కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం
17-11-201917-11-2019 15:44:27 IST
2019-11-17T10:14:27.684Z17-11-2019 2019-11-17T10:14:20.545Z - - 06-12-2019

ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో మన తిరుమల తిరుపతి విశిష్టత వేరు. అఖండకోటి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే ఆ శ్రీవారి ఏడూ కొండలపై అన్యమతస్థులు ప్రచారం ఒక్కోసారి కలకలం రేపుతున్న సంగతులు మన అందరం చూస్తున్నదే. దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులలో కొందరు అన్యమతాలను స్వీకరించి ప్రార్ధనలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువగానే ఉంటుంది. నిజానికి టీటీడీలో పనిచేసే ఉద్యోగులంతా హిందువులే ఉండాలి. అక్కడ చేసే పనిని ఉద్యోగ బాధ్యతలా కాకుండా సేవగానే భావించాలని టీటీడీ ధర్మం. శ్రీవారిని అన్యమతస్థులు ఎవరైనా దర్శించుకోవాలంటే ముందుగా ఆయనపై తమకు నమ్మకం ఉందని తెలుపుతూ సంతకం చేసిన తర్వాతనే దర్శనానికి వెళ్ళాలి. ఇందుకు రాష్ట్రపతులు, ప్రధానులు కూడా అతీతం కాదు. అలాంటిది అక్కడ పనిచేసే ఉద్యోగులు పూర్తిగా హిందూ సంప్రదాయానికి చెందిన వారై ఉండడంతో పాటు నిత్యం అయన సేవలోనే ధరించాల్సి ఉంటుంది. కానీ కొందరు క్రైస్తవులు హిందువులుగా సర్టిఫికెట్లు సృష్టించి టీటీడీలో ఉద్యోగులుగా చొరబడితే మరికొందరు హిందూ ఉద్యోగులే.. ఉద్యోగాలు వచ్చిన తర్వాత క్రైస్తవ మతానికి ఆకర్షితులై మత మార్పిళ్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు టీటీడీ ఉద్యోగులుగా పనిచేస్తున్న కొందరు చర్చిలలో ప్రార్ధనలు చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. అంతేకాకుండా వీడియోల ఆధారంగా ఆ ఉద్యోగులపై టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి కార్యాలయానికి ఫిర్యాదులు చేశారు. కానీ అన్యమత ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇక ఇదే విషయంలో కఠినంగా ఉన్న కారణంగానే మాజీ సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఓ మతానికి చెందిన వర్గం ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడిని తెచ్చారని కూడా ప్రచారం జరిగింది. మొత్తంగా చూస్తే కారణాలేమైనా టీటీడీ అన్యమత ఉద్యోగుల వ్యవహారాన్ని కట్టడి చేయలేకపోతుందని విశ్లేషకుల అభిప్రాయం. కాగా ఈ మతమార్పిళ్లు, అన్యమత ఉద్యోగుల వెనుక చర్చి కుట్ర ఉందని ఆరోపణలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఆ రెండు వ్యవహారాలపై కేంద్రానికే ఫిర్యాదులు అందాయి. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే అన్యమత వ్యవహారాలలో అధికారుల ఉదాసీన, అనుమానాస్పద వైఖరిని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శిని ఆశ్రయించింది. టీటీడీలో అన్యమత వ్యవహారాలపై ఫిర్యాదులు చేసింది. టీటీడీలో ఉన్న క్రైస్తవ ఉద్యోగులతో పాటు వారి వెనుక ఉన్న చర్చిలు, ఆ సంస్థలకు విదేశీ సంబంధాలు, నిధులు, స్థిరచర ఆస్తుల తదితర విషయాలపై కూడా విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరామని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ప్రకటనలో తెలియజేసింది. మరి కేంద్ర హోంశాఖ స్పందించి ఆ ఉద్యోగులపై చర్యలకు దిగి అన్యమతస్తులను గెంటేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!
8 hours ago

ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్గా అక్బరుద్దీన్ నియామకం
9 hours ago

అమరావతి వార్: వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు
10 hours ago

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!
10 hours ago

శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్
11 hours ago

జర్నలిస్ట్ అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్
11 hours ago

అప్పులు చేయడంలో జగన్ సరికొత్త రికార్డులు..!
12 hours ago

మోడీ సర్కార్ విఫలం.. నిప్పులు చెరిగిన చిదంబరం
13 hours ago

దిశ కేసులో దర్యాప్తు మమ్మరం.. నెలలోపే హంతకులకు శిక్ష
13 hours ago

రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయా పవన్.. విజయసాయి విమర్శలు
14 hours ago
ఇంకా