newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

13-10-201913-10-2019 14:47:56 IST
Updated On 14-10-2019 12:42:33 ISTUpdated On 14-10-20192019-10-13T09:17:56.435Z13-10-2019 2019-10-13T09:17:32.773Z - 2019-10-14T07:12:33.166Z - 14-10-2019

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో విపక్షాలు విమర్శించినట్టు రాష్ట్రంలో ఇసుక కొరత లేదని, అయితే ప్రజా అవసరాలకు అనుగుణంగా రోజుకు సగటున లక్ష టన్నుల ఇసుకను సరఫరా చేయాలని  రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి  అధికారులను ఆదేశించారు. అలాగే, ఇసుక సరఫరాలో స్థానికులకు ప్రాధాన్యతనివ్వాలని ఇసుకను వారికోసం కొంతమేర రిజర్వు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సూచించారు. 

జిల్లా జాయింట్‌ కలెక్టర్లు, మైనింగ్‌ అధికారులతో ఇసుక సరఫరాపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాలు తగ్డడం వల్ల ఇసుక సరఫరా పెరిగిందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో రోజుకు 35 వేల టన్నుల మేర సరఫరా జరుగుతోందని, వరదలు తగ్గడంతో ఇసుక మేటలను గుర్తించి రోజుకు సగటున లక్ష టన్నుల మేర ఇసుకను అందుబాటులోకి తెస్తామన్నారు.

ఇందుకోసం ప్రతి జిల్లాలోని జాయింట్‌ కలెక్టర్లు ఆయా జిల్లాల్లోని మైనింగ్‌ అధికారులతో సమన్వయపర్చుకుని ఇసుక సరఫరాలో పాదర్శకత పాటించాలని ఆదేశించారు. 

ప్రజలకు ఇసుకవల్ల ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఇసుక సరఫరాపై జాయింట్‌ కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలన్నారు. అధికారులు ఈ విషయంలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం ఆదేశించారని, ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి చెడ్డపేరు లేకుండా చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతాల్లోని పట్టా భూముల్లో ఇసుక తవ్వాలను చేపట్టడం ద్వారా పూర్తిస్థాయిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అందించాలని మంత్రి ఆదేశించారు.

వరదలు తగ్గుముఖం పట్టేవరకు ప్రత్యామ్నాయం వైపే పూర్తిస్థాయి దృష్టి సారించాలన్నారు. ఆ దిశగా ఇప్పటికే ఇసుక తవ్వకాలకోసం పలు జిల్లాల నుండి పట్టా భూముల రైతులు దరఖాస్తులు చేశారన్నారు. తక్షణమే వాటిని పరిశీలించి ఆమోదించడంతోపాటు తవ్వకాలు ప్రారంభించాలన్నారు. రీచ్‌లకు అనుగుణంగా ఇసుక స్టాక్‌ పాయింట్లను గుర్తించాలన్నారు.

రాష్ట్రంలో నిర్మాణరంగం ఇసుక కొరత కారణంగా సంక్షోభానికి గురైంది. ఈ నేపథ్యంలో మొదటి, రెండు, మూడు గ్రేడుల్లోని రీచ్‌లలో ట్రాక్టర్లకు అనుమతించాలన్నారు.

గ్రామ సచివాలయ సిబ్బందిని రీచ్‌ల వద్ద నియమించి ఆన్‌లైన్‌ ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలన్నారు. ఇసుక లభ్యత ఉన్న జిల్లాల్లో స్థానికుల అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు.

 

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   10 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle