newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

కాశ్మీర్ కొత్త మ్యాప్.. ఇండియా మ్యాప్‌లో కనిపించని అమరావతి

03-11-201903-11-2019 10:53:54 IST
2019-11-03T05:23:54.221Z03-11-2019 2019-11-03T05:22:35.497Z - - 20-11-2019

కాశ్మీర్ కొత్త మ్యాప్.. ఇండియా మ్యాప్‌లో కనిపించని అమరావతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశం కొత్త మ్యాప్ విడుదలైంది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయ్యే వరకూ 29 రాష్ట్రాలుండేవి. రాష్ట్రాల సంఖ్య 28కి చేరాయి. కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త  పటాన్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. పాత కశ్మీర్‌ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉన్నాయి. అందులోని లదాఖ్, లేహ్‌లను లదాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చారు. ఇందులో కార్గిల్‌ జిల్లాను కొత్తగా ఏర్పాటు చేశారు. కార్గిల్‌తో కలిపి రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో 14 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 28 జిల్లాలు ఏర్పాటయ్యాయి.

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులను కేంద్రం గుర్తించింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానిని మాత్రం ఎక్కడా చూపించకపోవడం గమనించాల్సిన అంశం. ఏపీ మినహా. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మ్యాపుల్లో వాటి రాజధాని నగరం పేరును పొందుపరిచింది. ఆ రాజధాని నగరం ఉన్న ప్రాంతాన్ని గుర్తించింది.

కానీ. ఆంధ్రప్రదేశ్ అని మాత్రం గుర్తించి వదిలేసింది. అమరావతి అనే రాజధాని ఉందన్న సంగతి మరచిపోయిందా అనేది చర్చనీయాంశంగా మారింది. 

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఏపీకి రాజధాని అనేది లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం నిపుణులు కమిటీని నియమించి.. విజయవాడ-గుంటూరు మధ్య మంగళగిరి పరిసరాల్లో రాజధానిని నిర్మిస్తామని ప్రకటించింది. 

ఇందుకోసం రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ ఏర్పాటుచేసింది. ఈ ప్రాంతంలో రాజధాని, ఇతర నిర్మాణాల కోసం 33 వేల ఎకరాల ల్యాండ్ ఫూలింగ్ ద్వారా భూములు సేకరించారు.

అమరావతి పేరుతో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మించినా అవన్నీ తాత్కాలికమేనని కేంద్రానికి తెలపడంతో మ్యాపులో రాజధాని సంగతి ప్రస్తావించలేదు. రాష్ట్ర రాజధాని ఏదనే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టతా లేదు. అలాగని విజయవాడను రాజధానిగా గుర్తించలేదని చెబుతున్నారు.

అమరావతి నిర్మాణానికి ప్రధాని మోడీ వచ్చినా రాజధాని సంగతిని గుర్తించకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా సంగతిని మరిచిపోయిన కేంద్రం రాజధాని విషయంలోనూ ఏపీ పట్ల వివక్ష చూపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇటు వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా అమరావతిని మారుస్తామని ప్రకటనలు చేయడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle