newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

కాల్వకు తలనొప్పులు

15-03-201915-03-2019 07:44:26 IST
2019-03-15T02:14:26.697Z15-03-2019 2019-03-15T02:09:22.406Z - - 24-02-2020

కాల్వకు తలనొప్పులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఈసారి మంత్రి కాల్వ శ్రీనివాసులు గెలవడం అంత ఈజీ కాదన్న వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ సీటు నుంచే పోటీ చేసిన కాల్వ శ్రీనివాసులకు, టీడీపీలోని అన్ని వర్గాల నేతలు మద్దతు పలికారు. కానీ ఇప్పుడు రాయదుర్గం టీడీపీలో విబేధాలు రోడ్డెక్కాయట. నియోజకవర్గంలో బలమైన టీడీపీ నేత, మాజీ ఎంఎల్ఏ మెట్టు గోవింద రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. కాల్వ శ్రీనివాసులు మీద కోపంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈయనతో పాటు మరో టీడీపీ నేత దీపక్ రెడ్డి కూడా మంత్రి మీద కోపంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈయన పార్టీని వీడకపోయినా... కాల్వ శ్రీనివాసులుకు సహకరించరని స్పష్టం చేశారట. ఇక టీడీపీలో మారుతున్న తాజా పరిస్తితులను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారట రాయదుర్గం వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి. ఇప్పటికే ఆయన మెట్టు గోవింద రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. దీపక్ రెడ్డికి రాయబారాలు పంపుతున్నారు. ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు కాల్వ శ్రీనివాసులును ఇబ్బంది పెడుతోందట. ఇక అంతా సజావుగా జరిగితే... తన విజయం ఖాయమని కాపు రామచంద్రారెడ్డి ధీమాగా ఉన్నారట.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle