newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

కియా.. ఎవ‌రి ఖాతాలోకి..?

17-07-201917-07-2019 08:09:13 IST
Updated On 17-07-2019 13:06:43 ISTUpdated On 17-07-20192019-07-17T02:39:13.493Z17-07-2019 2019-07-17T02:39:00.462Z - 2019-07-17T07:36:43.496Z - 17-07-2019

కియా.. ఎవ‌రి ఖాతాలోకి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్రదేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి చ‌దివి వినిపించిన ఓ ఉత్త‌రం ఇప్పుడు అసెంబ్లీలో, బ‌య‌ట చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ఉత్త‌రంపైనే ఇప్పుడు అధికార‌, విప‌క్షాలు మాట‌ల యుద్ధానికి దిగుతున్నాయి. సోష‌ల్ మీడియాలోనూ రెండు పార్టీల శ్రేణుల మ‌ధ్య ఈ ఉత్త‌రంపైనే వాదోప‌వాదాలు జ‌రుగుతున్నాయి.

గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల వ‌ల్ల ఎన్ని పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని, ప‌ర్య‌ట‌న‌ల‌కు ఎంత ఖ‌ర్చు అయ్యింద‌ని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఓ ప్ర‌శ్న అడిగారు. ఈ ప్ర‌శ్న‌కు గానూ మంత్రి గౌత‌మ్ రెడ్డి స‌మాధాన‌మిస్తూ చంద్ర‌బాబు ఐదేళ్ల‌లో విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు రూ.38 కోట్లు ఖ‌ర్చ‌య్యింద‌ని, 16 సంస్థ‌ల‌తో ఇప్పందాలు జ‌రిగినా పెట్టుబ‌డులు రాలేద‌ని స‌భ‌లో జ‌వాబు ఇచ్చారు.

దీంతో త‌మ ప‌ర్య‌ట‌న‌ల‌పై, తాము తెచ్చిన పెట్టుబ‌డుల‌పై వైసీపీ స‌భ‌లో కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం ప్రారంభించింద‌ని ఆరోపించిన చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌ల వ‌ల్ల కియా ప‌రిశ్ర‌మ వ‌చ్చింద‌ని చెప్పారు.

స‌రిగ్గా, చంద్ర‌బాబు నోటి నుంచి కియా అనే మాట ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఓ లేఖ చ‌దివి వినిపించారు. కియా సీఈఓ, ప్ర‌సిడెంట్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు నెల రోజుల క్రితం రాసిన ఉత్త‌రం అది.

20017లో తాను హ్యుంద‌య్ ఇండియా హెడ్‌గా ఉన్న స‌మ‌యంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌ను క‌లిశాన‌ని, అప్పుడే ఆయ‌న త‌మ‌ను ఏపీలో సంస్థ‌ను స్థాపించాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు చెప్పారు. ఆ రోజే ఆయ‌న‌కు మాటిచ్చామ‌ని, అందుకే ఇండియాలో మొద‌టి ప్లాంట్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థాపించామ‌ని ఈ లేఖ సారాంశం. దీంతో చంద్ర‌బాబు వ‌ల్లేమీ కియా రాలేద‌ని, వైఎస్ కోరిక వ‌ల్లే కియా స్థాపించార‌ని వైసీపీ వారు చెప్పుకుంటున్నారు.

దీన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేక‌పోతోంది. కియా సంస్థ కోసం చంద్ర‌బాబు నాయుడు ఎంతో ప్ర‌య‌త్నించార‌ని, గుజ‌రాత్ వెళ్లే సంస్థ‌ను తమ నేతే ఎంతో శ్ర‌మించి అనంత‌పురంలో స్థాపించేలా చేశార‌ని చెబుతున్నారు.

గ‌త ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో పెట్టుబ‌డుల విష‌యంలో మొద‌ట‌గా టీడీపీ క్లయిమ్ చేసుకునేదే కియా సంస్థ‌ను. ఇప్పుడు ఆ సంస్థ ఏర్పాటు క్రెడిట్‌ను దూరం చేసేలా వైసీపీ ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో టీడీపీ తిప్పికొడుతోంది.

చంద్ర‌బాబు, నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు స‌హా టీడీపీ నేత‌లు కియా త‌మ ఘ‌న‌తే అని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను లేవ‌నెత్తుతున్నారు. న‌రేంద్ర మోడీ వ‌ల్లే కియా వ‌చ్చింద‌ని అప్పుడు జ‌గ‌న్ చెప్పారు. ఇదే అంశాన్ని లేవ‌నెత్తుతూ ఇప్పుడు మోడీ వ‌ల్ల కియా వ‌చ్చింద‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్పుడు వైఎస్ వ‌ల్ల ఎలా వ‌చ్చింద‌ని చెబుతార‌ని టీడీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

గ‌తంలో విజ‌యసాయిరెడ్డి కియా సంస్థ రావ‌డం వ‌ల్ల లాభం లేద‌ని, చైనాలో ఆ సంస్థ ప్లాంట్ మూసేశార‌ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను ఇప్పుడు టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. 

అయితే, పెట్టుబ‌డులు పెట్టిన వారు, సంస్థ‌లు స్థాపించిన వారు ఆయా రాష్ట్రాల్లో లేదా దేశాల్లో ప్ర‌భుత్వాలు మారిన‌ప్పుడు గ‌త ప్ర‌భుత్వాల‌తో ఎంత మంచి సంబంధాలు ఉన్నా కొత్త ప్ర‌భుత్వాన్ని సైతం మ‌చ్చిక చేసుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణమనే వాద‌న‌లు ఉన్నాయి. వైఎస్ గ‌తంలో కియా సీఈఓను విజ్ఞప్తి చేసినా ఇప్పుడు సంస్థ స్థాపించ‌డంలో చంద్ర‌బాబు కృషి లేద‌ని చెప్ప‌లేమ‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. మొత్తంగా ఒక్క ఉత్త‌రం రెండు రోజుల నుంచి అసెంబ్లీలో, బ‌య‌ట ర‌చ్చ‌కు కార‌ణ‌మైంది.

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

   11 hours ago


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

   11 hours ago


సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

   12 hours ago


శభాష్ నవనీత్ కౌర్..  లోక్ సభలో మాటల తూటాలు

శభాష్ నవనీత్ కౌర్.. లోక్ సభలో మాటల తూటాలు

   12 hours ago


జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

   14 hours ago


జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

   15 hours ago


ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

   15 hours ago


ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

   15 hours ago


ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

   16 hours ago


ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

   19 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle