newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

కిట్లు కొనుగోలుపై అవసరమైతే శ్వేత పత్రం

22-04-202022-04-2020 11:22:21 IST
Updated On 22-04-2020 11:46:07 ISTUpdated On 22-04-20202020-04-22T05:52:21.656Z22-04-2020 2020-04-22T05:51:25.057Z - 2020-04-22T06:16:07.834Z - 22-04-2020

కిట్లు కొనుగోలుపై అవసరమైతే శ్వేత పత్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ర్యాపిడ్ కిట్లపై టిడిపి బిజెపి రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి ఆళ్ళానాని. కన్నా లక్ష్మి నారాయణ బాధ్యత రాహిత్యం గా అవగాహన లేకుడా మాట్లాడుతున్నారని, ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకి తోడు కన్నా లక్ష్మి నారాయణ చేరారని, నిజంగా కన్నా కు చిత్తశుద్ది ఉంటే.... చంద్రబాబు ప్రధానికి సలహాలు ఇస్తున్నాను అంటే కన్నా ఎందుకు మాట్లాడలేదన్నారు. 

ర్యాపిడ్ కిట్స్ వ్యవహారంలో కన్నా మాట్లాడుతున్నారని, కేంద్రం మాకంటే అధిక ధరలకు కొన్నారు అని కన్నా గుర్తు పెట్టుకోవాలన్నారు. అక్కడ అవినీతి జరిగింది అని మేము అనలేదు... 795 రూపాయలకు 5లక్షల కిట్లు కొన్నారు. మరి కేంద్రం మాకంటే 65 రూపాయల అధిక ధరకు కొనుగోలు చేసిన అంశం పై కన్నా ఏమంటారన్నారు. చంద్రబాబు అసత్య ప్రచారాలను ప్రజలు కూడా తిప్పి కొట్టాలని, చంద్రబాబు లా తాము అవినీతి పాలన చేయటంలేదన్నారు. 

మే 3 వరకు లాక్ డౌన్ లో ప్రజలు భాగస్వాములు కావాలని, కర్ణాటక సైతం 795 రూపాయలకు ఈ కిట్లు కొనుగోలు చేసిందన్నారు ఆళ్ళ నాని. మొన్నటి వరకు పిపిఈ లేవు, N95 మాస్కులు లేవని రాద్దాంతం చేశారని, అనంతరం క్వారంటైన్ లో సదుపాయాలు లేవు అని బురద జల్లారని, తర్వాత డాక్టర్ లు లేరు అని చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. ఈ అంశాలపై మేము చిత్తశుద్ది తో ఉన్నాం అని తెలిసి ఇప్పుడు కిట్లు విషయంలో రాజకీయం చేస్తున్నారన్నారు. 

ప్రజలకు నిజం తెలియాలి అని ఇప్పుడు మేము మాట్లాడుతున్నామని, ఏ రాష్ట్రం కూడా మేము చేసుకున్నట్టు కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోలేదని, ఐసీఎంఆర్ కంటే తక్కువ ధరకు మేము కొనుగోలు చేశామని, ఒకవేళ మరేవరికన్నా తక్కువ ధరకు విక్రయిస్తే... మేము అదే ధర ఇస్తాం అని కంపెనీకి చెప్పామన్నారు. 335 రూపాయలకు ఛత్తీస్ గఢ్ తీసుకుంటే మనం కూడా అదే ధర చెల్లిస్తాం.

మరో రెండు లక్షల కిట్లు కు ఆర్డర్ ఇచ్చామని, ఏ రాష్ట్రం కూడా లక్ష కిట్లు ఒకే సారి తెప్పించలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టెస్టుల కెపాసిటీ పెంచుతున్నామని, 12500 మందికి టెస్టులు చేస్తామన్నారు. తీసుకున్న లక్షకిట్లకు కేవలము 25 శాతం మాత్రమే బిల్లు చెల్లించామని , మేము కిట్లు ఆర్డర్ ఇచ్చిన సమయంలో ఇండియా అవి తయారు కాలేదన్నారు. అవసరమయితే కిట్ల కొనుగోలుకు సంబంధించి  శ్వేతపత్రం విడుదల చేస్తాం అన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle