newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

కీల‌క ప‌ద‌వికి ఇద్ద‌రు మాజీ మంత్రుల పోటీ

30-05-202030-05-2020 08:19:18 IST
Updated On 30-05-2020 11:10:12 ISTUpdated On 30-05-20202020-05-30T02:49:18.412Z30-05-2020 2020-05-30T02:49:13.108Z - 2020-05-30T05:40:12.220Z - 30-05-2020

కీల‌క ప‌ద‌వికి ఇద్ద‌రు మాజీ మంత్రుల పోటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించారు. ఆ పార్టీకి జాతీయ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాఖ‌కు క‌ళా వెంక‌ట్రావు, తెలంగాణ‌కు ఎల్‌.ర‌మ‌ణ అధ్య‌క్షులుగా ఉన్నారు.

అయితే, తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్ మొత్తం ముడిప‌డి ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల‌నే ఆలోచ‌న‌తో ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఉన్నారు. ఇందులో భాగంగానే ఏపీ టీడీపీకి కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పెద్ద ఎత్తున పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

2015 అక్టోబ‌రులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ టీడీపీ అధ్య‌క్షుడిగా కిమిడి క‌ళా వెంక‌ట్రావు నియ‌మితుల‌య్యారు. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఆయ‌న గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా కూడా ప‌ని చేశారు. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన నేత‌కు, బీసీ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌కు ఈ ప‌ద‌వి ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన చంద్ర‌బాబు ఏరికోరి క‌ళా వెంక‌ట్రావుకు అధ్య‌క్ష ప‌గ్గాలు అప్ప‌గించారు.

అయితే, పార్టీ జాతీయ అధ్య‌క్షుడైన చంద్ర‌బాబు నాయుడు పూర్తి దృష్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పైనే పెడ‌తారు. దీంతో క‌ళా వెంక‌ట్రావు ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడి హోదాలో ప‌ని చేసిన సంద‌ర్భాలు త‌క్కువే. నిజానికి ఆయ‌న మిగ‌తా నేత‌ల మాదిరిగా మీడియా ముందుకు కూడా ఎక్కువ‌గా రారు. అధికారంలో ఉన్న‌ప్పుడు, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌త్య‌ర్థి అయిన జ‌గ‌న్‌కు ప‌లు బ‌హిరంగ లేఖ‌లు మాత్రం రాసేవారు.

నిజానికి క‌ళా వెంక‌ట్రావును పెద్ద‌గా ఉప‌యోగించుకోక‌పోయినా ఇప్పుడు కొత్తగా ఆయ‌న స్థానంలో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిని నియ‌మించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. వెంక‌ట్రావుకు ఈ ప‌ద‌వి ఇచ్చి ఐదేళ్లు అవ్వ‌డం, కొత్త వారికి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా పార్టీలో ప్ర‌క్షాళ‌న జ‌రిపిన‌ట్లు అవుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. అయితే, ఎవ‌రు కొత్త అధ్య‌క్షుడు అనే అంశంపై రెండు పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. ఉత్త‌రాంధ్ర‌కే, బీసీ నేత‌కే ఈ ప‌ద‌వి ద‌క్క‌డం కూడా ఖాయ‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందుకు కూడా చాలా బ‌ల‌మైన కార‌ణాలే ఉన్న‌ట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉత్త‌రాంధ్ర‌లో ఆ పార్టీకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చినా, ప్ర‌తిప‌క్షంలో కూర్చున్నా ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు మాత్రం టీడీపీకి చెప్పుకోద‌గిన స్థాయిలో సీట్లు ఇస్తున్నారు. పార్టీకి అధ్య‌క్షుడిగా ఉన్న చంద్ర‌బాబు ఎలాగూ రాయ‌ల‌సీమ‌కు చెందిన వ్య‌క్తి. కాబ‌ట్టి, ఉత్త‌రాంధ్ర‌ను ఓన్ చేసుకునేలా ఆ ప్రాంతానికి చెందిన వ్య‌క్తిని ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక‌, బీసీలు తెలుగుదేశం పార్టీకి అనాదిగా అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. బీసీల పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది.

అయితే, ఉత్త‌రాంధ్ర‌లో, బీసీల్లో టీడీపీకి ప‌ట్టు స‌డ‌లుతోంది. ఈ విష‌యాన్ని గ‌త ఎన్నిక‌లు నిరూపించాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర‌లో కేవ‌లం ఆరు స్థానాల‌ను మాత్ర‌మే టీడీపీ గెలుచుకోగ‌లిగింది. విజ‌య‌న‌గ‌రం జిల్లా ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయింది.

విశాఖ‌ప‌ట్నం న‌గ‌రం మిన‌హా రూర‌ల్‌లో ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. ఇదే స‌మ‌యంలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉండే బీసీలు కూడా గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపార‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఉత్త‌రాంధ్ర‌లో, బీసీల‌లో ప‌ట్టు సంపాదించేందుకు మొద‌టి అడుగుగా మ‌రోసారి ఏపీ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌విని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బీసీ నేత‌‌కు ఇవ్వ‌డం ఇంచుమించు ఖాయ‌మే.

ఈ రెండు అర్హ‌త‌లు ఉన్న మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు ఇప్పుడు ఈ ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్నారు. అయ్య‌న్న‌పాత్రుడు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒక‌సారి ఎంపీగా గెలిచారు. ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేశారు. ఉత్త‌రాంధ్ర‌లో గుర్తింపు ఉన్న నేత‌. ఇవ‌న్నీ ఆయ‌న‌కు ప్ల‌స్‌లు కాగా ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్యేగా లేక‌పోవ‌డం మైన‌స్ కావ‌చ్చు.

ఇక‌, అచ్చెన్నాయుడు గత ప్ర‌భుత్వంలో మంత్రిగా పని చేశారు. వారిది టీడీపీకి నిబ‌ద్ధ‌త క‌లిగిన కుటుంబం. అసెంబ్లీలో, బ‌య‌ట ప్ర‌భుత్వంపై దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తారు. వారి కుటుంబానికి ఉత్త‌రాంధ్ర‌లో మంచి ప‌లుకుబ‌డి ఉంది. అయితే, ఇప్ప‌టికే ఆయ‌న ఎమ్మెల్యేగా, ఆయ‌న సోద‌రుడి కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు ఎంపీ, కుమార్తె ఆదిరెడ్డి భ‌వాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక ఇంట్లో ఇప్ప‌టికే ముగ్గురు ప‌ద‌వుల్లో ఉన్నారు. ఈ పాయింట్ ఆయ‌న‌కు మైన‌స్ కావ‌చ్చు. మొత్తంగా వీరిద్ద‌రిలో ఒక‌రికి మాత్రం ఏపీ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఖాయంగా చెబుతున్నారు.

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

   13 hours ago


దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

   13 hours ago


ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

   13 hours ago


ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

   14 hours ago


ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

   15 hours ago


దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

   15 hours ago


శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

   16 hours ago


రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

   17 hours ago


అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

   17 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

   17 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle