newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

కిరణ్‌ కుమార్‌ రెడ్డికే.. ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు?

22-11-201922-11-2019 12:53:24 IST
2019-11-22T07:23:24.693Z22-11-2019 2019-11-22T07:23:13.830Z - - 06-12-2019

కిరణ్‌ కుమార్‌ రెడ్డికే.. ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి మళ్లీ రాజకీయాల్లో బిజీకాబోతున్నారా.. ఏపీలో దాదాపు కనుమరుగయ్యే స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో జవసత్తాలు నింపేందుకు సిద్ధమవుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్‌ రెడ్డి ఎంపిక దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎంపిక కోసం కొంతకాలంగా కేంద్ర పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. దీంతో పలువురి పేర్లు తెరపైకి వచ్చినా.. కిరణ్‌కుమార్‌ రెడ్డే పార్టీకి పూర్వవైభవం తీసుకురాగలడనే స్పష్టతకు సోనియాగాంధీ వచ్చినట్లు తెలుస్తోంది.

కిరణ్‌కుమార్‌ రెడ్డికి స్పీకర్‌గా, సీఎంగా చేసిన అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో కాంగ్రెస్‌ పార్టీలో కిరణ్‌ కీలక పాత్ర పోషించారు. వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పీకర్‌గా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహించారు. ఒకానొక దశలో అటు వైఎస్‌కు, అటు కేంద్ర పార్టీ అధిష్టానానికి నమ్మకమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు.

వైఎస్‌ఆర్‌ మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీలో చీలిక ఏర్పడకుండా కిరణ్‌ కీలక పాత్ర పోషించినట్లు ప్రచారంలో ఉంది. ఆ తరువాత రోశయ్య కొద్దికాలం సీఎంగా చేసినా.. తాను తప్పుకోవటంతో కిరణ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానం సీఎంగా బాధ్యతలు అప్పగించింది. దీంతో ఒకవైపు వై.ఎస్‌. జగన్‌ పార్టీవైపు క్యాడర్‌ వెళ్లకుండా, మరోవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమాన్ని అణివేసే ప్రయత్నంలో కిరణ్‌ కీలక పాత్ర పోషించారు. దీనికితోడు తెలంగాణ వద్దు.. సమైక్యాంధ్ర ముద్దు అంటూ స్పష్టమైన నినాదంతో సమర్థవంతంగా పాలన సాగించారు.

కొంత కాలానికి తెలంగాణ ఉద్యమం ఉధృతరూపం దాల్చడంతో కేంద్రంసైతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో కిరణ్‌ కేంద్ర అధిష్టానం వద్ద తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా తెలంగాణలో రోజురోజుకు ఆందోళనలు ఉధృతంకావటం, పాలన స్థంభించడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావటంతో కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న కిరణ్‌కుమార్‌ రెడ్డి 2014 ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టి పోటీ చేశారు. ప్రజలు అంతగా ఆదరించక పోవటంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకే వచ్చినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ ఎక్కడా పోటీ చేయలేదు. జనసేన, టీడీపీలోకి వెళ్తారని ప్రచారం సాగినప్పటికీ.. కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధప్రదేశ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఆ పార్టీ దక్కించుకోలేదు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షునిగా సీనియర్‌ నేతల పేర్లను పార్టీ పరిశీలించింది. అయితే చివరకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికే ఈ పదవిని కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేరును అధ్యక్ష పదవికి సూచిస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ ఊమెన్‌ చాందీ రిపోర్ట్‌ పంపినట్లు తెలుస్తోంది.

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడి రేసులో కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, చింతా మోహన్‌ తో పాటు శైలజానాథ్‌ పేరు ప్రముఖంగా వినిపించినా చిదరకు కిరణ్‌ కుమార్‌ రెడ్డికే పగ్గాలు అందించాలని కాంగ్రెస్‌

నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేసిన సోనియా గాంధీ, ఢిల్లీకి రావల్సిందిగా ఆయనను కోరినట్లు సమాచారం. మొన్నటివరకు పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగిన రఘువీరారెడ్డి తప్పుకుని ప్రస్తుతం ఇంచార్జ్‌ పీసీసీగా ఆయన కొనసాగుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రచారం సాగుతున్నట్లు కిరణ్‌కుమార్‌ రెడ్డికే రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అందుతాయా.. చివరి నిమిషంలో ఎవరిపేరైనా తెరపైకి వస్తుందా.. అనేది వేచి చూడాల్సిందే.  

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle