newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

కులాల కుంప‌టి రాజేస్తున్నారు..!

08-12-201908-12-2019 19:46:06 IST
Updated On 11-12-2019 11:02:36 ISTUpdated On 11-12-20192019-12-08T14:16:06.278Z08-12-2019 2019-12-08T14:16:02.181Z - 2019-12-11T05:32:36.293Z - 11-12-2019

కులాల కుంప‌టి రాజేస్తున్నారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కులాల ప్ర‌భావం చాలా ఎక్కువ‌. గెలుపోట‌ములు కులాల ఆధారంగా లెక్క‌లేసుకోవ‌డం ఇక్క‌డ స‌హ‌జ‌మే. రెడ్లు వైసీపీకి, క‌మ్మ‌లు టీడీపీ వైపు ఎక్కువ‌గా ఉంటార‌నేది అంచ‌నా. కాపులు, బీసీలు ఎవ‌రి వైపు మొగ్గుతారో వారే ఎన్నిక‌ల్లో గెలుస్తార‌నే లెక్క‌లు ఉన్నాయి. 2014 ఎన్నిక‌ల్లో కాపులు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లేశార‌ని, 2019లో వైసీపీకి ఎక్కువ‌గా ఓట్లేశార‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి.

2009లో కాపు సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించిన‌ప్పుడు మెజారిటీ కాపులు ఆ పార్టీ వైపు నిలిచారు. కానీ, ఆయ‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మాత్రం కాపులు పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. ఫ‌లితంగా కాపుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌త్తా చాటింది.

ఇదంతా ప‌క్క‌న పెడితే ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాపు వ‌ర్సెస్ రెడ్డి అనే భావ‌న ప్ర‌జ‌ల్లో వ‌చ్చేలా తెగ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌లో జ‌రిగిన ప‌రిణామాల త‌ర్వాత ఈ ప్ర‌య‌త్నం పెరిగింది. ఇది మ‌రీ శృతి మించి రెండు కులాల మ‌ధ్య కుంప‌టి రాజేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు చేయాలంటే కులాల లెక్క‌ల‌ను ప‌క్కాగా వేసుకోవాల‌నేది పార్టీల భావ‌న‌. ఇక్క‌డ‌ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌న్నీ సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌లే. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి కాపు స‌హా వివిధ సామాజ‌క‌వ‌ర్గాల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. ఇది ఇలానే కొన‌సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన పార్టీకి భంగ‌పాటు త‌ప్ప‌దు.

చంద్ర‌బాబు నాయుడు ఒక్క క‌మ్మ సామాజ‌క‌వ‌ర్గానికే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని ముద్ర వేయ‌డంలో స‌క్సెస్ అయిన వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీని దెబ్బ కొట్టింది.

ఇప్పుడు ఇదే స్ట్రాట‌జీతో టీడీపీ, జ‌న‌సేన ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే, జ‌గ‌న్‌పై రెడ్డి ముద్ర వేసేందుకు జ‌గ‌న్‌ను జ‌గ‌న్ రెడ్డి అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంబోధిస్తున్నారు. జ‌గ‌న్ కొంద‌రికే ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నందునే తాను ఇలా పిలుస్తున్నాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.

ఇక‌, ఈ విష‌యంలో టీడీపీ కొంచెం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నా.. జ‌గ‌న్ రెడ్ల‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌నే ప్ర‌చారం చేస్తోంది. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం శృతి మించాయి.

రాజ‌కీయాల కోసం కులాల మ‌ధ్య చిచ్చు పెడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించారు. ఈ స‌మ‌యంలో రాప్తాడుకు చెందిన జ‌న‌సేన నేత సాకె ప‌వ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యే ప్ర‌కాశ్ రెడ్డే కాదు ఏ రెడ్డిదైనా త‌ల న‌రికేందుకు సిద్ధ‌మ‌ని హెచ్చ‌రించారు.

ఇది సంచ‌ల‌నం సృష్టించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఈ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్ట‌లేదు. ఈ వ్యాఖ్య‌ల‌కు వైసీపీ రియాక్ట్ అయితే ఎవ‌రికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ, ఏదో రెడ్డి సంఘం ఒక‌టి మాట్లాడి తాము త‌ల‌లు న‌రికేందుకు సిద్ధ‌మే అని ప్ర‌క‌టించింది. వైసీపీ - జ‌న‌సేన మ‌ధ్య ఉన్న ఈ మొత్తం వివాదాన్ని రెడ్డి వ‌ర్సెస్ కాపు కులాల మ‌ధ్య జ‌రుగుతున్న‌ట్లు చిత్రీక‌రించేందుకు ఓ మీడియా సంస్థ‌ బాగా క‌ష్ట‌ప‌డుతోంది.

రెండు కులాల‌కు చెందిన వారితో రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు ఇప్పిస్తోంది. వాస్త‌వానికి, రెడ్డి, కాపు సామాజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉంటారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రెండు సామాజ‌క‌వ‌ర్గాల మ‌ధ్య ఎటువంటి వివాదాలూ లేవు. కానీ, ఎవ‌రో ఓ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత మాట్లాడిన మాట‌ల‌ను ప‌ట్టుకొని కులాల మ‌ధ్య చిచ్చుగా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుండ‌టం కొంద‌రికి తాత్కాలిక రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఇస్తాయేమో కానీ దీర్ఘ‌కాలికంగా ప్ర‌జ‌ల మ‌ధ్య దూరం పెరిగే ప్ర‌మాదం ఉంది.

ఇది తెలిసి కూడా మీడియా బాధ్య‌త మ‌రిచి స‌ద‌రు మీడియా సంస్థ రెండు కులాల మ‌ధ్య వార్ జ‌రుగుతున్న‌ట్లు పెద్ద ఎత్తున వార్త‌లు వేస్తోంది. వాస్త‌వానికి సాకె ప‌వ‌న్ అంత పెద్ద స్థాయి నేత కూడా కాదు. ఇక కుల సంఘాల విష‌యానికి వ‌స్తే ఒక్కో కులానికి 10 నుంచి 100కు పైగా సంఘాలు ఉన్నాయి. కానీ, ఓ చిన్న నేత‌, ఒక్క కుల సంఘం మాట‌ల ఆధారంగా రెండు కులాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డం మాత్రం స‌రైన‌ది కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle