newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

కుదిరితే చీల్చాలి.. లేదా ర‌ద్దు చేయాలి..!

21-01-202021-01-2020 17:08:52 IST
Updated On 22-01-2020 11:42:25 ISTUpdated On 22-01-20202020-01-21T11:38:52.953Z21-01-2020 2020-01-21T11:38:51.538Z - 2020-01-22T06:12:25.355Z - 22-01-2020

కుదిరితే చీల్చాలి.. లేదా ర‌ద్దు చేయాలి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూడు రాజధానుల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం దూకుడుకు శాస‌న‌మండ‌లిలో బ్రేకులు వేసింది తెలుగుదేశం పార్టీ. మండ‌లిలో త‌మ‌కున్న మెజారిటీతో రూల్‌ 71ను ఉప‌యోగించుకొని అస‌లు రాజ‌ధానుల వికేంద్రీక‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌కుండా చేసి ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చింది. క‌నీసం బిల్లు మండ‌లిలో వీగిపోతే రెండుసారి మ‌ళ్లీ పంపించే అవ‌కాశం ప్ర‌భుత్వానికి ఉంటుంది. అప్పుడు కూడా వీగిపోతే నిబంధ‌న‌ల ప్ర‌కారం బిల్లు ఆమోదం పొందిన‌ట్లే లెక్క‌.

ప్ర‌భుత్వం కూడా ఇదే భావించింది. కానీ, టీడీపీ ఊహించ‌ని విధంగా త‌మ‌కున్న రూల్‌ 71ను ఉప‌యోగించుకొని అస‌లు ఈ బిల్లునే మండ‌లిలో చ‌ర్చ జ‌ర‌గ‌కుండా చూసింది. ఇది ప్ర‌భుత్వానికి షాకిచ్చింది.

ఇప్పుడే కాదు గ‌తంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి అసెంబ్లీలో ఆమోదించి మండ‌లికి పంపించిన బిల్లుల‌ను టీడీపీ తిప్పి పంపించింది. ఈ సారి ఏకంగా అస‌లు బిల్లుపై చ‌ర్చ‌నే జ‌ర‌గ‌కుండా చూసింది. దీంతో శాస‌న‌మండ‌లి ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మారుతోంది.

దీంతో మండ‌లిపై వైఎస్ జ‌గ‌న్ ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావిస్తున్నారు. ఇవాళ రాత్రి ఆయ‌న అత్య‌వ‌స‌ర క్యాబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌బోతున్నారు. మంత్రులు అంద‌రూ అందుబాటులో ఉండాల‌నే ఆదేశాలు వెళ్లాయి.

రేపు అసెంబ్లీలో శాస‌న‌మండ‌లి ర‌ద్దు తీర్మానం ప్రవేశ‌పెట్టే అవ‌కాశం ఉంటుంది. అయితే, మండ‌లి ర‌ద్దు అనేది ఒక పెద్ద ప్ర‌క్రియ‌. శాస‌న‌స‌భ‌లో తీర్మానం చేసిన త‌ర్వాత పార్ల‌మెంటుకు పంపించాల్సి ఉంటుంది. అక్క‌డ ఉభ‌య స‌భ‌లు ఆమోదం తెలిపితే గానీ మండ‌లి ర‌ద్దు కాదు. క‌నీసం సంవ‌త్స‌రం అయినా ప‌ట్టే అవ‌కాశం ఉంటుంది. పైగా కేంద్రం స‌హ‌కారం లేనిదే మండ‌లి ర‌ద్దు కుద‌ర‌ని ప‌ని.

అయినా కూడా శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేయాల‌నే ప్ర‌భుత్వ ఆలోచ‌న వెనుక వేరే వ్యూహం ఉంద‌ని తెలుస్తోంది. మండ‌లిని ర‌ద్దు చేస్తే 29 మంది టీడీపీ ఎమ్మెల్సీలు మాజీలు అవుతారు.

అందుకే ర‌ద్దు అనే హెచ్చ‌రిక ద్వారా కొంద‌రిని టీడీపీ నుంచి చీల్చాల‌నే వ్యూహంతో వైసీపీ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి టీడీపీ కూడా ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తోంది. శాస‌న‌మండ‌లిని ప్ర‌భుత్వం ఎట్టి ప‌రిస్థితుల్లో ర‌ద్దు చేయ‌ద‌ని టీడీపీ ధీమాగా చెబుతోంది. త‌మ ఎమ్మెల్సీలు జారిపోకుండా వారిలో భ‌రోసా నింప‌డానికే టీడీపీ ఈ ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంది.

శాస‌న‌మండ‌లి ర‌ద్దు చేయాంటే క‌నీసం సంవ‌త్స‌రం స‌మ‌యం ప‌డుతుంద‌ని, పార్ల‌మెంటు ఆమోదం కావాల‌ని, కాబ‌ట్టి వైసీపీ మండ‌లిని ర‌ద్దు చేయ‌ద‌ని టీడీపీ ధీమాగా ఉంది. అంతేకాదు, గ‌తంలో ఎన్టీఆర్ ర‌ద్దు చేసిన శాస‌న‌మండ‌లిని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తిరిగి ప్రారంభించారు. ఇప్పుడు త‌న తండ్రి ప్రారంభించిన మండ‌లిని జ‌గ‌న్ ర‌ద్దు చేయ‌ర‌ని టీడీపీ భావిస్తోంది. పైగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వ‌లేని చాలా మంది నేత‌ల‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్ల‌లో క్ర‌మంగా శాస‌న‌మండ‌లిలో వైసీపీ బ‌లం పెరుగుతుంది.

అయితే, ప్ర‌తీ బిల్లుకు శాస‌న‌మండ‌లిని ఉప‌యోగించుకుంటూ టీడీపీ అడ్డుప‌డుతుండ‌టం ప‌ట్ల జ‌గ‌న్ మాత్రం సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీలైనంత వ‌ర‌కు కొంద‌రు టీడీపీ ఎమ్మెల్సీల‌ను చీల్చి ప్ర‌త్యేక గ్రూపుగా మార్చాల‌ని, ఇది కుద‌ర‌క‌పోతే మాత్రం శాన‌స‌మండ‌లి ర‌ద్దు దిశ‌గానే జ‌గ‌న్ ముందుకు వెళ్ల‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఒక‌వేళ అదే జ‌రిగితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో శాస‌న‌మండ‌లి మ‌రోసారి చ‌రిత్ర‌గా మారిపోనుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle