newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

‘కూల్చివేత’ నోటీసులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి

01-07-201901-07-2019 08:13:35 IST
Updated On 01-07-2019 11:46:28 ISTUpdated On 01-07-20192019-07-01T02:43:35.716Z01-07-2019 2019-07-01T02:37:20.541Z - 2019-07-01T06:16:28.523Z - 01-07-2019

‘కూల్చివేత’ నోటీసులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అమరావతిలో ప్రజావేదికను కూల్చేసిన అధికారులు, పక్కనే ఉన్న లింగమనేని రమేష్ కి చెందిన చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే ఈ అక్రమ కట్టడాల వ్యవహారం జిల్లాలకు కూడా పాకింది. వివిధ జిల్లాల్లో ఉన్న అక్రమ కట్టడాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో విశాఖలో నిర్మించిన టీడీపీ కార్యాలయానికి కూడా జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

విశాఖలో ఈ భవనానికి టీడీపీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మించింది. వివాదాస్పద దసపల్లా భూముల్లో మూడువేల చదరపు గజాల్లో ఈ కార్యాలయం నిర్మించారు.

తొలుత రెండువేల చదరపు గజాలను మాత్రమే ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నప్పటికీ అధికారం అడ్డుపెట్టుకుని మరో వెయ్యి చదరపు గజాల భూమిని పక్కనే ఉన్న కొండను తొలచి ఆక్రమించారు.

ఈ భూమి తమదంటే తమదంటూ రాణి కమలాదేవికి, ప్రభుత్వానికి మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. అధికారంలో ఉండడంతో టీడీపీ నేతలు ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో అసలు సంగతి బయటపడుతోంది. 

టీడీపీ ఈ భూమిని అధికార బలంతో ప్రభుత్వం నుంచి తీసుకుని భవనం కట్టేసింది. స్థలానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లను చూపించాలని లేని పక్షంలో భవనాన్ని కూల్చివేస్తామని జీవీఎంసీ అధికారులు ప్రకటించారు.

రాణి కమలాదేవి పేరుతో ఉన్న లింక్ డాక్యుమెంట్లు వారంలోగా ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. లేదంటే కూల్చివేత తప్పదని నోటీసుల్లో స్పష్టం చేశారు. టీడీపీ నేతలు ఈ వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఇలాంటి భవనాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు ఆరాతీస్తున్నారు. జగన్ ఆదేశాలు, అధికారుల చర్యలతో టీడీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle