newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

కుటుంబానికి 20 వేలు.. ఓట్లకు నోట్ల పథకమిది!

05-04-201905-04-2019 08:57:52 IST
2019-04-05T03:27:52.944Z05-04-2019 2019-04-05T03:27:38.021Z - - 22-07-2019

కుటుంబానికి 20 వేలు.. ఓట్లకు నోట్ల పథకమిది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును ఆంధ్రప్రదేశ్‌లో  నాలుగు ఓట్లున్న కుటుంబానికి ఈ సారి గిట్టుబాటయ్యే మొత్తం అక్షరాలా 20 వేల రూపాయలు. ఇప్పటికే చేరాల్సిన చోట్లకు డబ్బుల కట్టలు చేరిపోయాయని సమాచారం. ఒక్కో ఓటుకు రూ. 5 వేల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు నేరుగా పార్టీల కార్యకర్తలే చెప్తున్నారు. ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా లేదు. పంపకాల విషయంలో ఇద్దరూ పోటాపోటీగా డబ్బును పంచిపెడుతున్నట్లు తెలుస్తోంది. 

బాగా సన్నిహితులు కార్యకర్తలుగా అస్సలు అనుమానం రాని కొత్త వ్యక్తులను రంగంలోకి దించి డబ్బును ఒకచోట నుంచి మరో చోటుకి తరలిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, కాలేజీ విద్యార్థులను ఈ డబ్బు తరలింపు దందాలో వాడుకుంటున్నారు. కొత్త వ్యక్తులు బ్యాగులో, సూట్ కేసులో తీసుకెళ్తోంటే తనిఖీల్లో పట్టేస్తున్నారు.

అందుకే మహిళల లోదుస్తుల్లో, కాలేజీ విద్యార్థుల బ్యాగుల్లో డబ్బుల కట్టలు యథేచ్చగా చేరిపోయాయట. ఇప్పటికీ అనుమానం రాని  ఈ తరహా పద్ధతుల్నే వాడుతున్నారు నాయకులు. గ్రామాల్లో పార్టీల బలాబలాలు, ఉన్న ఓట్లను లెక్కించి కుటుంబానికి ఇంతా అని లెక్కగట్టి ముట్టజెప్పేస్తున్నారట. 

అధికార పార్టీ అయితే పెన్షన్ ఇచ్చే వారినీ, జన్మభూమి కార్యకర్తలనూ ఉపయోగించి డబ్బులను పంపిణీ చేయిస్తోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మనుషులు ఓటుకు ఐదు వేల చొప్పున పంచుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ నాయకులు కూడా గత ఎన్నికల్లో డబ్బు పంచని స్థానాల్లోనే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు గుర్తించి ఈ సారి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని భారీగా ఏర్పాట్లు చేసుకున్నారట.

అంటే.. టీడీపీ వైఎస్సార్సీపీ పోటాపోటీగా ప్రకటించిన డబ్బుల పంపిణీ పథకాల కంటే ఈ ఎన్నికల్లో ఓట్లు పంచిపెట్టే పథకం విలువే ఎక్కువ. ‘ఇంత పంచుతున్న నేతలు ఏ పథకం ప్రకటిస్తే మాత్రం ఏంటి..? పంచినంత డబ్బు తిరిగి సంపాదించాలంటే అంతకు అంత దోపిడీ చేయకుండా ఎలా ఉంటారు?’అని ప్రజలకూ అర్థమైపోయింది. అందుకే నాలుగు ఓట్లుంటే 20 వేలొస్తుందనీ, ఆరు ఓట్లుంటే 30 వేలొస్తుందని లెక్కలేసుకుంటున్నారట. అంతే మరి యథా నాయక తథా ప్రజ!


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle