newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

కేంద్రాన్ని కడిగిపారేస్తానన్న జగన్.. ఇప్పుడు పలకరే?

15-11-201915-11-2019 01:24:50 IST
2019-11-14T19:54:50.004Z15-11-2019 2019-11-14T19:54:46.285Z - - 28-02-2020

కేంద్రాన్ని కడిగిపారేస్తానన్న జగన్.. ఇప్పుడు పలకరే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే ఏమొస్తదో తెలుసా.. మనమెవరం ట్యాక్స్ కట్టక్కర్లే.. రాష్ట్రానికి పరిశ్రమలొస్తాయి.. ఆసుపత్రులొస్తాయి.. మనందరి జీవితాలు బాగుపడతాయి.. ఈ చంద్రబాబేమో ప్రత్యేకహోదాను తీసుకెళ్లి కేంద్రాన్ని తాకట్టుపెట్టారు. మీ చల్లని దీవెనెలతో.. ఆ దేవుడి ఆశీర్వాదంతో నాకు కనుక 25 ఎంపీ సీట్లిస్తే కేంద్రాన్ని కడిగిపారేసి, మెడలు వంచేసి ప్రత్యేకహోదాను తెచ్చి మీ అందరి బతుకులలో వెలుగు తెచ్చి చూపిస్తా.

ఈ మాటలలో ఒక్క అక్షరం తేడా లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుండి వెలువడ్డాయి. ఒక్కసారి రెండుసార్లు కాదు పదుల సంఖ్యలో ఇదే మాటను ఎన్నికల ప్రచారంలో మ్యానిఫెస్టో మాదిరి ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి కేంద్రాన్ని కడిగిపారేయాల్సిన సమయం వచ్చింది. మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకోవాల్సిన అవసరం కూడా రానే వచ్చింది.

ఢిల్లీలో ఏపీకి రావాల్సిన నిధుల పెండింగ్ ఇంకా అలానే ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఢిల్లీకి వెళ్లినా ప్రధాని సంగతెలా ఉన్నా మంత్రుల అపాయింట్ మెంట్ కోసం కూడా వెయిటింగ్ తప్పడం లేదు. మరోపక్క రాష్ట్రంలో నిధుల కొరత వేధిస్తుండగా ఖర్చులు మాత్రం ఘోరంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో కేంద్రం ఆదుకోవాల్సిందే. కానీ కేంద్రంలో ఏపీ మీద అంత ప్రేమ ఉన్నట్లు కనిపించడం లేదు.

మరి సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కడిగిపారేస్తారా? త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నాయి. మరి తన 23 మంది ఎంపీలకు ఏమని దిశానిర్దేశం చేయనున్నారు? కేంద్రానికి ఎదురు తిరిగి హక్కులను సాధిస్తారా? గత ప్రభుత్వంలో ఇదే కేంద్రం నుండి రాబట్టలేకపోవడం చంద్రబాబు చేతగాని తనంగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరి చేతగాని తనంగా చెప్పుకోవాలి?

ప్రతిపక్షంలో ఉండగా కేంద్రానికి నిరసనగా తమ ఎంపీలతో రాజీనామా చేయించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంతకన్నా ఎక్కువమందే ఎంపీలు ఉండగా ఇప్పుడేం చేస్తారు? ఇప్పుడు కూడా కేంద్రానికి నిరసనగా తమ 23 మంది ఎంపీలతో రాజీనామా చేయిస్తారా? అసలు ఆ ఎంపీలు ప్రత్యేకహోదా కావాలని పార్లమెంట్ సాక్షిగా గొంతెత్తి పోరాడుతారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

చంద్రబాబు నాయుడు హోదాను పక్కనపెట్టి ప్యాకేజీకి ఒప్పుకొంటే ప్రత్యేకహోదా తెచ్చేది ఇచ్చేది మేమెనన్న వైసీపీ నేతలు పార్లమెంట్ లో కనీసం ప్రత్యేకహోదా డిమాండ్ అయినా చేయగలరా? అన్నదే అంతుచిక్కడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కత్తి వేలాడుతుండగా ఆ పార్టీ నేతలు ఒక్క పార్లమెంట్లోనే కాదు ఎక్కడా నోరు మెదిపే పరిస్థితి లేదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

రోజూ పనిగట్టుకొని రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలకు దిగుతున్నా వైసీపీ నేతలు తిరిగి ఒక్కమాట అనే పరిస్థితి లేదు. మరి ఇక పార్లమెంట్లో ఏం పోరాటం చేస్తారని ఓ వర్గం ప్రజల నుండి వస్తున్న నిట్టూర్పు. మరి వైసీపీ స్టాండ్ ఏంటి? జగన్ చెప్పిన మాటలు నీటి మూటలేనా? వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఏం చేయనున్నారు? అసలు ఎంపీలకు జగన్ ఏమని దిశానిర్ధేశం చేయనున్నారు? వేచి చూద్దాం!

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   an hour ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   4 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   4 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   9 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   9 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   10 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   11 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   12 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   12 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle