newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా చంద్రబాబు పర్యటనలు

11-10-201911-10-2019 07:43:55 IST
2019-10-11T02:13:55.152Z11-10-2019 2019-10-11T02:12:25.008Z - - 09-12-2019

కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా చంద్రబాబు పర్యటనలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో తెలుగుదేశం శ్రేణుల్లో స్థైర్యం, ధైర్యం నింపడమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి లో అడుగడుగునా తన ముద్రర, తెలుగుదేశం ప్రభుత్వ ముద్ర ఉంటుందని ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటారు.

రాజకీయంగా తెలుగుదేశం విధానాలతో విభేదించే వారు సైతం హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో చంద్రబాబు కృషిని ప్రశంసించకుండా ఉండరు. తెరాస అధినేత కుమారుడు, ఆ రాష్ట్ర ఐటీ మంత్రిర కల్వకుంట్ల తారకరామారావు సైతం చంద్రబాబు పరిచిన బాట కారణంగానే తన హయంలో ఐటీ పరుగులు తీస్తున్నదని ఒక సందర్భంలో అంగీకరిరంచారు.

అలాగే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కూడా చంద్రబాబు ప్రయత్నాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. విశాఖ విమానాశ్రయం, విశాఖ సుందరీకరణ విషయాలలో తెలుగుదేశం హయాంలోనే పనులు జరిగాయని చెప్పడానికి ఎవరూ ముందువెనుకలాడరు.

రాజకీయాలలో జయాపజయాలను ప్రతి సారీ మంచి చెడులే కారణం కావు. ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ ఎరుగనంతటి ఘోర పరాజయాన్ని ఆ పార్టీ మూటగట్టుకుంది. దీంతో సహజంగానే పార్టీ శ్రేణుల్లో నిరాశ, నిస్తేజం అలుముకుంది.

పలువురు కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు. మిగిలిన నేతలు కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణల్లో నిజానిజాలు, వాస్తవాల మాట ఎలా ఉన్నా...ముందుగా కేసులు, దర్యాప్తు సంస్థల దాడులను ఎదుర్కొనక తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పార్టీని పటిష్టంగా ఉంచాల్సిన బాధ్యత అధినేతగా చంద్రబాబుపై ఉందనడంలో సందేహం లేదు. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి చంద్రబాబు సన్నద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రసంగాల ద్వారా శ్రేణులలో ఉత్సాహం నింపేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలియజేస్తున్నాయి.

తాజాగా విశాఖలో జరిగిన తెలుగుదేశం సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ఉత్తేజపూర్వకంగా మాట్లాడారు.  తెలుగుదుశం పరాజయం పాలైన ప్రతిసారీ నేలకు కొట్టిన బంతిలా మరింత వేగంగా పైకి లేస్తుందన్న సోదాహరణంగా చెబుతూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్నీ నింపడానికి ప్రయత్నించారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైనప్పుడు... తేరుకుని ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శల దాడి చేయడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి...విమర్శలకు అవకాశం లేని విధంగా ప్రజారంజక పథకాలతో విపక్షాలకు అవకాశం లేకండా చేశారు.

అయితే ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి మాత్రం అందుకు భిన్నంగా గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడడానికి ఇస్తున్న ప్రాధాన్యత...పాలనకు ఇవ్వడం లేదన్న భావన జనంలో  నెలకొంటున్న సమయంలో చంద్రబాబు అప్రమత్తమయ్యారు.

పార్టీ శ్రేణులను ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సమాయత్తం చేయడంతో పాటు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా తన కార్యాచరణను రూపొందించుకున్నట్లు కనిపిస్తున్నది. అందుకే నిత్యం పార్టీ శ్రేణులతో మమేకమయ్యేల జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు.

అదే సమయంలో గుంటూరు పార్టీ కార్యాలయానికి నిత్యం వస్తూ.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలొ తెలుగుదేశం విపక్షంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నిత్యం ఎన్టీఆర్ భవన్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు.

పార్టీ విధానాలు, కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తూ  కేడర్ లో నిరాశా నిస్ఫృహలు దరి చేరనిచ్చే వారు కాదు.   విశాఖ లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో కూడా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూనే తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి కార్యకర్తలలో ఉత్సాహం నింపేలా ప్రసంగించారు. 

ఓటమితో నిరాశ చెందడం కాదనీ..మళ్లీ గెలిచేందుకు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని ఉద్బోధించిన చంద్రబాబు..సంక్షోభంలో కూడా సానుకూల దృక్ఫథాన్ని అలవరచుకోవాలని కేడర్ కు పిలుపు నిచ్చారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle