం జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేయకపోగా మిగతా రాష్ట్రాల కంటే ముందే ఎందుకు అమలు చేయాలని ఆరాటపడుతుందని చర్చలు మొదలయ్యాయి. కేంద్ర విధానాన్ని ఎదిరించిన సీఎం కేసీఆర్ తెగువ జగన్మోహన్ రెడ్డి వద్ద ఎందుకు లేదనే ప్రశ్నలు మొదలవుతున్నాయి.

జనవరిలో శశికళ జైలు నుండి విడుదల.. అన్నాడీఎంకేలో పరుగులు!

జనవరిలో శశికళ జైలు నుండి విడుదల.. అన్నాడీఎంకేలో పరుగులు!

   3 hours ago


అన్నదాతను వెంటాడుతున్న అవే ఇబ్బందులూ... అవే ఆంక్షలూ!

అన్నదాతను వెంటాడుతున్న అవే ఇబ్బందులూ... అవే ఆంక్షలూ!

   5 hours ago


బాబ్రీ బాసీదు కూల్చివేత కేసు.. కోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన!

బాబ్రీ బాసీదు కూల్చివేత కేసు.. కోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన!

   8 hours ago


కరోనాపై కథలు కాదు... వాస్తవాలు చెప్పాలి..?!

కరోనాపై కథలు కాదు... వాస్తవాలు చెప్పాలి..?!

   10 hours ago


ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

   11 hours ago


దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

   13 hours ago


దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

   13 hours ago


తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

   13 hours ago


తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

   13 hours ago


అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle