newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

14-10-201914-10-2019 09:41:42 IST
Updated On 14-10-2019 12:35:06 ISTUpdated On 14-10-20192019-10-14T04:11:42.127Z14-10-2019 2019-10-14T04:11:26.421Z - 2019-10-14T07:05:06.499Z - 14-10-2019

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడిక కేంద్రంపై ఏడుదాడికి దిగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ మేరకు సిద్దమైనట్లుగా తెలుస్తుంది. పలు పాలనా పరమైన అంశాలలో ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వం తప్పు బడుతుంది. పోలవరం రివర్స్ టెండర్లపై ఆ ప్రాజెక్ట్ అథారిటీ కేంద్రానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్రం టెండర్ల రద్దును మరోసారి ఏపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలని సూచించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గలేదు. రివర్స్ టెండర్ ద్వారా మేఘా కంపెనీకి పోలవరం కాంట్రాక్టును అప్పగించింది.

ఇక పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకున్న పునఃసమీక్షలను కేంద్రం ఆక్షేపించింది. విద్యుత్ ఒప్పందాలు కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశం కాదని.. పునఃసమీక్షలకు వెళ్తే అది దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ఇతర దేశాల నుండి పెట్టుబడులపై ప్రభావం పడుతుందని కేంద్రం హెచ్చరికలతో కూడిన సూచనలు చేసింది. ఈమేరకు కేంద్రమంత్రులు కూడా లేఖల మీద లేఖలు రాశారు. అయినా జగన్ సర్కార్ వెనక్కు తగ్గక సమీక్షలకు వెళ్ళింది. ఫలితంగా సంస్థలు కోర్టుకు వెళ్లి సమీక్షలను రద్దు చేయాలని కోరడంతో వెనక్కు తగ్గక తప్పలేదు.

అయితే ఇప్పుడు ఆ ఒప్పందాలను ఈఆర్సీ ద్వారా కొన్ని కంపెనీల విద్యుత్ కనెక్షన్లను తొలగించగా మరికొన్నిటికి కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. ఈఆర్సీకి కూడా కేంద్రం అడ్డు తగిలితే ఏం చేయాలనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు కేంద్రం మీద ఎదురుదాడి ప్రారంభించినట్లుగా కనిపిస్తుంది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్‌కు ఓ లేఖరాశారు. తాము సమీక్షలు చేయాలంటే వద్దంటున్న పీపీఏల వల్ల తమ రాష్ట్రానికి ఏటా రూ.ఐదు వేల కోట్ల నష్టం జరుగుతోందని, కేంద్రం కొంత మేర భరించాలని బాలినేని ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు సోలార్‌ పవర్, విండ్‌ పవర్‌ కారణంగా ఏపీ ప్రభుత్వంపై ఏటా రూ.5వేల కోట్ల భారం పడుతోందని, గత నాలుగేళ్లుగా పరిమితికి మించి సోలార్‌, విండ్‌ పవర్‌ కొంటున్నామని, సోలార్‌, విండ్‌ పవర్‌కి కేంద్రం సబ్సిడీలు ఇవ్వాలని లేఖలో కోరారు. ఇక ఏపీలో విద్యుత్‌రంగ సంక్షోభాన్ని అధిగమించేందుకు చర్చలు జరుపుతున్నామని, సంక్షోభ పరిష్కారం కోసం కేంద్రం కమిటీ వేయాలని కూడా లేఖలో కోరారు. పీపీఏల వల్ల తమకు భారమవుతుందని ఆ భారాన్ని కేంద్రం భరిస్తే మేము ఒప్పందాల జోలికెళ్ళమని క్లుప్తంగా లేఖ ద్వారా చెప్పారు.

నిజానికి ఆ ఒప్పందాలను చంద్రబాబు హయంలో చేసుకుంటే ఈ ప్రభుత్వం సమీక్షలు అంటుంది. పెట్టుబడులపై ప్రభావం పడుతుందని కేంద్రం వారిస్తుంది. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రివర్స్ లో కేంద్రానికి పరోక్షంగా డిమాండ్లు పంపింది. అయితే గత ఒప్పందాల ప్రకారం యూనిట్ నాలుగు రూపాయలకు దొరుకుతుంటే సమీక్షలకు వెళ్లిన తర్వాత ఇప్పుడు కొరతతో యూనిట్ రూ12 పెట్టి కొనాల్సి వస్తుంది. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఒకపక్క సంక్షోభం అంటూనే డిమాండ్లు చేయడం ఏమిటో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్రం ఈ ఎదురుదాడికి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

 

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle