newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

కులాల లెక్కలు పక్కా..అదీ జ‌గ‌న్ లెక్క..!

08-06-201908-06-2019 09:19:31 IST
Updated On 24-06-2019 14:35:18 ISTUpdated On 24-06-20192019-06-08T03:49:31.253Z08-06-2019 2019-06-08T03:37:56.783Z - 2019-06-24T09:05:18.762Z - 24-06-2019

కులాల లెక్కలు పక్కా..అదీ జ‌గ‌న్ లెక్క..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాబినెట్ కూర్పు ఎవ‌రి ఊహ‌ల‌కూ అంద‌కుండా చేశారు. క్యాబినెట్ కూర్పులో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్ని సామాజ‌క‌వ‌ర్గాల‌ను ఎలా సంతృప్తి ప‌రుస్తారో అనే అనుమానాలు ఉండేవి. అయితే, జ‌గ‌న్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా క్యాబినెట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి 25 మందిలో క్యాబినెట్ ఏర్పాటు చేస్తున్న ఆయ‌న సామాజ‌క‌వ‌ర్గ లెక్క‌ల‌ను జాగ్ర‌త్త‌గా బేరీజు వేసుకొని మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటుచేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కులాల లెక్క‌లు కీల‌కంగా ఉంటాయి. జ‌గ‌న్ ఈ లెక్క‌ల‌ను బాగా టాలీ చేశారు. గ‌తంలో ఏ క్యాబినెట్ లో లేని విధంగా సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల‌కు పెద్ద‌పీట వేశారు. ఏకంగా ఐదుగురిని ఉప‌ముఖ్య‌మంత్రులుగా నియ‌మించాల‌ని అనుకోవ‌డం ద్వారా జ‌గ‌న్ స‌రికొత్త సంచ‌ల‌నానికి తెర‌తీశారు.

ఉప ముఖ్య‌మంత్రులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు సామాజ‌క‌వ‌ర్గం నుంచి ఒక్కొక్క‌రిని ఉప ముఖ్య‌మంత్రులుగా చేయ‌నున్నారు.

ఇక‌, మంత్రి ప‌ద‌వుల్లో 50 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల‌కు ఇచ్చి ఆయ‌న కొత్త ఒర‌వ‌డి సృష్టించారు. బీసీల‌కు ఏకంగా 8 మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. స్పీక‌ర్ ప‌ద‌విని సైతం బీసీ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నేత త‌మ్మినేని సీతారాంకు క‌ట్ట‌బెట్టారు.

దీంతో బీసీల‌ను ఆయ‌న ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఎప్పుడూ లేని విధంగా బీసీలైన‌ కుర‌బ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన శంక‌ర‌నారాయ‌ణ‌, బోయ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన గుమ్మ‌నూరు జ‌య‌రాంకు సైతం ఈసారి మంత్రివ‌ర్గంలో జ‌గ‌న్ ప్రాతినిథ్యం క‌ల్పించారు. 

ఇక‌, ఎస్సీల‌కు గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా జ‌గ‌న్ ఏకంగా ఐదు మంత్రి ప‌ద‌వులు కేటాయించారు. కేవ‌లం 25 మంది ఉన్న క్యాబినెట్ లో ఐదుగురు ఎస్సీల‌ను తీసుకోవ‌డం సాధార‌ణ విష‌యం కాదు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రం ఉన్న‌ప్పుడు సైతం ఐదుగురు ఎస్సీల‌ను క్యాబినెట్‌లోకి తీసుకున్న సంద‌ర్భాలు త‌క్కువ‌.  ఐదుగురిలో ఒక‌రికి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని సైతం జ‌గ‌న్ ఇవ్వ‌నున్నారు.

ఈసారి వైసీపీ వైపు నిలిచార‌నే అంచ‌నాలు ఉన్న కాపు సామాజ‌క‌వ‌ర్గానికి సైతం జ‌గ‌న్ పెద్ద పీట వేసి న‌లుగురిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు. వీరిలో ఒక‌రికి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి సైతం ఇవ్వ‌నున్నారు. ఇక‌, ముందునుంచీ ఎస్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ఉంటున్నారు. ఎస్టీ రిజ‌ర్వుడ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు ఎన్నిక‌ల్లోనూ వైసీపీ మెజారిటీ సీట్లు సాధించింది. దీంతో ఈ వ‌ర్గం నుంచి పుష్ప శ్రీవాణిని ఉప ముఖ్య‌మంత్రిని చేయ‌నున్నారు.

మైనారిటీలు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ కు అండగా ఉంటున్నారు. దీంతో మైనారిటీల నుంచి జ‌గ‌న్ అంజ‌ద్ బాషాకు అవ‌కాశం ఇస్తున్నారు. ఆయ‌న‌ను ఉప‌ముఖ్య‌మంత్రిని చేయ‌నున్నారు. ముస్లింలు అధికంగా ఉండే రాయ‌ల‌సీమ నుంచి ముస్లింను ఉప ముఖ్య‌మంత్రిని చేయ‌డం రానున్న రోజుల్లో రాజ‌కీయం.గా వైసీపీకి బాగా క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మొత్తంగా, ఈసారి జ‌గ‌న్ అన్ని సామాజ‌క‌వ‌ర్గాల‌కూ ప్రాధాన్య‌త ఇచ్చి క్యాబినెట్ కూర్పును గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని విధంగా చేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అభినందిస్తున్నారు.

 

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   33 minutes ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   2 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   2 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   3 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   3 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   3 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   3 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   a day ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   24-05-2020


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   24-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle