newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

కెసిఆర్ దోస్తీకి జగన్ 'నీళ్లు'వదిలేసినట్టేనా?

22-10-201922-10-2019 07:45:28 IST
Updated On 22-10-2019 17:07:28 ISTUpdated On 22-10-20192019-10-22T02:15:28.651Z22-10-2019 2019-10-22T02:14:38.015Z - 2019-10-22T11:37:28.457Z - 22-10-2019

కెసిఆర్ దోస్తీకి జగన్ 'నీళ్లు'వదిలేసినట్టేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొన్నటి ఎన్నికలకు ముందే సరికొత్త సమీకరణాల దిశగా ఏపీనుండి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ నుండి కెసిఆర్ తెరాస పార్టీ తెరవెనుక కలిసి కట్టుగా పనిచేశాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయా పార్టీలకు ఒకే రాష్ట్రంలో సత్తా ఉండడంతో ఆ ఎన్నికలలో వీళ్ళ దోస్తీకి అడ్డే లేకుండా ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకున్నారు.

అప్పటికే తెలంగాణలో కెసిఆర్ అధికారంలో ఉంటే ఆ ఎన్నికలలో ఏపీలో కూడా వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక ఆలింగనాలూ.. స్వీట్లు పంచుకోవడాలు.. ఒకరి రాష్ట్రానికి మరొకరెళితే ఘన స్వాగతాలు అబ్బో ఒక్కటేమిటీ బంధానికి అవధుల్లేవ్.

ఇక అదే ఊపులో జగన్ హైదరాబాద్ లో ఉన్న భవనాలను తెలంగాణకి అప్పగించేస్తే కెసిఆర్ మరో అడుగు ముందుకేసి రెండు రాష్ట్రాలు భాగస్వామ్యంగా ఓ భారీ ప్రాజెక్ట్ చేపడదామంటూ అఫర్ చేశారు. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి వరదను కృష్ణాబేసిన్‌కు మళ్లించి బీడు భూములను సశ్యశ్యామలం చేస్తామంటూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంకల్పించారు.

గోదావరి జలాలను కుదిరితే నేరుగా శ్రీశైలంలోకి లేదా నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి మళ్లించి ఆకుపచ్చ తెలుగు రాష్ట్రాలుగా మారుస్తారని ఆ రెండు పార్టీలు ఘంటాపథంగా చెప్పుకొచ్చారు.

ఆ ప్రాజెక్ట్ కోసం రెండు రాష్ట్రాల ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు కూడా పలు విడతలుగా చర్చలు జరిపి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కేంద్రం వద్దకు వెళ్లి తమ ఉమ్మడి ప్రాజెక్ట్ ఆశలను కూడా వివరించారు.

కేంద్రం నుండి సమాధానంగా ఏమొచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు కెసిఆర్ తో ఉమ్మడి ఆశలకు జగన్ నీళ్లు వదిలేసినట్లుగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం సీఎం ఉమ్మడి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయమైన ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినట్లుగా కనిపించడం.

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం పోలవరం నీటిని రాయలసీమకు తరలించేందుకుగాను గోదావరి-కృష్ణా- పెన్నా అనుసంధాన ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. అందుకు ఓ ప్రణాళికను కూడా సిద్ధం చేసి చంద్రబాబు సర్కార్ పల్నాడులో శంకుస్థాపన కూడా చేసింది. అయితే కొత్త ప్రభుత్వం ఆ పనులన్నింటినీ రద్దు చేసేసింది.

దానికి బదులు శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు తరలించేందుకు తెలంగాణతో కలిసి ప్రాజెక్ట్ కట్టే ఆలోచన చేసింది. దీంతో అంతా ఇక అనుసంధానం ఉండదనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు తెరపైకి తెచ్చిన ఆలోచనతోనే ముందుకెళ్లేందుకు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది.

గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకు చెందిన అంచనాలను మరోసారి రూపొందించాలని సీఎం ఆదేశించారు. గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించి అక్కడ నుంచి శ్రీశైలం కుడి కాలువ ద్వారా బానకచర్ల వరకు తీసుకెళ్లేందుకు ఎంత ఖర్చవుతుందో తేల్చాలని జలవనరుల శాఖను ఆదేశించారు.

సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్‌కు అప్పగించాలని నిర్దేశించగా.. నివేదిక వచ్చాక కార్యాచరణకు దిగాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు చెందిన గత ప్రభుత్వం చేసిన శంఖుస్థాపనను పక్కనబెట్టి డిసెంబర్ 26వ తేదీన మరోసారి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారట.

తెలంగాణతో ఉమ్మడి ప్రాజెక్ట్ అంటూనే ప్రత్యామ్నాయమైన ప్రాజెక్టుకు శంకుస్థాపనకు వెళ్లడం ఆసక్తికరంగా మారగా ఈ ప్రత్యామ్నాయ ప్రాజెక్టు గురించి జగన్ సొంత పత్రిక సాక్షినే ప్రచురించడం విశేషం. అయితే వైసీపీకి కొందరు నేతలు మాత్రం కృష్ణా-గోదావరి-పెన్నా అనుసంధానంతో పాటు ఉమ్మడి ప్రాజెక్టు కూడా ఉంటుందని చెప్పుకొస్తున్నారు.

మరి వాళ్ళకి వీటిపై అవగాహన లేక చెప్తున్నారో ఇప్పటికిప్పుడు బండరాయి లాంటి వార్త తెలంగాణ మిత్రుడికి ఎందుకని ఊరడిస్తున్నారో కానీ రెండు రకాల అనుసంధానం ఎలా చేస్తారు? ఎందుకోసం చేస్తారన్నది చెప్పే ఆ నేతలకే తెలియాల్సి ఉంది. కానీ పరిస్థితిని చూస్తే జగన్ తో పంపకాలకు 'నీళ్లు' వదిలేసినట్లేనని చెప్పకతప్పదు!


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle