newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

కెసిఆర్ పొగడ్తలపై బాబు ‘చెక్‌మేట్’

21-01-201921-01-2019 13:07:53 IST
2019-01-21T07:37:53.287Z21-01-2019 2019-01-21T07:37:49.111Z - - 17-07-2019

కెసిఆర్ పొగడ్తలపై బాబు ‘చెక్‌మేట్’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ అసెంబ్లీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై సిఎం కెసిఆర్ చేసిన ప్రశంసలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో ఆయన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న కెసిఆర్ ఇప్పుడు సడెన్‌గా పొగడడం మీద ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. చంద్రబాబును దెబ్బతీసేందుకు కెసిఆర్ వైఎస్ ప్రస్తావన తీసుకొస్తూ పొగిడారని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు రిటనర్న్ గిఫ్ట్‌లో భాగంగా ఇది మొదటి అస్త్రం అయ్యుంటుందని... ఏపీలో వైఎస్ జగన్‌తో చేతులు కలిపి చక్రం తిప్పడానికే వైఎస్ పేరు వాడుకుంటున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.

సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు... వైఎస్‌కు వ్యతిరేకంగా కెసిఆర్ చేసిన వ్యవహారాల్ని గుర్తు చేసుకున్నారు. గతంలో టిడిపి ఆనాటి సిఎం వైఎస్ అవినీతిపై విడుదల చేసిన ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకం మీద రెండో సంతకం కెసిఆర్‌దేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడదే కెసిఆర్ వైఎస్‌ను పొగడడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయంతో మోదీ డైరెక్షన్‌లోనే కెసిఆర్ నటిస్తున్నారని మరోసారి తేలిందని బాబు ఆరోపించారు. బీసీల్లో అపోహలు తేవాలని వైకాపా, తెరాస కుట్రలు చేస్తున్నాయని బాబు ధ్వజమెత్తారు. తెదేపాకు బీసీలను దూరం చేయాలనే కుతంత్రాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వారి కుట్రలు ఏమాత్రం ఫలించవని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు... కోల్‌కతాలో జరిగిన విపక్షాల సభ దేశ ప్రజలకు ఒక భరోసానిచ్చిందన్నారు చంద్రబాబు! అమరావతిలో దానికి ధీటైన సభ నిర్వహిస్తామని, ఆ సభకు 22 పార్టీల నేతలు హాజరు కానున్నారని తెలిపారు. అటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పర్యటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రానికి ఏం మేలు చేశారని కేంద్రమంత్రి వచ్చాని ప్రశ్నించారు. బీజేపీ ఏపీకి ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ నిధులు కేటాయించిందని ఎద్దేవా చేశారు.

కాగా... తెలంగాణ అసెంబ్లీలో కెసిఆర్ మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య శ్రీ’ పథకం గొప్పదంటూ కితాబిచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కంటే ‘ఆరోగ్య శ్రీ’ ఎన్నో రెట్లు మెరుగైందని... గత నాలుగున్నరేళ్లుగా ఈ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle