newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

కుప్పంలో జగన్‌కు అంత అభిమానమా....?

07-04-201907-04-2019 08:41:56 IST
Updated On 08-07-2019 14:27:33 ISTUpdated On 08-07-20192019-04-07T03:11:56.424Z07-04-2019 2019-04-07T03:10:03.122Z - 2019-07-08T08:57:33.051Z - 08-07-2019

కుప్పంలో జగన్‌కు అంత అభిమానమా....?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పులివెందులలో చంద్రబాబు నాయుడి ప్రసంగాలు వినడానికీ, కుప్పంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఎలా సాగుతుందో చూడటానికీ జనంలో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. జనం ఎక్కువ మంది వచ్చినా ఏదో ఆయన ఏం మాట్లాడుతారో చూడ్డానికి వచ్చారులే అనుకోవచ్చు.

కానీ.. ప్రసంగం మొదలు పెట్టినప్పట్నుంచి చివరిలో అందరికీ దండాలు పెట్టేదాకా సీఎం జగన్... సీఎం జగన్ అనే నినాదాలు కుప్పంలో వినిపించడం దేనికి సంకేతం..? మొన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి టెలీకాన్ఫరెన్స్ ఆడియో టేపులు బయటికొచ్చి ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. వాటిలో కుప్పంలో పరిస్థితులు గతంలోలాగా లేవనీ, చాలా వర్గాలు దూరమయ్యాయనీ కార్యకర్తలు భువనేశ్వరి దృష్టికి తెచ్చారు. 

గతంలో ఎప్పుడూ లేనిది ఈ సారి కుప్పంపై భువనేశ్వరి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కూడా ఆమె సంభాషణల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జగన్ కుప్పంలో ప్రచారానికి వస్తున్నారు అన్నప్పట్నుంచే చిత్తూరు జిల్లా జగన్ ఫీవర్‌తో ఊగిపోయింది. అంతా ఊహించినట్లుగానే చంద్రబాబును జగన్ తిట్టిపోసినా.. ఆధారాలతో మాట్లాడటం జనాన్ని ప్రభావితం చేసే అంశం. 30 ఏళ్లకుపైగా కుప్పం ప్రజలు చంద్రబాబును గెలిపిస్తున్నా.. డిగ్రీకాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఆయన తీసుకురాలేకపోయారనీ తన తండ్రి హయాంలోనే ఆ కాలేజీలను కుప్పానికి కేటాయించారని జగన్ చెప్పారు. 

ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక్క మెడికల్ కాలేజీగానీ, రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వ కోల్డ్ స్టోరేజీగానీ లేకపోవడం ఏంటని కుప్పం నడిబొడ్డున నిలబడి జగన్ ప్రశ్ని‌స్తే వింటున్న వాళ్లకు అవునా ఇప్పటిదాకా కుప్పంలో ఇవి కూడా లేవా అనిపించక మానదు. పాలననూ, వివిధ ప్రాజెక్టులనే కాదు.. చంద్రబాబు వ్యక్తిత్వం మీద మాటల దాడి చేశారు  జగన్.

సొంత అక్కచెల్లెళ్లకూ, తమ్ముడికీ ఆస్తుల పంపకం విషయంలో అన్నఅన్యాయం చేశారంటూ జూబ్లిహిల్స్‌లోని ఆస్తి లెక్కలను చెప్పారు. చంద్రబాబు కుప్పానికి ఏమీ చెయ్యలేదు అనడానికి అక్కడ పెరిగిపోయిన వలసలే కారణం అన్నారు. అందుకే ఈ సారి చంద్రబాబును కాకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థి చంద్రమౌళిని గెలిపించండీ.. మంత్రిని చేసి కుప్పానికి అప్పగిస్తానంటూ మరో ఆఫర్ కూడా ఇచ్చారు. జగన్ సభలకు మిగతా ప్రాంతాల్లో వచ్చిన జనసందోహమే కుప్పంలోనూ కనిపించింది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle