newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

కుప్పంపై బాబు టెన్షన్..!

04-04-201904-04-2019 09:14:44 IST
2019-04-04T03:44:44.424Z04-04-2019 2019-04-04T03:43:32.900Z - - 26-06-2019

కుప్పంపై బాబు టెన్షన్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబుకు కుప్పం ప్రజలే ఇచ్చేందుకు తయ్యారయ్యారని వార్తలు వస్తూనే వున్నాయి. ఇప్పుడు అదే నిజమయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. స్వయానా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పరిస్థితి బాగాలేదని ఒప్పుకున్న ఆడియో టేపులు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని వింటే నారావారి ఫ్యామిలీకి కుప్పం భయం పట్టుకుందని అర్థమౌతుంది. రాష్ట్రవ్యాప్తంగా గెలిచినా గెలవకపోయినా.. కుప్పంలో ఓడిపోతే మాత్రం చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితానికి అదో చెరగని ముద్రగా చేదు అనుభవంలా మిగిలిపోతుంది. 

గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ సారి కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తోందని స్థానికంగా నిర్వహించిన సర్వేల్లో కూడా తేలిందట. నిజానికి అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్ద బలవంతుడేమీ కాదు. ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు కంచుకోటను బద్ధలు కొట్టాలని పెద్దగా వ్యూహరచనలేమీ చేసినట్లు కనిపించదు. కానీ రాష్ట్రమంతటా వైసీపీకి అనుకూల వాతావరణం ఉందని రిపోర్టులు రావడంతో  టీడీపీ శిబిరంలో  టెన్షన్ పట్టుకుంది. దీంతో తెలుగు తమ్ముళ్ళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

హెరిటేజ్ వ్యాపారాల గురించి తప్ప ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇటీవల వంద మంది కుప్పం కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆమె ఈ సారి మనం ఎంత చేసినా ఎక్కడో అనుమానం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు కుప్పంలో మారిన పరిస్థితులకు అద్దం పట్టేవే. కుప్పం నాయకులు కూడా కొన్ని తప్పులు జరిగినట్లు మేడం ముందు స్వయంగా అంగీకరించారట. ఇదంతా చూస్తోంటే ఈ సారి అక్కడ టీడీపీ పరిస్థితి కష్టంగా ఉందన్న చర్చలు జరుగుతున్నాయి.

కుప్పం టీడీపీ నేతలతో భువనేశ్వరి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌ ఆడియో టేపులు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కుప్పం అభివృద్ధిపై ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు చంద్రబాబు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అందులోనూ.. నిరుద్యోగ యువత కూడా కుప్పంలో ఎక్కువే. కుప్పం నుంచీ రోజు ఓ రైలు నిండా వలస కార్మికులు పనుల కోసం చెన్నై, బెంగళూరు వెళ్తారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారన్న భావన రాష్ట్రవ్యాప్తంగా పెరిగినట్టే కుప్పం ప్రజల్లోనూ పెరిగింది. ఏది ఎలా వున్నా బాబుకి మెజారిటీ మాత్రం తగ్గుతుందన్న భావన వ్యక్తం అవుతోంది. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle