newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

కేంద్రంతో కొట్లాట.. ఏపీకి అంధకారం తప్పదా?

16-10-201916-10-2019 15:37:52 IST
Updated On 16-10-2019 16:39:00 ISTUpdated On 16-10-20192019-10-16T10:07:52.217Z16-10-2019 2019-10-16T10:07:43.842Z - 2019-10-16T11:09:00.260Z - 16-10-2019

కేంద్రంతో కొట్లాట.. ఏపీకి అంధకారం తప్పదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో గొడవకు సిద్దమైందా? పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు జగన్ సర్కార్ సూచనలిచ్చిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. పీపీఏల విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వం హయంలో చేసుకున్న పీపీఏలపై సమీక్షలకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నించగా కేంద్రం గట్టిగా వారిస్తుంది. దీంతో ప్రత్యామ్నాయ పద్దతులలో అగ్రిమెంట్లను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలను తప్పించగా మరికొన్నింటికి కూడా తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి సర్కార్ గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాలను లెక్కచేయడం లేదు.. ఆ సంస్థలకు విద్యుత్ బిల్లులను కూడా చెల్లించడం లేదు. కానీ కొత్తగా కొనుగోళ్లుకు మాత్రం ఆరాటపడుతుంది. కేంద్రం ఎంత వారించినా జగన్ పీపీఏల విషయంలో వెనక్కు తగ్గకపోగా రూటు మార్చి ముందుకెళ్లడంతో కేంద్రం కూడా కొత్త పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. కేంద్రం సౌర, పవన విద్యుత్‌ కొనుగోళ్లలో లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానాన్ని పెట్టాలని నిర్ణయించింది. అలా ఇస్తేనే విద్యుత్ ఎక్సేంజీలో విద్యుత్ కొనుగోలుకు అవకాశం ఉంటుందని ప్రకటించింది.

ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు విద్యుత్ కంపెనీలకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలని లేదంటే ఎక్సేంజ్‌లో కొనుగోళ్లు చేయకుండా నిషేధం విధిస్తామని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. దీంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. ముందుగా వివిధ కంపెనీలకు చెల్లించాల్సిన పెండింగ్ మొత్తాలను లెక్కలేసుకున్న ప్రభుత్వం అత్యవసరంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకొని పరిస్థితులపై చర్చించారు. చెల్లింపులు చేయాలంటే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నిధుల్లేవు కనుక వివిధ శాఖల నుండి విద్యుత్ శాఖకు రావాల్సిన బకాయిలను లెక్కించి చెల్లింపులు చేయాలని కోరారు.

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వం శాఖల నుండి విద్యుత్ శాఖకు సుమారు ఆరువేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లుగా ప్రభుత్వం దగ్గర లెక్క ఉంది. కానీ అన్ని శాఖలు ఉంది ప్రభుత్వంలోనే కనుక ఏ శాఖ దగ్గర కూడా విద్యుత్ శాఖకు బకాయిలు చెల్లించే స్థోమత లేదు. దీంతో చేసేది లేక కేంద్రంపై కొట్లాటకు సిద్దమైనట్లుగా కనిపిస్తుంది. ముందుగా లెటర్ అఫ్ క్రెడిట్ ఇవ్వకపోతే కొనుగోళ్ల రద్దుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఇప్పుడు ఎల్ఓసిలు సాధ్యం కాదని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ప్రస్తుతం ముందుగా కొనుగోళ్లను నిలిపివేయకుండా మూడు వారాల స్టే విధించింది.

మూడు వారాల తర్వాత అయినా ప్రభుత్వం మొత్తం బకాయిలను కట్టాల్సివస్తుంది. అయితే ప్రభుత్వం దగ్గర అంత నిధుల్లేవు. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రం వ్యతిరేకించి కోర్టుకు వెళ్లడం ఢిల్లీకి పెద్దలకు సహజంగానే కాకపుట్టించే అవకాశాలున్నాయి. ఇప్పటికే పవర్ వార్ లో ఏపీ సర్కార్ నిర్ణయాల మీద కత్తి కట్టిన కేంద్రం తాజా తగవుతో మరింత కఠినంగా మారే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర నిర్ణయం ప్రకారం ఎల్ఓసీలు కట్టకపోతే కొనుగోళ్లు నిలిపివేస్తే రాష్ట్రం అంధకారంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఏపీ సర్కార్ పవర్ వార్ లో కేంద్రంతో కొట్లాట ఎలాంటి ఫలితాలిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

 

 

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   an hour ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   an hour ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   an hour ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   2 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   2 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   2 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   21 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   a day ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   a day ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   24-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle