కృష్ణా వరదలతో నిరాశ్రయులైన 50 విజయవాడ కుటుంబాలు..
01-10-201901-10-2019 14:47:31 IST
2019-10-01T09:17:31.558Z01-10-2019 2019-10-01T09:17:28.057Z - - 06-12-2019

కృష్ణానది వరదలు జనజీవితంపై వేసిన ప్రభావనుంచి ఇప్పటికీ చాలా కుటుంబాలు కోలుకోలేదు. వరదలు ముంచెత్తి నెలరోజులు పైబడుతున్నా జనం వరద ముంపుకు గురైన తమ ఇళ్లలోకి వెళ్లడానికి సాహసించలేకపోతున్నారు. ఎందుకంటే వరద తాకిడికి పై కప్పులు ఎగిరిపోయాయి. ఇక నేల చూస్తే మురికినీటితో బురదమయమై ఉంది. ఇలా ఇళ్లకు దూరమైన కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటోంది. ప్రభుత్వం ఇలాంటి వారి సమస్యలను తక్షణం పట్టించుకోకపోతే వారి జీవితాలు తల్లకిందులు కావడం తథ్యం అనిపిస్తుంది. ఆగస్టు 14న కృష్ణా నదికి వరద వచ్చినప్పటినుంచి కొన్ని డజన్ల కుటుంబాలు నిరాశ్రయులైపోయాయి. వీరిని రాణిగారి తోటలోని తాడికొండ సుబ్బారావు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ సమీపంలో వాటర్ టాంక్ కింద బహిరంగ స్థలంలో షెల్టర్ క్యాంపులో ఉంచారు. అంజనమ్మ కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుందా. ఆమె తన ముగ్గుర కుమార్తెలతో కలిసి ఆగస్టు మధ్యలో షెల్టర్ క్యాంపుకు వెళ్లింది. తారకరామనగర్‌లో ఆమె అద్దెకుంటున్న ఇల్లు వరదపాలైంది. గత శుక్రవారం ఆమె నివాసమున్న ప్రాంతంలో మళ్లీ వరద హెచ్చరికను విజయవాడ మునిసిపాలిటీ కార్పొరేషన్ జారీ చేయడంతో ఏం చేయాలో ఆమెకు పాలుపోవడం లేదు. కానీ అంజనమ్మతో పాటు దాదాపు 60 కుటుంబాలకు ఈ వరద హెచ్చరికతో ఒరిగేదేమీ లేకుండాపోయింది. ఎందుకంటే ఆగస్ట్ 15నాటి తొలి వరద ముందు తరవాత వారు తమ ఇళ్లకు నేటికీ తిరిగిరాలేకున్నారు. వరదల కారణంగా అంతంతమాత్రంగా ఉన్న మా ఇంటి పైకప్పు కూలిపోయింది. మా దుస్తులను, వంటపాత్రలను తెచ్చుకుందామని అక్కడికి వెళ్లాం కానీ వరద నీరు పూర్తిగా వెనక్కు పోతే కానీ మేం ఇంట్లోకి అడుగుపెట్టలేం అని అంజమ్మ వాపోయింది. తుఫాను షెల్టర్‌కు తరలిపోయాక తమ ఇళ్లలోకి కనీసం మూడుసార్లయినా వరద నీరు వచ్చిందని క్యాంపులో ఉన్నవారు చెబుతున్నారు. ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. నేల బురదతో నిండింది. మురికినీటితో గబ్బు కొడుతోంది. మా ఇళ్లలో పాములు దూరాయి. నీరుతొలిగిపోయి ఇంటి పరిసరాలు పొడిగా మారితే మా ఇళ్లకు వెళదామని చూస్తున్నాం కానీ అప్పటినుంచి ప్రకాశం బ్యారేజ్ నీటిని వదులుతూనే ఉన్నారు లేకుంటే వర్షాలు కురుస్తానే ఉన్నాయని కుమార్ అనే వ్యక్తి వాపోయారు. ఈయన తన భార్య, ఇద్దరు పిల్లలతో క్యాంపులో ఉంటున్నారు. ఆగస్టులో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ తమకు ఆహారం, సరకులును అందచేసింది కానీ ఆ తర్వాత తమను ఎవరూ పట్టించు కోవడం లేదని క్యాంపులోని నిరాశ్రయులు చెబుతున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న వారు వేరే చోటకు వెళ్లాలంటే అద్దెలు చుక్కలంటుతున్నాయి. ఇక రాణిగారి తోట ప్రాంతంలో ఇళ్లు వెతుక్కోవడం కోసం ప్రయత్నించినా వారికి సాధ్యం కావడం లేదు. కొంతమంది వార్డ్ వలంటీర్లు వీరి వివరాలను సేకరించి పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న గృహ కల్పనలో భాగం చేయాలనుకున్నారు. అయితే ప్రభుత్వ గృహాలు ఉగాది రోజునే అందుబాటులోకి రానున్నాయి. అంటే ఇంకా ఆరునెలల సమయం ఉంది. మేము అర్హులమా కాదా అనేది వారు ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి వాటిపై మాకు నమ్మకం కూడా లేదు అని దుర్గ అనే మహిళ చెప్పారు. కొంతమంది వరదల్లో తమ రేషన్, ఆధార్ కార్డులు పోగొట్టుకున్నారు. కాబట్టి ప్రభుత్వ గృహాలకు దరఖాస్తు చేసుకునే అర్హత కూడా కోల్పోయారు. విజయవాడ అదనపు కార్యదర్సి శకుంతల మాట్లాడుతూ వీరిలో కొందరికి రేషన్ కార్డులు విజయవాడ పరిధిలో లేవు కాబట్టి వీరు ప్రభుత్వ గృహాలకు అర్హులు కాకపోవచ్చని తెలిపారు. వరదలకు నిరాశ్రయులైన వారు ప్రకాశం జిల్లా, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు కావడంతో వీరికి స్థిరమైన ఇళ్లు లేవు. నది గట్టుపైన ఇళ్లలో మాత్రమే వీరు ఉంటున్నారు. అక్కడ ఇతరులెవరూ నివసించరు. వీళ్లకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే చూడగలం అని శకుంతల చెప్పారు. ఈలోగా నిరాశ్రయ కుటుంబాలు తమ షెల్టరులో కొనసాగడం తప్ప వేరు దారి లేదు. దోమల కాటు ద్వారా తమ పిల్లలకు జబ్బులు వస్తాయని కుటుంబాలు భీతిల్లుతున్నాయి. దోమ నిరోధక మందులు నిత్యం చల్లుతున్నారు కానీ బహిరంగ స్థలం కాబట్టి దోమలు వెంటాడుతూనే ఉన్నాయి. పిల్లలకు కొంతమంది దోమ తెరలు తీసుకొచ్చారు కానీ రాత్రి పూట వాన కురిస్తే గోడలు, పై కప్పు లేదు కాబట్టి నిద్రపోవడం కూడా గగనమౌతోంది. వాన ఎప్పుడు తగ్గిపోతుందా అని మాత్రమే వేచి చూస్తున్నాం అని కుమార్ అనే వ్యక్తి చెప్పాడు. వరదనీరు పూర్తిగా వెనక్కు వెళ్లినప్పటికీ తమ ఇళ్ల పైకప్పులు మళ్లీ నిర్మించుకోవాలంటే కనీసం 50 వేల రూపాయలు ఖర్చవుతుందని ఇప్పటికే ఆదాయవనరులు హరించుకుపోయిన నేపథ్యంలో అంత ఖర్చు పెట్టడానికి కూడా తమకు అసాధ్యమని వీరు వాపోతున్నారు. గత శుక్రవారం మళ్లీ వరద హెచ్చరిక ప్రకటించడంతో ఇళ్లు కోల్పోయి షెల్టర్లలో ఉంటున్నవారు హతాశులయ్యారు. 2009 తర్వాత విజయవాడ నగరంలో ఇంత పెద్ద వరదలు ఎన్నడూ రాకపోవడంతో వరద నిరోధక గోడల నిర్మాణంపై ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ద తీసుకోలేదు. కొన్నిప్రాంతాల్లో మాత్రమే గోడలు కట్టి వదిలేయడంతో ప్రయోజనం శూన్యంగా మారిందని చెబుతున్నారు. ఒకటి మాత్రం నిజం మాజీ ముఖ్యమంత్రి కరకట్టమీద ఉన్న ఇల్లు విషయంలో జాతీయ స్థాయి ప్రచార మోత మోగించిన ప్రతిపక్ష టీడీపీ కానీ, కరకట్ట మీది నివాసాలు కూల్చివేయాల్సిందేననంటున్న అధికార పార్టీ కానీ నిజంగా ఇళ్లుకోల్పోయిన వారి బాధలు గుర్తించలేరా అనేది ప్రశ్నం. శవరాజకీయాలు తప్ప ప్రజారాజకీయాలను పట్టించుకోరా అని జనం ఘోష పెడుతున్నారు.

దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్... తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
35 minutes ago

రాజా సింగ్‌కు స్వంత పార్టీలోనే శత్రువులా..?
9 hours ago

బాబు బోర్లాపడితే జగన్ గోతిలో పడుతున్నారా?
10 hours ago

సీఎం జగన్ ను అభాసుపాలు చేస్తున్న ఢిల్లీ ప్రతినిధులు
10 hours ago

పోలీసులు సకాలంలో స్పందిస్తే జరిగేది ఇదే...!
10 hours ago

పోలీసులపై పూల వర్షం. దేశమంతా హర్షధ్వానాలు..
11 hours ago

బీజేపీలోకి మరో సీనియర్ హాస్య నటుడు..?
11 hours ago

సజ్జనర్ సీన్ రిపీట్ చేశారు..?!
13 hours ago

వారి కంటే ముందే కలుస్తారా..?
13 hours ago

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!
05-12-2019
ఇంకా