newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

కుమారుడి భ‌విష్య‌త్ కోసం జేసీ ఆరాటం..!

04-06-201904-06-2019 08:03:31 IST
Updated On 24-06-2019 17:00:11 ISTUpdated On 24-06-20192019-06-04T02:33:31.304Z04-06-2019 2019-06-04T02:32:40.528Z - 2019-06-24T11:30:11.955Z - 24-06-2019

కుమారుడి భ‌విష్య‌త్ కోసం జేసీ ఆరాటం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో జేసీ దివాక‌ర్ రెడ్డిది ప్ర‌త్యేక శైలి. ఆయ‌న నోరు విప్పితే ప్ర‌త్య‌ర్థి పార్టీతో పాటు స్వంత పార్టీ వారు కూడా ఆయ‌న ఏం మాట్లాడ‌తారోన‌ని భయ‌ప‌డుతుంటారు. ఉన్న‌ది ఉన్న‌ట్లు.. కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డంలో ఆయ‌న దిట్ట‌. ఎన్నిక‌ల ముందు ఆయ‌న వ్యాఖ్య‌లు స్వంత పార్టీనే ఇరుకున పెట్టాయి. ఎన్నిక‌ల త‌ర్వాత తన కొడుకు కోసం రూ.50 కోట్లు ఖ‌ర్చు చేశాన‌ని ఓపెన్ గా చెప్పారాయ‌న‌.

ఇప్పుడు ఆయ‌న ఏకంగా రాజ‌కీయాల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే వార‌సుడిని తెర‌పైకి తీసుకువ‌చ్చి త‌న స్థానం నుంచి పోటీ చేయించిన జేసీ దివాక‌ర్ రెడ్డి ఇక రాజ‌కీయాల్లో ఉండ‌న‌ని తేల్చిచెప్పేశారు. అయితే, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒక‌సారి ఎంపీగా గెలిచిన ఆయన రాజ‌కీయాల నుంచి మాత్రం సంతృప్తితో వైదొల‌గ‌డం లేదు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల ఫ‌లితాలే ఇందుకు కార‌ణం. ఆయ‌న త‌న కుమారుడి ఓట‌మిని అంత‌గా జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌న తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొని త‌న కుమారుడిని వైఎస్సార్ కాంగ్రెస్ లోకి పంపించేందుకు రూట్ క్లీయ‌ర్ చేస్తున్న‌ట్లు ఆయ‌న మాట‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

గ‌తంలో తాను వైఎస్ జ‌గ‌న్ ను విమ‌ర్శించినా అవి రాజ‌కీయ విమ‌ర్శ‌లేన‌ని, ప‌రిస్థితుల ప్ర‌భావంతో విమ‌ర్శ‌లు చేశాన‌ని ఆయ‌న చెబుతున్నారు. జ‌గ‌న్ త‌మ‌వాడేన‌ని, ఆయ‌న ముఖ్య‌మంత్రి అవ‌డం సంతోష‌క‌ర‌మేన‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. త‌న కుమారుడు ఏ పార్టీలోకి వెళ్లేది అత‌డి ఇష్టానికే వ‌దిలేస్తున్న‌ట్లు చెప్పారు.

జేసీ వ్యాఖ్య‌ల అంత‌రార్థం త‌న కుమారుడు జేసీ ప‌వ‌న్ రెడ్డిని వైసీపీలోకి పంపించ‌డ‌మే అంటున్నారు.ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, జేసీ ప‌వ‌న్ రెడ్డి చిన్న‌ప్ప‌టి నుంచి మిత్రులు. టీడీపీలో చేరాక జ‌గ‌న్ కుటుంబంపై జేసీ బ్ర‌ద‌ర్స్ తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంతో వీరి మ‌ధ్య దూరం పెరిగింది. ఇప్పుడు టీడీపీ దారుణంగా ఓట‌మి పాల‌వ‌డం, జ‌గ‌న్ తో న‌డిస్తే భ‌విష్య‌త్ బాగా ఉంటుంది జేసీ ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదే నిజ‌మైతే జేసీ దివాక‌ర్ రెడ్డి ఎలాగూ రిటైర్ అయ్యారు కాబ‌ట్టి, జేసీ ప‌వ‌న్ రెడ్డి స్వ‌యంగా ఒక నిర్ణ‌యం తీసుకుని వైసీపీలో చేరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే, జేసీ కుటుంబం టీడీపీలో చేరినందున వైసీపీ చాలా శ్ర‌మించి వారికి ప్ర‌త్యామ్నాయంగా నాయ‌క‌త్వాన్ని త‌యారుచేసుకుంది. ఈ ప‌రిస్థితిలో జేసీ ప‌వ‌న్ ను వైసీపీలోకి చేర్చుకుంటారా వేచి చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle