newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

కేంద్రంపై జ‌గ‌న్ కన్ఫ్యూజ్ అవుతున్నారా?

12-05-201912-05-2019 08:33:37 IST
Updated On 28-06-2019 15:55:20 ISTUpdated On 28-06-20192019-05-12T03:03:37.207Z12-05-2019 2019-05-12T02:51:46.084Z - 2019-06-28T10:25:20.088Z - 28-06-2019

కేంద్రంపై జ‌గ‌న్  కన్ఫ్యూజ్ అవుతున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓ వైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు దేశ రాజ‌కీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించేందుకు బిజీబిజీగా గ‌డుపుతూ చ‌ర్చ‌ల్లో మునిగి తేలుతుంటే జ‌గ‌న్ మాత్రం కేంద్ర రాజ‌కీయాల‌పై సైలెంట్ గా ఉంటున్నారు. మీడియా, మిగ‌తా పార్టీలు కేంద్రంలో ప్ర‌భుత్వ ఏర్ప‌టులో కీల‌క‌మ‌య్యే ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక‌ట‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తుంటే జ‌గ‌న్ మాత్రం త‌న వ్యూహాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం లేదు.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు తుది ద‌శ‌కు చేరుకుని ఫ‌లితాల‌కు ఇంకా 10 రోజులే స‌మ‌యం ఉన్నా జ‌గ‌న్ మాత్రం కేంద్రంలో త‌మ పాత్ర ఏంటి అనేదానిపై పెద‌వి విప్ప‌డం లేదు. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ప‌లు జాతీయ మీడియా సంస్థ‌ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లోనూ జాతీయ రాజ‌కీయాల‌పై జ‌గ‌న్ స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అయితే, ప్ర‌త్యేక హోదా ఇచ్చే పార్టీకే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని మాత్రం జ‌గ‌న్ ప‌దేప‌దే స్ప‌ష్టంగా చెప్పారు.

కాంగ్రెస్ జగన్‌ని బుజ్జగిస్తుందా?

Image result for jagan and congress

అయితే, ఇన్ని రోజులుగా జ‌గ‌న్ కు బీజేపీతో అవ‌గాహ‌న ఉంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారాన్ని చాలామంది న‌మ్మారు. అయితే, ఇప్పుడు మాత్రం జ‌గ‌న్ ను త‌మ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టింద‌ని జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కాలం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం ప్ర‌య‌త్నించిన కేసీఆర్ తో పాటు జ‌గ‌న్ తోనూ ఆ పార్టీ సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని వార్త‌లు ప్ర‌చురించాయి. వైసీపీ కీల‌క నేత ఒక‌రు కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు.

జ‌గ‌న్ ముందునుంచీ చెబుతున్నట్లుగా ప్ర‌త్యేక హోదా ఇచ్చే పార్టీకే మ‌ద్ద‌తు ఇస్తామంటే బీజేపీకి ఆయ‌న మ‌ద్ద‌తు ఇవ్వ‌డం క‌ష్ట‌మే. ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఒక‌వేళ జ‌గ‌న్ బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వాలంటే ఆ పార్టీ ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధం కావాలి లేదా జ‌గ‌న్ మాట త‌ప్పాలి. ఇవి జ‌రిగే అవ‌కాశాలు త‌క్కువే. ఇక‌, మొన్న‌టి వ‌ర‌కు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తే జ‌గ‌న్ అందులో చేరే అవ‌కాశం ఉండేది. ఇప్పుడు ఆ ప‌రిస్థితి కూడా లేదు.

అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కూడా జ‌గ‌న్ వైపు చూస్తుంద‌ట‌. పైగా ఆ పార్టీ ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఎన్నిక‌ల హామీనే ఇచ్చింది. దీంతో జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా ప్ర‌త్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ కే మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన ప‌రిస్థితి. త‌న‌ను జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీని క్ష‌మించేశాన‌ని, ప్ర‌త్యేక హోదా కోసం ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధ‌మేన‌ని జ‌గ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌క‌టించారు.

అయితే, కాంగ్రెస్ కూట‌మిలో జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వారానికోసారి చంద్ర‌బాబు వెళ్లి రాహుల్ ను క‌లుస్తున్నారు. వారిద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయంగా మంచి స‌ఖ్య‌త ఏర్ప‌డింది. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ కు రాహుల్ గాంధీతో స‌ఖ్య‌త లేదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు, జ‌గ‌న్ ఇద్ద‌రూ కేంద్రంలో ఒకే పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు.

అయితే, జ‌గ‌న్ కాంగ్రెస్ లో ఉన్న‌ప్పుడు కొంద‌రు ఢిల్లీ స్థాయి కీల‌క నేత‌లు జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా నిలిచారు. వారి ప‌ట్ల జ‌గ‌న్ కు కూడా అభిమానం ఉంది. ఇటువంటి వారిని ఇప్పుడు కాంగ్రెస్ రంగంలోకి దింపి జ‌గ‌న్ ను త‌మ వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం. ఒక‌వేళ జ‌గ‌న్ క‌నుక కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డితే.. వైసీపీ, టీడీపీ కేంద్రంలో క‌లిసి ప‌నిచేస్తాయ‌న్న మాట‌. ఇది జ‌రిగే ప‌నిగా మాత్రం క‌నిపించ‌డం లేదంటున్నారు ప‌లువురు రాజ‌కీయ విశ్ల‌ష‌కులు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle