newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

కిషన్ రెడ్డి సెన్సేషన్.. ఏపీ పోలీసులపై కామెంట్స్

18-09-201918-09-2019 09:45:59 IST
2019-09-18T04:15:59.277Z18-09-2019 2019-09-18T04:15:53.405Z - - 19-02-2020

కిషన్ రెడ్డి సెన్సేషన్.. ఏపీ పోలీసులపై కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఈమధ్యకాలంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అమిత్ షా నమ్మకంతో తనకు అప్పగించిన పనులను సమర్థంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ ఆయన పార్టీ పటిష్టానికి పనిచేస్తున్నారు. తాజాగా మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ చర్చకు దారితీస్తున్నవేళ కిషన్ రెడ్డి తాజాగా ఏపీ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరు పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు తమకు సమాచారముందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. ఈ దర్యాప్తుపై నివేదికను హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 

కోడెలతో తనకు ఉన్న అనుబంధాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఏ ప్రభుత్వమైనా అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదన్నారు. పోలీసుల తీరును హోం శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటుందన్నారు. మరోవైపు కోడెల కూతురు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు కీలకంగా మారాయి.  రాజకీయ కక్ష సాధింపు చర్యల కారణంగానే తన తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధించేందుకు తన తండ్రిని వేధించిందని.. ఆయనపైన, తమ కుటుంబసభ్యులపైన తప్పుడు కేసులు బనాయించి మానసిక క్షోభకు గురి చేసిందని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle