newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

కేంద్రం ఆదేశాలు బేఖాతర్‌ చేస్తున్న ఎపి సర్కార్‌

21-09-201921-09-2019 12:46:05 IST
Updated On 21-09-2019 13:00:48 ISTUpdated On 21-09-20192019-09-21T07:16:05.670Z21-09-2019 2019-09-21T07:15:55.176Z - 2019-09-21T07:30:48.995Z - 21-09-2019

కేంద్రం ఆదేశాలు బేఖాతర్‌ చేస్తున్న ఎపి సర్కార్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రం ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు పట్టవా? పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తున్నది. రాష్ట్ర పునర్నిర్మాణ చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిది, అయితే నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యత ఏపీ సర్కార్ ది. నిధులు మాత్రం కేంద్రమే చెల్లిస్తుంది. 

ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం అలాగే సాగింది. అయితే బీజేపీ- తెలుగుదేశంల మధ్య పొత్తు చెడే వరకూ ఈ వ్యవహారం అంతా సవ్యంగానే నడిచింది. ఒక సారి ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన తరువాత నుంచీ పోలవరం నిర్మాణంపై విపక్ష విమర్శలతో బీజేపీ కూడా గొంతు కలిపింది.న గత సార్వత్రిక ఎన్నికలలో సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీయే ఏపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పోలవరం చంద్రబాబుకు ఏటీఎంగా మారిపోయిందని విమర్శ చేశారు. అయితే పొత్తు చెడినప్పటి నుంచీ కేంద్రం నుంచి పోలవరం నిధుల విడుదల దాదాపుగా నిలిచిపోయింది.  

ఇప్పుడు ఏపీలో అధికారం మారింది. అప్పట్లో తెలుగుదేశం సర్కార్ పై విమర్శలతో విరుచుకుపడిన వైకాపా ఇప్పుడు అధికారంలోనికి వచ్చింది. అవకతవకలకు అవకాశం లేకుండా పోలవరం నిర్మాణ బాధ్యతను తీసుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. కేంద్రంపై ఒత్తిడి పెంచి నిధులు రాబట్టాల్సింది పోయి అసలు పోలవరం నిర్మాణంపైనే దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రానికి జీవధార వంటి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర పునర్నిర్మాణ చట్ట స్ఫూర్తికి భిన్నంగా ఉంది.ఎంత సేపూ కాంట్రాక్టర్లను తప్పించాలన్న ధోరణే తప్ప...కాంట్రాక్టులలో అవకతవకలు లేవని  కేంద్రం చెబుతున్నా పట్టించుకోవడం లేదు. 

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం కాంట్రాక్ట్ నుంచి ట్రాన్స్ ట్రాయ్ ను తప్పించి నవయుగకు అప్పగించిన మాట వాస్తవమే. అయితే ఈ మార్పునకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఆ తరువాతే కాంట్రాక్టు మారింది. అయితే కేంద్రం వద్దని సూచించినా, అది కూడదని ఆదేశించినా రివర్స్  పేరుతో వైకాపా సర్కార్ నవయుగను తొలగించింది. నవయుగ ఇది సరికాదంటూ కోర్టును ఆశ్రయించింది. అది తేలేవరకూ పోలవరం పనులు ఆగిపోతాయన్నది నిర్వివాదాంశం. 

కేంద్రం ఆదేశాలు ఏపీకి వర్తించవా?  వైఎస్ హయాంలో జలయజ్ణం అవినీతి యజ్ణంగా మారిందని అప్పటి విపక్ష నేత చంద్రబాబు విమర్శిస్తే...తెలుగుదేశం హయాంలో పోలవరం పేరిట వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ విమర్శిస్తున్నారు. అంతే తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు, సాగునీటి సమస్యలకు, విద్యుత్ సమస్యలకు, తాగునీటి సమస్యలకు పోలవరం పరిష్కారం అన్న విషయాన్ని సీఎం జగన్ పట్టించుకోవడం లేదు.  బాబు ఆరంభించారు కనుక అది ఇలా పూర్తి కావడానికి వీల్లేదన్నట్లుగా ప్రభుత్వ విధానం ఉంది. 

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఇలా ప్రాంతీయ పార్టీల వైరుద్ధ్యం కారణంగా నత్తనడకన సాగడం ఎంత మాత్రం సరికాదు. కేంద్రం ఈ ప్రాజెక్టు సత్వర పూర్తికి తగు చర్యలు తీసుకోవాలి.  ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ కు జీవధార. జాప్యం లేకుండా, నిర్మాణ వ్యయం మరింత పెరగకుండా ఈ ప్రాజెక్టు సత్వరమే పూర్తి కావాలన్నది ఏపీ ప్రజల ఆకాంక్ష. ఇప్పటికే కేంద్రం ఈ ప్రాజెక్టుకు అరకొర నిధులను విడుదల చేస్తూ ప్రాజెక్టు వేగంగా పూర్తి కాకుండా అవరోధాలు కల్పిస్తున్నది. నిధులు విడుదల చేయకుండా ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను శల్యసారథ్యంలా నిర్వహిస్తున్నది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా సర్కార్ పోలవరం పనులను పక్కన పెట్టి...గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణం పేర జరిగింది అవినీతి మాత్రమేనని రుజువు చేయాలని తహతహలాడుతోంది. 

అయితే అవినీతి నిగ్గు తేల్చడాన్ని ఎవరూ అభ్యంతర పెట్టరు కానీ...ఆ పేరు చెప్పి ప్రాజెక్టు పనులను నిలిపివేయడాన్ని మాత్రం జనం ఆమోదించరు. అయితే ప్రజా ఆకాంక్షను కూడా పట్టించుకోకుండా, ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా, కేంద్రం కూడదంటున్నా...రివర్స్ టెండరింగ్ పేరిట పనుల నిలుపుదలకు నిర్ణయం తీసుకోవడం సరైన నిర్ణయం కాదన్న భావన పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. 

రివర్స్ టెండరింగ్ అంటూ రద్దుల చిట్టా తెరవడానికి బదులు...గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల రికార్డులన్నీ పరిశీలించి అవినీతిపై ఆధారా సహితంగా ప్రజలకు తెలియజేయాలి. అలాగే అవినీతి కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడమే కాకుండా అవినీతి సొమ్మును రాబట్టాలి. వారు గత ప్రభుత్వ పెద్దలైనా, అధికారులైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రానికి జీవధార వంటి ప్రాజెక్టు పనులు నిలిచిపోకుండా అన్ని చర్యలూ తీసుకోవాలి. 

కేంద్రంలోని మోడీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వానికి విస్పష్టంగా పోలవరంలో అవినీతికి ఆధారాలు చూపాలని ఆదేశించింది. ఆ ఆదేశాలు తమ సర్కార్ కు పట్టవన్నట్లుగా జగన్ వైఖరి కనిపిస్తున్నది. కాంట్రాక్టు రద్దును పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా తప్పుపట్టింది. ఈ నిర్ణయం వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరుగుతుందని హెచ్చరించింది. అలాగే అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని కూడా అథారిటీ తేల్చేసింది. కేంద్రానికి కూడా ఆ మేరకు నివేదిక పంపింది. ఇప్పటికైనా జగన్ పోలవరం విషయంలో తన ధోరణి సవరించుకుని ప్రాజెక్టు నిర్మాణం వేగవంతమయ్యేందుకు చర్యలు తీసుకోవాలి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle