newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

18-01-202018-01-2020 13:25:22 IST
Updated On 20-01-2020 17:05:19 ISTUpdated On 20-01-20202020-01-18T07:55:22.463Z18-01-2020 2020-01-18T07:55:21.026Z - 2020-01-20T11:35:19.541Z - 20-01-2020

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై అమరావతి వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.ఈ నేపథ్యంలో మరోమారు తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి వై.సుజనాచౌదరి. అమరావతి నుంచి రాజధాని తరలింపు పై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. తమ భవిష్యత్తు ఏమిటని రైతులు భయపడుతున్నారని, రాజధాని మార్పును అందరూ వ్యతిరేకించాలన్నారు. 

రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని 13 జిల్లాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచిస్తే మంచిదని జగన్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. గత ఏడు నెలల్లో కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి తరలిపోయే పరిస్థితి నెలకొందని .. రాజధాని  తరలింపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి  పూర్తిగా దెబ్బతింటుందని వైఎస్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. 

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులను బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. అమరావతి లో జరుగుతున్న పరిణామాలను కేంద్రం పరిశీలిస్తోందని, అధికార ప్రకటన వెలువడిన తర్వాత సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వానికే ఇచ్చారని, వ్యక్తులకు కాదన్నారు. ఆ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారని, పార్లమెంటు చట్టం ప్రకారం అమరావతికి కేంద్రం సాయం చేస్తోందన్నారు. దేశంలో పార్లమెంటే సుప్రీం అని.. దాని కాదని ఏ నిర్ణయం తీసుకున్నా అది కుదరదన్నారు. 

శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వంత ప్రభుత్వం నిర్ణయాల వల్ల వైసీపీ నేతలే సంతోషంగా లేరన్నారు. అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుగుణంగా అధికారులు పనిచేయడం కుదరదన్నారు. హైకోర్ట్, సచివాలయం, రాజ్ భవన్ ఒకేచోట ఉండాలని విభజన చట్టం సెక్షన్ 6 చెబుతోందన్నారు వైఎస్ చౌదరి. పాలనపై దృష్టిపెట్టాలని జగన్ కు సూచించారు. రాజధానిని మారిస్తే ఊరుకోబోమని, ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు. 13 జిల్లాలను అభివృద్ధిచేయాలని ఆలోచించడం మంచిదేనని, అయితే అమరావతిని విస్మరిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోబోవన్నారు.  మనీబిల్లుగా సీఆర్డీయే తెస్తామంటే అయ్యే పనికాదన్నారు. సీఆర్టీయేని రద్దుచేయడం కుదరదన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle